For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వశిష్ఠ పెన్షన్ బీమా యోజనలో పొదుపు మంచిదేనా?

By Nageswara Rao
|

ఉద్యోగ విరమణ అనంతరం అందుకున్న మొత్తాన్ని ఎక్కడ పొదుపు చేయాలని ఆలోచించే వారి కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలున్నాయి. ఇలాంటి పథకాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకం వశిష్ఠ పెన్షన్ బీమా యోజన. ఆగస్టు 14, 2015 వరకు అందుబాటులో ఉన్న ఈ పథకం విశేషాలు వన్ ఇండియా పాఠకులకు ప్రత్యేకం.

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వశిష్ఠ పెన్షన్ బీమా యోజన పథకంలో 60 ఏళ్లు నిండిన భారతీయులెవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 5000 ఫించను వచ్చేలా ఈ పథకంలో డబ్బు జమ చేయాల్సి ఉంటుంది.

ఎల్‌ఐసీ ఈ పించను పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ పథకంలో ఫించను నెలకొసారి తీసుకోవచ్చు. నగదు అవసరం లేదంటే 3, 6, 12 నెలలకొకసారి తీసుకోవచ్చు. మీరు డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి ఫించను ఎప్పుడు తీసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది.

కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కలిసి నెలకు ఐదు వేలకు మించి పింఛను తీసుకునేలా చేసే డిపాజిట్‌‌కు అనుమతించరు. ఎన్ఈఎఫ్‌టీ లేదా ఈసీఎస్ ద్వారా పింఛన్‌ని నేరుగా బ్యాంకు ఖాతాకే బదిలీ చేస్తారు.

 know about varishtha pension bima yojana

డిపాజిట్ చేసిన దంపతులకు తీవ్ర అనారోగ్యం వంటి ప్రత్యేక కారణాలు ఉంటే తప్ప డిపాజిట్ చేసిన మొత్తాన్ని 15 ఏళ్ల వరకూ వెనక్కి తీసుకునే వెసులుబాటు ఈ పథకంలో లేదు. 15 ఏళ్ల గడువుకు ముందు డిపాజిట్ దారు ఉపసంహరించుకుంటే డిపాజిట్ చేసిన మొత్తంలో 98 శాతం తిరగి ఇస్తారు.

అదే గడువుకి ముందే డిపాజిట్ దారు మరణిస్తే డిపాజిట్ మొత్తాన్ని ఇస్తారు. ఈ పథకం పేరులో బీమా ఉన్నా ఎలాంటి బీమా వర్తించదు. అయితే డిపాజిటే చేసిన మూడేళ్ల తర్వాత డిపాజిట్ మొత్తంలో 75 శాతం అప్పుగా తీసుకనేందుకు వీలుంది.

వశిష్ఠ పెన్షన్ బీమా యోజన పథకం కాల పరిమితి 15 సంవత్సరాలు కాగా, బ్యాంకు డిపాజిట్‌ల గరిష్ట కాలపరిమితి 10 సంవత్సరాలే. బ్యాంకులో డిపాజిట్ దారు ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసుకోవచ్చు. వశిష్ఠ పెన్షన్ బీమా యోజన పథకంలో రూ. 6,66,665 కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి వీల్లేదు.

వశిష్ఠ పెన్షన్ బీమా యోజన పథకంలో డిపాజిట్ చేసిన మొత్తానికి 3.09 శాతం సేవా పన్ను రద్దు చేస్తున్నట్లు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవలే ప్రకటించారు.

ముగింపు:

వశిష్ఠ పెన్షన్ బీమా యోజన పథకంలో 15 ఏళ్లలోపు డిపాజిట్ రద్దు చేసుకోవడం సాధ్యం కాదు. అదే బ్యాంకు డిపాజిట్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు రద్దు చేసుకోవచ్చు. వశిష్ఠ పెన్షన్ బీమా యోజన పొదుపు కొన్ని పరిస్ధితుల్లో ప్రతికూలంగానూ, మరికొన్ని పరిస్ధితుల్లో అనుకూలంగా ఉంటుంది.

English summary

వశిష్ఠ పెన్షన్ బీమా యోజనలో పొదుపు మంచిదేనా? | know about varishtha pension bima yojana

know about varishtha pension bima yojana.
Story first published: Tuesday, May 12, 2015, 19:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X