For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుకన్య సమృద్ధి యోజన ఖాతాని ఏయే బ్యాంకులు అందిస్తున్నాయి?

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: గత నెలలో బేటీ బచా వో.. బేటీ పఢావో ఉద్యమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ సుకన్య సమృద్ధి యోజనను హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆడపిల్లల పట్ల వివక్షను అంతం చేసి లింగ అసమానతలను రూపుమాపాలనే నినాదంలో ఈ పథకం ముందుకెళ్తుంది.

ఆడ పిల్లలకు ప్రత్యేక ఖాతాలు తెరవడం వల్ల ఆర్థిక సాధికారత లభిస్తుందని, తద్వారా వారిని మగ పిల్లలతో సమానంగా సంరక్షించేందుకు వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. 9.1 శాతం వడ్డీ లభించే ఈ ఖాతాలో జమ చేసుకున్న సొమ్ముకు ఆదాయపన్ను మినాహాయింపు కూడా ఉంది.

సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఏయే బ్యాంకుల్లో తెరవచ్చు?
తపాలా కార్యాలయాల్లో కానీ, అన్ని వాణిజ్య బ్యాంకులకు చెందిన ఏ శాఖలోనైనా కానీ వెయ్యి రూపాయాల కనీస డిపాజిట్‌తో పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు ఎప్పుడైనా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరవవచ్చు. ఒక వార్షిక సంవత్సరంలో గరిష్టంగా రూ. లక్షన్నర వరకు జమ చేసుకునేందుకు వీలుంది. ఏయే బ్యాంకుల్లో ఈ ఖాతాలను తెరవచ్చో చూద్దాం.

Which Banks Can You Approach to Open the Sukanya Samriddhi Yojana Account?

1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

2) బరోడా బ్యాంక్

3) పంజాబ్ నేషనల్ బ్యాంక్

4) బ్యాంక్ ఆఫ్ ఇండియా

5) కెనరా బ్యాంక్

6) యూకో బ్యాంక్

7) యునైటెడ్ బ్యాంక్

8) ఆంధ్రా బ్యాంక్

9) అలహాబాద్ బ్యాంకు

10) ఇండియన్ బ్యాంక్

11) కార్పొరేషన్ బ్యాంక్

12) సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా

13) ఐడిబిఐ బ్యాంక్

14) దేనా బ్యాంక్

సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ వల్ల ప్రయోజనాలు:

ఈ పథకం కింద ఆడ పిల్ల తల్లితండ్రులు తమ పదేళ్ల లోపు వయస్సు గల కుమార్తె ల పేరిట బ్యాంకు ఖాతా తెరవొచ్చు. తల్లితండ్రులు ఈ ఖాతాలో రూ.1,000 మొదలుకొని లక్షన్నర రూపాయల వరకు జమ చేయవచ్చు. ఈ ఖాతాలో జమ చేసిన డబ్బుకు ఇతర పథకాల కన్నా బ్యాంకులు ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి.

ఖాతా ప్రారంభించినప్పటి నుంచి 21 సంవత్సరాల నగదు వెనక్కి తీసుకునేవీలుండదు. ఒక వేళ 18 ఏళ్లు వయసొచ్చిన తర్వాత అమ్మాయి వివాహం కోసం కానీ, చదువుల కోసం కానీ జమ చేసిన మొత్తంలో 50 శాతం వరకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

తొలి విడతలో దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో 'సుకన్య' ఖాతాలు తెరుస్తారు. ఈ వంద జిల్లాలలో హర్యానా రాష్ట్రంలోని 12 జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ పథకం కోసం కేంద్రం రూ. వంద కోట్ల మూలధనం కేటాయించింది. ఈ పథకానికి సినీ నటి మాధురి దీక్షిత్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

English summary

సుకన్య సమృద్ధి యోజన ఖాతాని ఏయే బ్యాంకులు అందిస్తున్నాయి? | Which Banks Can You Approach to Open the Sukanya Samriddhi Yojana Account?

Last month Prime Minister Narendra Modi launched the "Sukanya Samriddhi Yojana" a part of the "Beti Bachao Beti Padhao" campaign. Focus on gender equality and opportunities for the girl child are the main themes of the Yojana.
Story first published: Monday, February 9, 2015, 11:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X