For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియాఫస్ట్: డీమ్యాట్ ఫార్మట్‌లో అన్ని పాలసీలు

|

ముంబై: భారతదేశంలో కొత్తగా ప్రారంభించబడి అతివేగంగా విస్తరిస్తున్న జీవిత బీమా సంస్థఅయిన ఇండయాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ తన ఖాతాదారుల కోసం నూతన విధానాన్ని ప్రకటించింది. ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ ద్వారా అన్ని పాలసీలకు డీ మ్యాట్ ఫార్మట్ (డీమెటీరియలైజ్డ్) ప్రారంభించింది.

పాలసీదారులకు తమ ఇన్స్యూరెన్స్ పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపర్చుకునేందుకు, తమ పాలసీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒక చోటే పొందేందుకు ఈ విధానాన్ని ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ ఏర్పాటు చేసిందని ఇండియాఫస్ట్ ఎండీ, సీఈవో పి. నందగోపాల్ తెలిపారు.

ఇండియా ఫస్ట్ తన పాలసీదారులకు ఉత్తమమైన సౌకర్యాలను కల్పించేందుకు మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని, దీని ద్వారా స్పష్టమైన సమాచారాన్ని, వారికి కావాల్సిన సేవలను అందించేందుకు పూర్తి సామర్థ్యంతో ముందుకెళుతున్నామని ఆయన చెప్పారు. జీవిత బీమా అనేది దీర్ఘకాలికమైనదని, దీని ద్వారా పాలసీదారు రక్షణ పొందుతాడని తెలిపారు. జీవిత బీమా అనేది ప్రతీ ఒక్కరికీ అవసరమని, ఏదో ఒక సమయంలో అండగా ఉంటుందని తెలిపారు.

పాలసీలను డీమెటీరియలలైజేషన్ చేయడం ద్వారా పాలసీదారు తన పాలసీకి సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని నందగోపాల్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇన్స్యూరెన్స్ ఖాతా ద్వారా పాలసీదారు కెవైసి నిబంధనలు నుంచి బయటపడవచ్చు. దీని ద్వారా చిరునామా, వ్యక్తిగత గుర్తింపు వివరాలను ప్రతీ కొనుగోలు సమయంలో ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంతేగాక డీమ్యాట్‌తో ఇన్స్యూరెన్స్ వ్యాపార లాభాలు పొందడం, ప్రీమియం సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు.

ఇప్పటికీ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలను కాగితాల రూపంలోనే నిర్వహించడం జరుగుతోందని, అయితే భారతదేశంలో తొలిసారి కాగితాలపై నమోదు చేసిన పాలసీ వివరాలను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చడం జరుగుతోందని నందగోపాల్ తెలిపారు. ఈ విధానంలో ముందునుంచి తమ సంస్థ భాగమైనందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇన్స్యూరెన్స్ కంపెనీలు తమ వినియోగదారులకు ఎలక్ట్రానిక్ రూపంలో పాలసీలను అందించడం ద్వారా ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చు. మైక్రో ఇన్స్యూరెన్స్ పాలసీల విషయంలో ఈ విధానం ఇంకా ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం కంపెనీలన్నీ డీమ్యాట్ రూపంలోని ఇన్స్యూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి. వినియోగదారులు కూడా తమ పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో కొనసాగించుకునేందుకు ఇష్టపడుతున్నారు.

వినియోగదారులు ఈ-ఇన్స్యూరెన్స్ ఖాతా ఫాంను ఇండియాఫస్ట్ వెబ్ సైట్ www.indiafirstlife.com (under the Download section) ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇండియాఫస్ట్ ప్రతినిధుల ద్వారా కూడా వినియోగదారులు తమకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. సమాచారం కోసం ఫోన్ నెం. 1800 209 7800ను సంప్రదించవచ్చు.

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఇండియాఫస్ట్ రూ. 475కోట్ల రూపాయల మూలధనంతో ప్రభుత్వ రంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రాబ్యాంకులు, యూకేలోని రిస్క్, వెల్త్, ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ లీగల్ & జనరల్ సంస్థలచే ప్రమోట్ చేయబడుతోంది. ఇండియాఫస్ట్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా 44శాతం, ఆంధ్రాబ్యాంకు, లీగల్ & జనరల్ సంస్థ 30శాతం, 26శాతం కలిగి ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కన్సల్టెంట్స్ తమన్నా ఖన్నా, టి. ఆనంద మహేష్ లను ఫోన్: +91 98206 02369, +91 98707 16285, [email protected], [email protected] ద్వారా సంప్రదించవచ్చు.

పాలసీ తీసుకునే విధానం

1. ఎలక్ట్రానిక్ రూపంలో ఖాతా తెరిచే విధానం
మొదట ఎలక్ట్రానిక్ ఇన్స్యూరెన్స్ ఖాతా తెరిచేందుకు అవసరమైన దరఖాస్తు ఫాంను ఇండియాఫస్ట్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఫాం నింపిన తర్వాత కెవైసి డాక్యుమెంట్లను జత చేయాలి. నింపిన ఈ-ఇన్స్యూరెన్స్ ఖాతా దరఖాస్తు ఫాంతోపాటు జతచేసిన డాక్యుమెంట్లను ఇండియాఫస్ట్ ఇన్స్యూరెన్స్ కు పంపించాలి. ఇండియాఫస్ట్ ఇన్స్యూరెన్స్ దరఖాస్తు ఫాంను సంబంధిత ఇన్స్యూరెన్స్ రెపోసిటరీకి పంపిస్తుంది. దరఖాస్తు ఫాం వివరాలతో ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ (ఐఆర్) ఈ-ఇన్య్యూరెన్స్ ఖాతా నంబర్ తయారు చేసి ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కు పంపిస్తుంది. పాలసీదారుకు సంబంధించిన పాలసీ వివరాలను ఎలక్ట్రానిక్ ఫాంలో ఐఆర్ పోర్టల్ లోని ఎలక్ట్రానిక్ ఇన్స్యూరెన్స్ ఖాతాకు అందజేస్తుంది. అప్పుడు ఐఆర్ పాలసీ వినియోగదారుకు తన ఈ-ఇన్స్యూరెన్స్ ఖాతా విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందనే సమాచారాన్ని అందజేస్తుంది.

2. ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ ప్రయోజనాలు

భద్రత: ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ వల్ల పాలసీదారుకు ఎలాంటి నష్టభయం ఉండదు. పాలసీ డ్యామేజ్ కావడమనేది ఉండదు. ఎలక్ట్రానిక్ ఫాంను అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా..ఎక్కడైనా సులభంగా ఉపయోగించవచ్చు. ఈ-ఇన్స్యూరెన్స్ అకౌంట్ ద్వారా పాలసీ కాపీని ఎప్పుడైనా డౌన్ లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

అనుకూలం: అన్ని ఇన్స్యూరెన్స్ పాలసీల వివరాలను ఎలక్ట్రానిక్ రూపంలో ఏకైక ఈ-ఇన్స్యూరెన్స్ ఖాతా ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్స్యూరెన్స్ రెపోసిటరీకి సంబంధించిన ఆన్ లైన్ పోర్టల్ లో ఎప్పుడైన లాగిన్ అవొచ్చు. పాలసీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

ఒకే చోటు నుంచి అన్నిరకాల సేవలు: ఈ-ఇన్స్యూరెన్స్ అకౌంట్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ పాలసీకి సంబంధించిన వివరాలనైనా ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ సర్వీస్ పాయింట్ల నుంచి దాఖలు చేయవచ్చు. చాలా మంది ఇన్స్యూరర్స్ నుంచి ఒకే రకమైన విన్నపాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి చిరునామాకు సంబంధించిన ఒక మార్పును బహుళ పాలసీలు కలిగిన పాలసీదారు ఖాతాలో ఐఆర్ ఒకేసారి అప్‌డేట్ చేస్తుంది.అయితే ఇందుకు వేర్వేరు ఇన్స్యూరెన్స్ సంస్థలకు వేర్వేరు కార్యాలయాలు అవసరం ఉండదు.

పేపర్ వర్క్ ఉండదు, సమయం వృథా కాదు: ఎలక్ట్రానిక్ ఇన్స్యూరెన్స్ ఖాతాదారు కొత్త పాలసీ తీసుకున్న ప్రతీసారి కెవైసీ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరముండదు. పాలసీదారు చిరునామాలో గానీ కాంటాక్ట్ నెంబర్ లో గానీ మార్పులేవైనా ఉంటే ఓ చిన్న ఆన్ లైన్ రిక్వెస్ట్ తో సరిచేసుకోవచ్చు. ఇందుకు పెద్ద సమయమేమి పట్టదు, పేపర్ల పని కూడా ఉండదు.

స్టేట్ మెంట్ ఆఫ్ అకౌంట్: ఏడాదిలో ఒకసారైనా పాలసీదారుకు పాలసీ గురించిన వివరాలను ఈ-ఇన్స్యూరెన్స్ అకౌంట్ నెంబర్ ద్వారా ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ అందజేస్తుంది.

సర్వీస్ టచ్ పాయింట్లలో పెరుగుదల: ఇన్స్యూరెర్స్ కు ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ కార్యకలాపాలు అదనం కాగా, అవసరమున్నప్పుడు ఈ సేవలను ఉపయోగించుకోవడం ద్వారా పాలసీదారు సర్వీస్ టచ్ పాయింట్లను పెంచుకోవచ్చు.

సింగిల్ వ్యూ: ఈ-ఇన్స్యూరెన్స్ అకౌంట్ నెంబర్ ద్వారా పాలసీదారుకున్న పాలసీలన్నీ చూడబడతాయి కాబట్టి ఒకవేళ పాలసీదారు చనిపోయినట్లయితే పాలసీలకు సంబంధించిన లాభాలన్నీ అందుబాటులో ఉంటాయి.

English summary

ఇండియాఫస్ట్: డీమ్యాట్ ఫార్మట్‌లో అన్ని పాలసీలు | IndiaFirst Life Goes Green; all Policies available in demat form

One of the youngest and fastest growing life insurer in the country, IndiaFirst Life has announced the availability of all its policies in dematerialized format as the Insurance Repository goes live today.
Story first published: Tuesday, September 17, 2013, 16:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X