For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక రాబడులకు ఐదు అత్యుత్తమ పెట్టుబడి మార్గాలు(ఫోటోలు)

By Nageswara Rao
|

బెంగుళూరు: భారత్ ఆర్ధిక రంగంలో ఇటీవల కాలంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కారణం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంలో భారత్ ద్రవ్యోల్బణం నెంబర్లు మంచిగా ఉన్నాయి. సాధారణంగా చాలా మంది భారతీయలు పెట్టుబడి పెట్టడం కంటే కూడా సేవింగ్స్ చేసుకోవడానికే ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తారు.

గుడ్డిగా వేటిలో పడితే వాటిలో పెట్టుబడులు పెట్టకుండా సరైన మార్గంలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలను ఆశించవచ్చు. ఉత్పత్తులు అనేవి పెట్టుబడి ఆధారంగా వయస్సు మరియు వ్యవధిని ఉంటాయి. ఎక్కువ కాలం భావించి అధిక రాబడులను అశించి పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి కొన్ని పెట్టుబడి ఉత్పత్తులను అందిస్తున్నాం.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు

ఎక్కువ కాలం అధిక రాబడులను ఆశించే వారికి స్టాక్ మార్కెట్లు మంచి అనుకూలం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పెట్టేవారికి చాలా సహనం ఓపికతో పాటు గట్టి పట్టు ఉండాలి. ప్రారంభంలో ఒకే స్టాక్‌పై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా, వివిధ స్టాక్స్‌పై దృష్టి పెట్టాలి. ఉత్పత్తులపై అవగాహన వస్తే తప్పక అధిక రాబడులు ఉంటాయి.

 మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడి

మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడి

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడంతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. అయితే ఇక్కడ మీరు మదుపు చేసిన దానిపై ఆధారపడి ఉంటుంది.

ఇటువంటి రుణ నిధులను పెట్టుబడి ఈక్విటీ నిధులు పోలిస్తే తక్కువ ప్రమాదకరం. మీరు ఎక్కువ రాబడిని ఆశిస్తుంటే, తక్కువ రిస్క్ ఉన్న హైబ్రిడ్ ఫండ్స్ మంచివి.

రియల్ ఎస్టే‌ట్‌లో పెట్టుబడి

రియల్ ఎస్టే‌ట్‌లో పెట్టుబడి

గత కొన్ని సంవత్సరాలుగా చూసుకొంటే, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎక్కువ రాబడితో తక్కువ రిస్క్ ఉంది. సాంప్రదాయ పెడ్డుటబడిదారులు ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ రంగాన్నే ఎంచుకుంటారు. మీరు గనుకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లైతే ఇంటి అద్దెల రూపంలో ఎక్కువ రాబడులు పొందే ఛాన్స్ ఉంది.

 నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్‌లో పెట్టుబడి

నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్‌లో పెట్టుబడి

కార్పోరేట్ సంస్ధలు తమ డబ్బుని పెంచుకునేందుకు ఈ ఎన్‌సీడీల్లో పెట్టుబడులను కోరుతుంటాయి. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అనేవి స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్టెడ్ అయి ఉండి, బ్యాంకులు ప్రస్తుతం ఇస్తున్న 4-5 శాతం రిటర్న్స్ కంటే అత్యధికంగా 15 శాతం వరకు రాబడులను అందిస్తాయి. ఇందులో రిస్క్ శాతం చాలా తక్కువ.

పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడి

పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడి

ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సి కింద సుమారు రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతంలో రూ. 1 లక్ష వరకు ఉన్న పరిమితిని 2014-15 బడ్జెట్‌లో రూ 1.5 లక్ష వరకు పరిమితిని పెంచారు. సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్, ఈఎస్‌ఎస్ఎస్, ప్రీమియం పేమెంట్ లాంటి పథకాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంది.

వేరే ఇతర పెట్టుబడి మార్గాలు

వేరే ఇతర పెట్టుబడి మార్గాలు

ఐపీఓ, బంగారం, ఫిక్సడ్ డిపాజిట్ లాంటి పెట్టుబడులకు అధిక రాబడులు వస్తాయి. అధిక రాబడులు కావాలంటే ఎక్కువ రిస్క్ కూడా ఉంటుందన్న విషయాన్ని కస్టమర్లు గుర్తుంచుకోవాలి.

English summary

అధిక రాబడులకు ఐదు అత్యుత్తమ పెట్టుబడి మార్గాలు(ఫోటోలు) | 5 Best Investment Ideas for Better Returns


 The Indian economy is attracting attention globally with hopes that reforms would ensure faster economic growth. Crude Oil has been falling and inflation numbers are good.
Story first published: Friday, February 6, 2015, 13:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X