For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ రిటర్నులు మరింత సులభం, ఆగస్టు 31 గడువు

By Nageswara Rao
|

ఐటీ రిటర్నుల దాఖలు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభంగా మార్చింది. ఇటీవల విడుదల చేసిన 14 పేజీల ఆదాయం పన్ను రిటర్ను (ఐటీఆర్) ఫారం స్థానంలో కేవలం 3 పేజీల అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది. అంతేకాదు పన్ను చెల్లింపుదారులు తమ పేరుతో ఉన్న నిరుపయోగ బ్యాంకు ఖాతాల వివరాలతో కూడిన విదేశీ పర్యటనలపై సమాచారం ఇవ్వాలన్న నిబంధలను ఉపసంహరించుకుంది.

పన్ను చెల్లింపుదారులు లావాదేవీలు జరుపుతున్న బ్యాంక్ ఖాతాలతోపాటు, తమ పాస్‌పోర్ట్ నంబర్ వివరాలను వెల్లడించాలని ఐటీ శాఖ వెల్లడించింది. కొత్త ఐటీఆర్ ఫారాలకు సాప్ట్‌వేర్ రూపొందించాల్సి ఉన్నందున ఈ ఏడాది రిటర్నులు దాఖలు చేసేందుకు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది.

Simpler IT forms, new deadline: No foreign visit details or bank balances required

ఈ ఫైలింగ్ కోసం కొత్త ఐటీఐఆర్ ఫారాలను జూన్ మూడో వారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ప్రతి ఏడాది జూన్ 31లోగా రిటర్నులు సంప్రదించాల్సి ఉంది. అయితే కొత్త ఐటీఆర్ ఫారంలో ఇతర వివరాలను సేకరించాల్సి ఉన్నందున ఈ ఏడాది తేదీని పొడిగించింది.

మూలధన ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం లేదా విదేశాల్లో ఆస్తులు, హిందు అవిభాజ్య కుటుంబ (హెచ్‌యూఎఫ్) కేటగిరీ వ్యక్తుల కోసం ఐటీ శాఖ కొత్తగా ఐటీఆర్ 2ఏ ఫారాన్ని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ కేటగిరీకి చెందిన వారు ఐటీఆర్ 2 ద్వారా రిటర్నులు దాఖలు చేస్తున్నారు.

English summary

ఐటీ రిటర్నులు మరింత సులభం, ఆగస్టు 31 గడువు | Simpler IT forms, new deadline: No foreign visit details or bank balances required

A new form ITR 2A has been brought out by the ministry which can be filed by an individual or HUF who does not have capital gains, income from business/ profession or foreign asset/foreign income.
Story first published: Monday, June 1, 2015, 16:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X