For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాత కారు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..?

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: గతంలోలాగా రాజీ పడి జీవించే మనస్తత్వం ఈ కాలం ప్రజలకు లేదు. అవసరాలు ఏవైనా సరే వెంటనే తీర్చుకోవాలని ఈతరం కుర్రకారు భావిస్తున్నారు. వస్తువులు, దుస్తులు, ఫర్నీచర్ ఇలా ఏదైనా సరే అనుకున్నదే తడవుగా కొనేస్తున్నారు.

ఇప్పుడు ఈ కోవలోకి కార్లు కూడా చేరాయి. కొత్త కారు కొనడానికి డబ్బులు లేకపోతే, పాత కారు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పాత కారు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగత్తలు ఏంటో చూద్దాం.

నకిలీ పత్రాలు:

పాత కారు కొనే సందర్భంలో ముఖ్యంగా కారు పత్రాలను సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. నకిలీ పత్రాలతో మోసపూరితంగా కార్లను అంటగట్టే ప్రమాదం ఉంది. ఇలాంటివి కొనుగోలు చేస్తే లేని పోని తలకాయ నొప్పి మనకు చుట్టుకుంటుంది.

Biggest Mistakes When Buying a old Car

కారుకి బీమా ఉందా:

పాత కారు కొనేవారు ముందుగా చూడాల్సింది ఇదే. వాహన బీమా మీ పేరు మీదకు మార్చుకోండి. దీని వల్ల మున్ముందు అనుకోని సందర్భాల్లో క్లెయిం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవచ్చు. ఇలా పేరు మార్చుకునే ముందు కారు యజమాని వాహన బీమా ప్రీమియాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారా లేదా తెలుసుకోండి. పాలసీ వ్యవధి ముగింపు తేదీ చూడండి. బీమా కంపెనీని సంప్రదించి, గతంలో ఏమైనా క్లెయింలు ఉన్నాయా? ఉంటే ఎలాంటివి అనేది తెలుసుకోండి. భారతదేశంలో వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి.

రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మీ పేరు మీదకు మార్చుకోవడం:

కారు ఎవరి పేరు మీద ఉంది? అనేది తెలిపేదే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. ఇప్పటి వరకూ కారుని ఎవరెవరు కొనుగోలు చేశారు? ఇంజిన్ నెంబర్, తయారీ సంవత్సరం, ఎక్కడ రిజిస్టేషన్ అయిందీ లాంటి కీలక వివరాలు ఇందులో ఉంటాయి. ఒకవేళ మీరు కోనుగోలు చేసిన కారు ఇతర రాష్ట్రానికి చెందింది అయితే, మీ సొంత రాష్ట్రంలో తిరిగేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

సర్వీస్ బుక్:

కారుకి సరైన సమయంలో మరమ్మత్తు చేస్తేనే పనితీరు బాగుంటుంది. కారు పూర్వ యజమాని ఇదంతా సరిగా చేశారా లేదా అనేది సర్వీస్ పుస్తం చూసి తెలుసుకోవచ్చు. దీనిని చూడటం వల్ల కారుకి పెద్ద పెద్ద మరమ్మత్తులు ఏమైనా జరిగాయా అనేది తెలుస్తుంది.

Read more about: money car మనీ కారు
English summary

పాత కారు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..? | Biggest Mistakes When Buying a old Car


 The right color. The right options. The right brand. ​The overwhelming majority of buyers have been immersed in an ocean of new-car advertising that make a car's looks seem like the most important ingredient in the recipe.
Story first published: Monday, March 23, 2015, 17:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X