For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంటికి భూకంపం, సునామీ నుంచి బీమా ఉందా? (ఫోటోలు)

By Nageswara Rao
|

సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు మనలో చాలా మంది అప్పులు చేసి మరీ ఇంటిని నిర్మించుకుంటారు. ఇంటి నిర్మాణం తర్వాత ఇల్లు అందంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో అత్యంత ఖరీదైన వస్తువులతో అలంకరిస్తుంటారు.

అందంగా నిర్మించుకున్న ఇంటికి మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోరు. నేపాల్‌లో భూకంపం సంభవించడం వల్ల అక్కడి పురాతన భవనాలు, పెద్ద పెద్ద భవంతులు నేలమట్టమయ్యాయి. ఇలాంటి సహజ విపత్తుల సంభవించినప్పుడు ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుంటే కొంత వరకు లాభపడొచ్చు.

కొన్ని ఇన్సూరెన్స్ సంస్ధలు భూకంపం, సునామీ, వరదలు లాంటి సహజ విపత్తులతో పాటు ఇంటిలోని ఖరీదైన వస్తువులకు కూడా పరిహారాన్ని చెల్లిస్తాయి. కాబట్టి హోం ఇన్సూరెన్స్ పాలసీని కోనుగోలు చేసే ముందు ఇలాంటి వాటికి పరిహారం లభిస్తుందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి.

బ్యాంకుల నుంచి హోం లోన్ తీసుకుంటున్నప్పుడు, మీ ఇంటికి బ్యాంకులు ఎలాంటి ఇన్సూరెన్స్‌ని ప్రతిపాదించవు. సాధారణ హోం ఇన్సూరెన్స్‌లో సహజ విపత్తులు సంభవించినప్పుడు పరిహారం ఇవ్వవు. అందు కోసం ప్రత్యేకించి హోం ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాల్సి ఉంది. అవేంటో తెలుసుకుందాం?

 సహజ విపత్తుకి వ్యతిరేకంగా భీమా:

సహజ విపత్తుకి వ్యతిరేకంగా భీమా:

ఈ తరహా ఇన్సూరెన్స్‌లో నిప్పంటుకోని ఇల్లు తగలబడటం, భూకంపాలు, సైక్లోన్, తుఫాన్, ఇల్లు తిరగబడటం లాంటి వాటికి పరిహారం చెల్లిస్తారు.

 ఐసీఐసీఐ లాంబోర్డ్ హోం ఇన్సూరెన్స్:

ఐసీఐసీఐ లాంబోర్డ్ హోం ఇన్సూరెన్స్:

ఐసీఐసీఐ లాంబార్డ్ హోం లోన్ ఇన్సూరెన్స్ ఇంటి నిర్మాణం, ఇంటిలోని వస్తువలు లాంటి రెండింటీకి వర్తిస్తుంది. అంతేకాదు నిప్పంటుకోని ఇల్లు తగలబడినా లేదా ఇంట్లో దోపిడీ, దొంగతనం చేయబడ్డా వర్తిస్తుంది. ఇక కంటెంట్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే బట్టలు, గృహోపకరాణాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఫర్నీచర్, జ్యూయలరీ, పెయింటింగ్ లాంటి వాటికి కూడా వర్తిస్తుంది.

 హెచ్‌డీఎఫ్‌సీ ఈర్గో హోం ఇన్సూరెన్స్:

హెచ్‌డీఎఫ్‌సీ ఈర్గో హోం ఇన్సూరెన్స్:

ఈ ఇన్సూరెన్స్ పాలసీలో కూడా మీ ఇల్లు తుఫాన్, సైక్లోన్, నిప్పంటుకోవడం, సునామీ, వరదలు, భూకంపాల్లో నేలమట్టమైతే పూర్తి పరిహారం లభిస్తుంది.

 టాటా ఏఐజీ హోం ఇన్సూరెన్స్:

టాటా ఏఐజీ హోం ఇన్సూరెన్స్:

ఈ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఇంటికి నిప్పంటుకోవడం, భూకంపాల వల్ల ఇల్లు దెబ్బతినడం, సైక్లోన్, తుఫాన్, వరదలు, గొడవలు, హర్తాళ్లు, స్టైక్‌లు లాంటి వాటిలో మీ ఇల్లు దెబ్బతింటే పరిహారం చెల్లిస్తారు.

English summary

మీ ఇంటికి భూకంపం, సునామీ నుంచి బీమా ఉందా? (ఫోటోలు) | Does your Home Insurance Cover Natural Calamities Like Earthquake and Tsunami?

Individuals take so much pain in building their dream home and decorating with expensive items, but fail to take insurance for the same.
Story first published: Wednesday, April 29, 2015, 14:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X