For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బ్రేక్: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే సమయం?

By Nageswara Rao
|

గడిచిన రెండేళ్ల కాలంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 32,000 నుంచి రూ. 25000లకు పడిపోయింది. నాలుగేళ్ల కనిష్టానికి బంగారం ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు మార్కెట్ నిపుణులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లను నిలుపుదల చేసి బంగారంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సూచిస్తున్నారు.

బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఏడాది కాలానికి 8 నుంచి 8.5 శాతం వడ్డీ లభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పడటంతో బంగారంలో జరిపిన అమ్మకాలు, కోనుగోలుల్లో 9 శాతం వరకు వడ్డీ రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 24,000 ఉంది కాబట్టి ఏడాది తిరిగే సరికే రిటర్న్‌ల రూపంలో రూ. 26,400 వస్తుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బ్రేక్: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే సమయం?

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బ్రేక్: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే సమయం?

రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచితే ఈ ఏడాది చివరినాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.20,500 స్థాయికి పడిపోనున్నదని ఇండియా రేటింగ్స్ అండ్ రీసర్చ్ తెలిపింది.

 ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బ్రేక్: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే సమయం?

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బ్రేక్: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే సమయం?

ప్రస్తుతానికి బంగారంపై నెగిటివ్‌ ఔట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ధర ఐదేళ్ల కనిష్టానికి జారుతుంది. ఒకవేళ వచ్చే సమీక్షలో యూఎస్ ఫెడరల్ వడ్డీరేట్లను పెంచితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.20,500 నుంచి రూ.24 వేల మధ్యలో నమోదుకానున్నదని వెల్లడించింది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బ్రేక్: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే సమయం?

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బ్రేక్: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే సమయం?

ఫెడ్‌ నిర్ణయాన్ని బట్టి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 900-1050 డాలర్ల మధ్య కొనసాగవచ్చని అంచనావేసింది. అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితి తొలగేవరకు బంగారం ధరలు 2009 సంవత్సరానికి ముందరి స్థాయిలకు చేరే అవకాశాలు తక్కువని ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బ్రేక్: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే సమయం?

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బ్రేక్: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే సమయం?

అంతర్జాతీయ దేశాల ఆర్థిక పరిస్థితులు ఆందోళనకర స్థాయికి చేరుకోవడంతోపాటు యూఎస్ ఫెడరల్ తీసుకునే నిర్ణయమే ధరలకు దిశానిర్దేశం చేయనున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. ప్రపంచ బంగారం డిమాండ్‌లో దాదాపు సగం వాటా భారత్‌, చైనాలదే.

 ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బ్రేక్: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే సమయం?

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బ్రేక్: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే సమయం?

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన బంగారంలో చైనా, ఇండియా దేశాల్లో సగం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనాలో బంగారం డిమాండ్‌ 8 శాతం క్షీణించగా, భారత్‌లో డిమాండ్‌ 15 శాతం పెరిగిందని తెలిపింది. అయితే నికరంగా చూస్తే ప్రస్తుతం భారత్‌లో డిమాండ్‌ ఆరేళ్ల కనిష్ఠ స్థాయిల వద్ద ఉందని తెలిపింది.

English summary

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బ్రేక్: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే సమయం? | Is It Time To Break Fixed Deposits And Invest In Gold?

Gold prices in the last 2 years have dropped from Rs 32,000 to Rs 24,000 per 10 grams. Investors are now suggesting to move away from fixed deposits into gold after gold in India fell to a 4 year low. Does it makes sense at the moment to break your fixed deposit and invest in gold. Let's take a look.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X