For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'అప్పు' ఏ సందర్భంలో చేస్తే మంచిది?

By Nageswara Rao
|

సాధారణంగా అవసరాలకు సరిపడా డబ్బు ఎవరి దగ్గరా ఉండదు. అలాంటి సందర్భంలో చేబదులు లేదా అప్పు చేస్తుంటారు. ఇలా చేయడం తప్పు కాదు. కాకపోతే మన అవసరాలకు తగ్గట్టుగా చూసుకుని, జాగ్రత్తగా అప్పు చేస్తే ఇబ్బంది ఉండదు.

ఇల్లు కొనాలనే ఆలోచన వచ్చినప్పుడు:

నిజానికి ఆస్తిని పెంచే ఇల్లు, ప్లాటు, బంగారం లాంటివి కొనుగోలు చేసేటప్పుడు అప్పు చేయడం మంచిదే. ఇల్లు కొనాలనే ఆలోచన వచ్చిందనుకోండి. ముందుగా మీ దగ్గర ఎంత డబ్బు ఉంది. మీరు చేస్తున్న ఉద్యోగం, వస్తున్న జీతం, బ్యాంకు నుంచి తీసుకుంటున్న రుణం, దానిని ఎన్ని సంవత్సరాల్లో తీర్చాలి, వడ్డీ ఎంత? నెల నెలా మన ఇతరత్రా ఖర్చులు పోను వాయిదాలు చెల్లించే స్ధితిలో ఉన్నామా లేదా అనేది ఆలోచించుకుని ఇంటిని కొనుగోలు చేయడం మంచింది.

వాహనం కొనాలని ఆలోచన వచ్చినప్పుడు:

Personal loans: How to get the money you need

వాహనం ఏదైనా సరే, కొనాలని అనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకూ దాని అవసరం ఎంత ఉందో తెలుసుకోండి. ఇది తరిగే ఆస్తి. కాబట్టి అప్పు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిది.

పిల్లల చదువుల కోసం:

పిల్లల చదువుల కోసం చేసే అప్పులో ఎలాంటి తప్పు లేదు. అది భవిష్యత్తులో వెలకట్టలేనిది. కాబట్టి విద్య కోసం రుణం తీసుకోవడంలో తప్పేం లేదు. విద్య కింద తీసుకున్న వడ్డీకి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80ఈ ప్రకారం మినహాయింపు కూడా లభిస్తుంది.

క్రెడిట్ కార్డులపై తీసుకునే అప్పులు:

ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులపై తీసుకునే అప్పులకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. వీటికి బ్యాంకులు అధిక వడ్డీలను వసూలు చేస్తాయి. ప్రాణం మీదకి వస్తే తప్ప వీటిని తీసుకోకూడదు.

English summary

'అప్పు' ఏ సందర్భంలో చేస్తే మంచిది? | Personal loans: How to get the money you need

how to get a personal loanWith credit card interest rates soaring as high as 30%, people continue to look for alternatives to credit cards, especially when an emergency comes up.
Story first published: Friday, March 6, 2015, 19:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X