For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బోనస్ డబ్బుని ఎలా వినియోగించుకోవాలి...?

By Nageswara Rao
|

చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్‌లు ప్రకటిస్తుంటాయి. బోనస్ రూపంలో వచ్చే నగదుని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయకుండా అవసరాలకు తగ్గట్టుగా ఖర్చు పెట్టాలి. అలా వచ్చే ఆ డబ్బును ఖర్చు చేసేందుకు సరైన ప్రణాళికను వేసుకున్నారా?

ఇల్లు కొనేందుకు:
బోనస్ రూపంలో వచ్చిన నగదుని ఇల్లు కొనేందుకు దాచుకుంటే మంచిది. డెట్ ఫండ్ల రూపంలో లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఈ నగదుని పెట్టేయండి. దీని వల్ల భవిష్యత్తులో మీరు ఇల్లుని కొనాలని అనుకున్నప్పుడు మార్జిన్ మనీ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.

ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం:
మీరు గతంలో ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొని ఉంటే, అప్పటికీ, ఇప్పటికీ అవసరాలు మారుతుంటాయి. కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ చెక్ చేసుకోవడం మంచిది. తక్కువ మొత్తంలో ఉంటే, టర్మ్ పాలసీ తీసుకునేందుకు ప్రయత్నించండి. మీరు అందుకున్న బోనస్‌లో కొంత భాగాన్ని ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం కేటాయించండి.

బంగారం కొనుగోలు:
మీరందుకున్న బోనస్‌తో బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిది. భవిష్యత్తు అవసరాల కోసం పసిడిలో మదుపు చేయాలనుకుంటే బంగారు ఫండ్లను లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లను చూడండి.

 7 smart ways to use bonus money

అప్పు లేకుండా వాహనం:
మీ వద్ద ఉన్న పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని కొనాలని అనుకుంటున్నారా? మీకు వచ్చిన బోనస్‌తో కొత్త బండిని కొనుగోలు చేయండి. దీంతో ఎలాంటి అప్పు లేకుండా కొత్త బండిని కొనుగోలు చేసినవారవుతారు. ఒకవేళ బండికి సరిపడ నగదు కుదరకపోతే, తక్కువ మొత్తంలో అప్పు తీసుకుని బండి కొనుగోలు చేసినట్లైతే, తొందరగా అప్పు తీర్చేయవచ్చు.

సిప్ చేయండి:
బోనస్ రూపంలో వచ్చిన మొత్తాన్ని డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. ఆ తర్వాత క్రమంగా బదిలీ విధానంలో ఈక్విటీ ఫండ్లకు మళ్లించండి. ఇలా చేయడం వల్ల ఈ నగదు వృద్ధి చెందుతుంది.

అప్పులు తీర్చండి:
బ్యాంకులో వ్యక్తిగత రుణం తీసుకుంటే, ఖర్చులు ఏమీ లేకపోతే ముందుగా మీరు ఆ అప్పుల్ని తీర్చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ అప్పు భారం తగ్గుతుంది.

అత్యవసర పరిస్ధితుల్లో:
మనిషి జీవితంలో పరిస్ధితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాబట్టి అత్యవసర పరిస్ధితుల్లో నగదు వినియోగించుకునేందుకు గాను అత్యవసర నిధిగా ఉపయోగించుకోండి. కనీసం ప్రతి ఒక్కరికీ మూడు నెలల ఖర్చులకు సరిపోయే అత్యవసర నిధి ఉండాలి. ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడానికి బోనస్ వినియోగించుకోవచ్చు.

English summary

బోనస్ డబ్బుని ఎలా వినియోగించుకోవాలి...? | 7 smart ways to use bonus money

Most companies announce bonuses once or twice a year. Bonuses are based on company performance as well as the contribution of employees.
Story first published: Thursday, May 21, 2015, 17:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X