For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం కొనే ముందు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి

పండుగ సీజన్లలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కొనుగోలు బంగారం చేయాలని కోరుకుంటారు. భారత్‌లో బంగారం కొనుగోలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే బంగారం కొనుగోలు చేయడానికి ముందు దాని గురించి క్షణ్ణంగ

By Nageshwara Rao
|

న్యూఢిల్లీ: పండుగ సీజన్లలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కొనుగోలు బంగారం చేయాలని కోరుకుంటారు. భారత్‌లో బంగారం కొనుగోలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే బంగారం కొనుగోలు చేయడానికి ముందు దాని గురించి క్షణ్ణంగా తెలుసుకోవాలి.

కొన్ని సందర్భాల్లో బంగారం గురించి మీకు తెలియకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బంగారం కోనుగోలు చేయాలంటి వీటి గురించి మీకు తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలి.

8 steps to avoid getting duped when buying gold jewellery this festive season

* హాల్ మార్క్ చెక్ చేయాలి
హాల్ మార్క్ అనేది నగలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేయబడ్డాయని హామీని ఇస్తుంది. హాల్ మార్క్ ఉంటే నగలు ఏ సంవత్సరంలో తయారు చేశారు, బీఐఎస్ లోగో, జ్యూయలర్స్ మార్క్, హాల్ మార్కింగ్ సెంటర్ మార్క్, కోల్ లెటర్ మొదలగునవి బంగారం కలిగి ఉంటుంది.

* బంగారన్ని మెల్టింగ్ చేయడం వల్ల ఖరీదైనదిగా రుజువు చేయవచ్చు
మీ దగ్గర ఉన్న బంగారాన్ని కరిగిచడం వల్ల హాల్ మార్క్ పోయే ప్రమాదం ఉంటుంది. సుమారు మీరు 10 గ్రాముల బంగారాన్ని కరిగించినట్లైతే అది 7 గ్రాములు అవుతుంది. దీంతో మీరు బంగారం బరువుతో పాటు డబ్బుని కూడా కోల్పోవాల్సి ఉంటుంది.

* క్యారెట్స్‌ను చెక్ చేసుకోవాలి
బంగారం సాప్ట్‌గా ఉంటుంది కాబట్టి నగలు చేసేటప్పుడు బంగారంతో సిల్వర్, జింక్ లాంటి మెటల్స్ జోడించి జ్యూయలరీని తయారు చేస్తారు. బంగారం యొక్క నాణ్యతను క్యారెట్ తెలుపుతుంది. క్యారెట్స్‌ను చెక్ చేయకుండా బంగారాన్ని కొనుగోలు చేయకూడదు. సాధారణంగా బంగారం 18కే, 22కే, 24కే క్యారెట్స్‌లో లభ్యమవుతుంది.

హాల్ మార్కింగ్
ప్రభుత్వం బంగారం యొక్క హాల్ మార్కింగ్‌ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెడ్(బీఐఎస్) ద్వారా ఆమోదిస్తుంది. అంతర్జాతీయ హాల్ మార్కింగ్ విధి విధానాల ద్వారా నిర్ణయిస్తుంది. అనేక బీఐఎస్ సర్టిఫికేట్ నగలు బీఐఎస్ నుండి హాల్ మార్క్ నగలను పొందవచ్చు. భారత్‌లో బంగారం స్వచ్ఛతను నిర్ధారించడానికి సరైన మార్గం ఇదే.

* తెల్ల బంగారం
ఇక తెల్ల బంగారం అలెర్జీలకు కారణంగా భావిస్తారు. ఐతే ఇది అందరికీ విషయంలో కరెక్టు కాదు.

* నగల రసీదులో ఏమేమి కలిగి ఉండాలి?
నగలు కొనుగోలు చేసిన తర్వాత రసీదులో ఉన్న విషయాలను తప్పనిసరిగా సరి చూసుకోవాలి. ఈ రసీదులో బంగారం గురించి తెలిపే క్యారెట్ నాణ్యత మరియు వజ్రాలు లేదా రత్నాల క్యారెట్ నాణ్యతను తెలుపుతుంది.

* నగలు కొనుగోలు చేసే ముందుగానే నిర్ణయం తీసుకోవాలి
నగలను కొనుగోలు చేయడానికి ముందుగానే ఏమేమి కొనాలనేది నిర్ణయం తీసుకోవాలి. షాపింగ్ వెళ్లిన తర్వాత అక్కడ నిర్ణయం తీసుకోవడం సరైన పద్దతి కాదు.

* కావాల్సినంత సమయం తీసుకోండి
నగల షాపులో సేల్స్ బాయ్ చెప్పిన దానికి తలుపుతూ బంగారాన్ని కొనేయకండి. మీకు కావాల్సినంత సమయాన్ని తీసుకుని మంచి నగలను కొనుగోలు చేయాలి.

ఇంకో విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లలో బంగారం విలువ బాగా పెరిగింది. బంగారంలో పెట్టుబడులు పెట్టటడం కంటే బంగారు ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయడం మంచిది.

English summary

బంగారం కొనే ముందు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి | 8 steps to avoid getting duped when buying gold jewellery this festive season

gold is to be very favorite investment for many Indians. More often than not, it goes beyond that. Take a look at 7 much needed steps before buying gold jewellery in India.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X