For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీం: పెట్టుబడి పెట్టొచ్చా?

By Nageswara Rao
|

ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి పొదుపు చేయాలన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన అవసరాలను తీర్చుకుంటూనే మిగిలిన సొమ్మును భవిష్యత్తుకోసం దాచిపెట్టడం.. అందుకోసం సాంప్రదాయంగా వస్తున్న బ్యాంకు ఫిక్సెడ్‌ డిపాజిట్లు, పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకాలు.. ఇలా ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి.

వీటన్నింటిలోకి నష్ట భయం తక్కువగా ఉండి, సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండే పథకాల్లో పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకాలు ఎంతో ఉత్తమం. కాబట్టి పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం గురించి తెలుసుకుందాం.

వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?

పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో తొమ్మిది శాతం వడ్డీ లభిస్తుంది. కనీసం వెయ్యి రూపాయలతో ఈ పథకంలో చేరవచ్చు. వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా మూడులక్షల రూపాయాలు, జాయింట్‌గా అయితే ఆరు లక్షల రూపాయల వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు. ఏడాది తరువాత పెట్టుబడిని ఉపసంహరించుకునే అవకాశం ఉంది.

ఏడాది తరువాత పెట్టుబడి ఉపసంహరించుకుంటే డిపాజిట్‌ సొమ్ములో ఐదు శాతం తగ్గించి ఇస్తారు. మూడేళ్ల తరువాత అయితే ఎలాంటి కోత లేకుండా డిపాజిట్‌ సొమ్మును తిరిగి ఇస్తారు. చివరిదాకా డిపాజిట్‌ ఖాతాలో ఉంచితే వడ్డీతోపాటు పది శాతం బోనస్‌గా లభిస్తుంది. గడువుకు ముందే తీసుకుంటే బోనస్‌ ఉండదు. సెక్షన్‌ 80ఎల్‌ కింద ఈ పథకంలో ఉంచిన పెట్టుబడిపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

Post Office Monthly Income Scheme: Should You Consider Investing?

రిటైర్డ్‌ ఉద్యోగులకు, పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్న వారికి ఇది అనుకూలమైన పధకంగా చెప్పవచ్చు. అదేవిధంగా పెద్ద మొత్తంలో పొదుపుచేసి ప్రతి నెలా రాబడి అందుకోవాలని భావించే వారితోపాటు పెన్షన్‌ సదుపాయంలేని వారికి ఇది అనుకూలమైన పథకం.

ఏమిటీ ఎంఐపీ?

నెలసరి ఆదాయ పథకాలు అనగానే నెలనెలా క్రమం తప్పకుండా ఆదాయం అందించే పథకాలే అని భావిస్తాం. ఇవీ అలాంటివే అయినప్పటికీ సంప్రదాయ నెలసరి ఆదాయ పథకాలకూ వీటికీ చాలా వ్యత్యాసం ఉంది. తపాలా పొదుపు పథకాలు, బ్యాంకు డిపాజిట్ల లాంటి డెట్‌ పథకాలల్లో వచ్చిన వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎంఐపీలతో పన్ను పరంగా కలిసొస్తుంది. ఇందులో వచ్చిన డివిడెండ్‌కు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

నామిని సౌకర్యం:

పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో అకౌంట్ తెరిచే సమయంలోనే మీ నామిని పేరును ప్రకటించే వెసులుబాటు ఉంది.

మెచ్యూరిటీ:

డిసెంబర్ 1, 2011 నుంచి ఈ పథకాలకు మెచ్యూరిటీ కాలపరిమితిని ఐదేళ్లు చేశారు.

పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో పెట్టుబడులు పెట్టొచ్చా?

పన్ను పరంగా కలిస్తాయి. పన్ను వర్తించే ఆదాయం గరిష్ఠంగా ఉండి, పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయానికి కూడా పన్ను వర్తించకుండా ఉండాలని భావించేవారు ఇలాంటి పథకాలను ఎంచుకోవచ్చు. మీకు క్రమం తప్పకుండా ఆదాయం రావాలనుకొని, ఈ ఆదాయం మీదే ఆధారపడి జీవనం సాగించాలనుకుంటే మాత్రం ఎంఐపీలు ఏ మాత్రం ఉపయోగపడవు.

English summary

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీం: పెట్టుబడి పెట్టొచ్చా? | Post Office Monthly Income Scheme: Should You Consider Investing?

Post office monthly income scheme is for individuals who are less risk averse and looking for safe investment option with decent returns. The scheme is backed by the Government of India and hence there is ample safety.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X