For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘వాచ్‌ బ్యాంకింగ్‌’: హెచ్‌డీఎఫ్‌సీ నుంచి మరో సేవ

By Nageswara Rao
|

ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ‘వాచ్‌ బ్యాంకింగ్‌' పేరుతో మరో డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవను ఖాతాదారులకు అందుబాటులోకి తెస్తోంది. యాపిల్‌ వాచ్‌ ఆధారంగా దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు డిజిటల్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ నితిన్‌ చుగ్‌ ప్రకటించారు.

ముంబైలోని హెడ్‌డీఎఫ్‌సీ ప్రధాన కార్యాలయం నుంచి ‘వాచ్‌ బ్యాంకింగ్‌' వివరాలు వెల్లడించారు. యాపిల్‌ కంపెనీ తన వాచ్‌ను భారత్‌లో విడుదల చేసిన వెంటనే ‘వాచ్‌ బ్యాంకింగ్‌' సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. యాపిల్ వాచ్ ద్వారా దేశంలో ఈ తరహా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెస్తున్న మొట్టమొదటి బ్యాంక్ తమదేనని చెప్పారు.

ఇప్పటికే హెడ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకున్న ఖాతాదారాలు ఈ వాచ్ బ్యాంకింగ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. కొత్తగా బ్యాంకు ఖాతాలను ప్రారంభించిన వారు మాత్రం బ్యాంక్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంది.

HDFC Bank unveils app for Apple Watch

ఈ యాప్‌ ద్వారా తమ ఖాతాలకు సంబంధించిన సమాచారం చూడడంతో పాటు మొబైల్‌, డిటిహెచ్‌ రీచార్జింగ్‌ లాంటివి చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాకు సంబంధించిన స్టేట్‌మెంట్‌, చెక్‌బుక్‌ల కోసం కూడా బ్యాంక్‌కు రిక్వెస్ట్‌ చేసుకోవచ్చు. వాచ్ బ్యాంకింగ్ ద్వారా ప్రస్తుతం ఖాతాదారులు పది రకాల సేవలను పొందవచ్చు.

ప్రస్తుతం యాపిల్‌ వాచ్‌కే పరిమితమైన ‘వాచ్‌ బ్యాంకింగ్‌' సదుపాయాన్ని భవిష్యత్‌లో ఆండ్రాయిడ్‌ వాచ్‌లకు సైతం విస్తరిస్తామని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ నితిన్‌ చుగ్‌ చెప్పారు.

English summary

‘వాచ్‌ బ్యాంకింగ్‌’: హెచ్‌డీఎఫ్‌సీ నుంచి మరో సేవ | HDFC Bank unveils app for Apple Watch

HDFC Bank, the country’s second largest private sector bank, unveiled its banking application for the Apple Watch. The app allows its customers to view their account summaries, block cards, recharge their mobile phones and DTH connections.
Story first published: Monday, July 6, 2015, 13:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X