For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్ఐసీ 'జీవన సంగమ్' సింగిల్ ప్రీమియం పాలసీ

By Nageswara Rao
|

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) జీవన్ సంగమ్ పేరుతో సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇది ఒక నాన్ లింక్డ్, సింగిల్ ప్రీమియం పథకం. ఈ సింగిల్ ప్రీమియం పథకం 6 నుంచి 50 ఏళ్ల లోపు వారికి కొన్ని నిబంధనలకు లోబడి అందుబాటులో ఉంది.

ఒకే ఒక్క ప్రీమియంతో ప్రారంభమైన ఈ జీవన్ సంగమ్ పథకం ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. చిల్డ్రన్స్ మనీబ్యాక్ పథకంతో పాటు మార్చి 4 నుంచి 90 రోజుల పాటు ఎల్‌ఐసీ దీనిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

LIC's Jeevan Sangam Single Premium Plan(831): Should You Buy?

డెత్ బెనిఫిట్:

పాలసీ చెల్లించిన ఐదు సంవత్సరాల్లో పాలసీదారుడు మరణించినట్లైతే కేవలం సింగిల్ ప్రీమియంను మాత్రమే చెల్లిస్తారు. అదే ఐదు సంవత్సరాల తర్వాత సదరు పాలసీదారుడు మరణించినట్లైతే చెల్లించిన ప్రీమియంకు పది రెట్లు జత చేసి లబ్ధిదారులకు చెల్లిస్తారు. ఉదాహరణకు సంవత్సరానికి సింగిల్ ప్రీమియం కింద రూ. 20,000 చెల్లిస్తుంటే, ఐదు సంవత్సరాల తర్వాత రూ. 2 లక్షలు పొందుతారు.

మెచ్యూరిటీ బెనిఫిట్:

అర్హత నియమాలు:

Minimum Entry Age 6 years (completed)
Maximum Entry Age 50 years (nearest birthday)
Minimum/Maximum Basic Sum Assured 10 times of tabular single premium
Minimum Maturity Sum Assured Rs. 75,000/-
Maximum Maturity Sum Assured No Limit
Policy Term 12 years
Premium payment mode Single premium only

( కనీస మెచ్యూరిటీ కింద రూ. 75000 అందజేస్తారు. ఎక్కువ మొత్తంలో మెచ్యూరిటీ విలువ రూ 10,000కు హెచ్చించే విధంగా ఉంటుంది.)

సింగిల్ ప్రీమియం ధరలు:


Age at entry (Nearest Birthday) Tabular Single Premium Rates (Rs.)
10 472.70
20 485.30
30 497.55
40 567.35

లోన్ సౌకర్యం:

సాధారణంగా ఎల్‌ఐసీ పాలసీలను లోన్ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. వాటి మాదిరే ఈ పాలసీకి కూడా లౌన్ సౌకర్యం ఉంది. అయితే మూడు నెలల తర్వాత మాత్రమే అందుకు వీలవుతుంది. పాలసీ విధాన సంవత్సరంలో పాలసీ దారుడు ఏ సమయంలోనైనా డబ్బుని వెనక్కి తీసుకోవచ్చు.

ఈ పాలసీని తీసుకోవచ్చా?

అన్ని సింగిల్ ప్రీమియం పాలసీల మాదిరే ఇది కూడా ఉంది. కొత్తదనం ఏమీ లేదు. ఎవరైతే యుక్త వయస్సులో ఉన్నారో వారికి సరిగ్గా సరిపోతుంది. ఎందుచేతనంటే సరైన కాల పరిమితిని ఎంచుకుని చెల్లింపు చెల్లిస్తే ఎక్కువ కవరేజిని పొందేందుకు వీలుంది.

ఎల్‌ఐసీ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ పాలసీ:

12 ఏళ్ల లోపు పిల్లలకు చిల్డ్రన్స్ మనీబ్యాక్ పాలసీ వర్తిస్తుంది. పిల్లల విద్య తదితర అవసరాల కోసం ఉద్దేశించబడిన నాన్ లింక్డ్ మనీ బ్యాక్ పాలసీ. ఈ పాలసీ కాలవ్యవధిలో పిల్లల జీవితానికి రిస్క్‌ను కవర్ చేస్తుంది. నిర్దేశించిన సమయం పూర్తయిన తర్వాత కాలానుగత చెల్లింపులూ చేయబడతాయి. ఒకవేళ పాలసీ సమయంలో తల్లిదండ్రులు మరణించినట్లయితే ఆ తర్వాత ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు.

English summary

ఎల్ఐసీ 'జీవన సంగమ్' సింగిల్ ప్రీమియం పాలసీ | LIC's Jeevan Sangam Single Premium Plan(831): Should You Buy?


 Life Insurance Corporation (LIC) recently launched a single premium plan where the risk cover is several times the annual premium paid multiple.
Story first published: Thursday, March 5, 2015, 18:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X