For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకింగ్ వ్యవస్థలో మొబైల్ నెంబర్ ప్రాముఖ్యత?

By Nageswara Rao
|

బ్యాంకింగ్ వ్యవస్ధ ఆన్‌లైన్‌ అయిన తర్వాత బ్యాంకు కస్టమర్లు నిర్వహించే ప్రతి లావాదేవీకి సంబంధించి మొబైల్‌కు ఎస్ఎమ్ఎస్ నోటీసు రావడమే లేదంటే వన్‌టైమ్ పాస్ వర్డ్ వస్తుండటం మనం గమిస్తున్నాం. బ్యాంకింగ్ లావాదేవీలు సురక్షితంగా నిర్వహించాలంటే మొబైల్ నెంబర్‌ని రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి.

మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవడం వల్ల కస్టమర్లకు చాలా ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా నగదు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఎవరైతే కస్టమర్లు మొబైల్ నెంబర్‌ని రిజిస్టర్ చేసుకున్నారో వారు మాత్రమే ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించగలిగే వెసులుబాటుని కల్పించాయి.

 అన్ని లావాదేవీలు ట్రాక్

అన్ని లావాదేవీలు ట్రాక్

మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఏటీఎంలో లేదా షాపింగ్ కాంప్లెక్స్‌లో నగదు లావాదేవీలు నిర్వహిస్తే అలాంటి వాటిని మీరే ట్రాక్ చేయవచ్చు. మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ఎలాంటి లావాదేవీలు నిర్వహించినా వెంటనే మీ మొబైల్‌కు మేసేజ్‌లు వస్తాయి.

 ఇన్‌కమ్ ట్యాక్స్‌ లేదా ఆధార్ కార్డు

ఇన్‌కమ్ ట్యాక్స్‌ లేదా ఆధార్ కార్డు

ఇన్‌కమ్ ట్యాక్స్ లేదా ఆధార్ కార్డుకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయాలన్నా మొబైల్ నెంబర్‌ను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది. ఇన్‌కమ్ ట్యాక్స్‌ వెబ్‌సైట్‌లో ఎలాంటి మార్పులు చేయాలన్నా మీ మొబైల్‌కు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ ఆధారంగానే మార్పులు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఆధార్ కార్డులో ఏమైనా తప్పులుంటే వాటిని సరి చేసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ తప్పనిసరి.

 డెబిట్‌కార్డు పొగొట్టుకున్నప్పుడు

డెబిట్‌కార్డు పొగొట్టుకున్నప్పుడు

మీ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ లీకైనా లేదా డెబిట్ కార్డు పొగొట్టుకున్నా తిరిగి వాటిని పొందాలంటే మొబైల్ నెంబర్ తప్పనిసరి. డెబిట్ కార్డు దొంగిలించిన వ్యక్తి జరిపే ప్రతి లావాదేవీకి సంబంధించి మీకు పూర్తి సమాచారం వస్తుంది. ఉదాహరణకు ఏ ప్రాంతంలోని ఏటీఎం నుంచి నగదు లావాదేవీ జరిగింది లాంటివి.

 బ్యాంక్ నుంచి రుణం పొందినప్పుడు

బ్యాంక్ నుంచి రుణం పొందినప్పుడు

బ్యాంక్ నుంచి రుణం పొందిన రుణదారుడు సకాలంలో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సంబంధించిన మేసేజ్‌లు ఎప్పటికప్పుడు మొబైల్ నెంబర్‌కే వస్తాయి. అంతేకాదు బ్యాంకుకు మీరు చెల్లించాల్సిన మొత్తం కంటే మీ ఖాతాలో తక్కువగా నగదు ఉన్నట్లైతే మొబైల్ నెంబర్‌నే బ్యాంకు ప్రతినిధులు సంప్రదిస్తారు.

మొబైల్ నెంబర్ మారిస్తే

మొబైల్ నెంబర్ మారిస్తే

మీరు మొబైల్ నెంబర్‌ను మార్చినా లేదా వేరే కొత్త మొబైల్‌ను తీసుకున్నప్పుడు ముందుగా బ్యాంకులో దానిని నవీకరించుకోండి. అలా లేని పక్షంలో ఆర్ధిక లావాదేవీలన్నింటినీ, మీ పాత మొబైల్ నెంబర్‌కే వెళతాయి. దీని వల్ల మీరు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది.

English summary

బ్యాంకింగ్ వ్యవస్థలో మొబైల్ నెంబర్ ప్రాముఖ్యత? | 7 Reasons To Register Your Mobile Number With Your Bank

With each banking transaction, we come across things like SMS notice, a One Time Password (OTP) or verification code on our mobile. It thus becomes imperative to register your mobile number with all of your bank accounts so that your financial transaction are done smoothly.
Story first published: Tuesday, August 18, 2015, 13:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X