For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనామా లీక్ వ‌ల్లే న‌వాజ్ ష‌రీఫ్ ప‌ద‌వి పోతే... భార‌తీయుల సంగతేంటి

మ‌ల్టీ ఏజెన్సీ ద‌ర్యాప్తును ప్రారంభించాల్సిందిగా మ‌న కేంద్ర ప్ర‌భుత్వాన్ని అత్యున్న‌త‌ న్యాయ‌స్థానం ఆదేశించింది. మ‌నోహ‌ర్ లాల్ శ‌ర్మ పిటీష‌న్ ఫైల్ చేయ‌గా ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు. దీంతో కోర్టు కేంద్ర

|

లీక్ అయిన ప‌నామా పేప‌ర్స్‌లో 500 వ‌ర‌కూ భార‌తీయుల పేర్లున్నాయి. పాక్ సుప్రీంకోర్టు అవినీతి కేసుకు సంబంధించి ప్ర‌ధాని అన‌ర్హుడని తీర్పు ఇవ్వ‌గా ఆ ప‌ద‌వి నుంచి ప్ర‌ధాన‌మంత్రి న‌వాజ్ ష‌రీఫ్ త‌ప్పుకున్నాడు. అదే మ‌న దేశంలో సుప్రీంకోర్టు సైతం దీనిపై బాగానే స్పందించింది. కానీ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ది ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. మ‌ల్టీ ఏజెన్సీ ద‌ర్యాప్తును ప్రారంభించాల్సిందిగా మ‌న కేంద్ర ప్ర‌భుత్వాన్ని అత్యున్న‌త‌ న్యాయ‌స్థానం ఆదేశించింది. మ‌నోహ‌ర్ లాల్ శ‌ర్మ పిటీష‌న్ ఫైల్ చేయ‌గా ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు. దీంతో కోర్టు కేంద్రం, సీబీఐల‌కు నోటీసులిచ్చింది. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు...

1. ఆప్ ఆరోప‌ణ‌

1. ఆప్ ఆరోప‌ణ‌

అక్క‌డ పాకిస్థాన్‌లో అవినీతి కార‌ణంగా ప్ర‌ధానిని తొల‌గించ‌గానే మ‌న దేశంలో ఆప్‌(ఆమ్ ఆద్మీ పార్టీ) రాగం అందుకుంది. ప‌నామా పేప‌ర్స్ లీక్‌లో వెల్ల‌డైన పేర్ల‌కు సంబంధించి ప్ర‌భుత్వం దాచేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని ఆరోపించింది. పార్టీ ప్ర‌తినిధి అశుతోష్ మాట్లాడుతూ ప‌నామా పేప‌ర్స్‌లో మ‌న దేశానికి సంబంధించి చాలా మంది న‌టులు, రాజ‌కీయ నాయ‌కులు, పారిశ్రామిక వేత్త‌ల బంధువుల పేర్లు ఉన్నాయ‌ని అన్నారు. ఇందులో కొంత మంది అధికార పార్టీ నాయ‌కుల‌తో సంబంధాలు ఉన్న వారున్నారని చెప్పారు. అయితే చ‌ర్య తీసుకోవ‌డంలో కేంద్రం విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు.

2. అప్పుడేమైంది...

2. అప్పుడేమైంది...

ఇంట‌ర్నేష‌న‌ల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుల బృందం ఒక‌టి ప్ర‌పంచ వ్యాప్తంగా అవినీతి ప‌రుల జాబితాను ఒక‌టి త‌యారు చేసింది. వాటినే ప‌నామా పేప‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ 10,మే 2016న విడుద‌ల చేశారు. ఇందులో చాలా డూప్లికేట్ కంపెనీల పేర్లు, వ్య‌క్తుల పేర్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్ర‌భుత్వ నాయ‌కులు, అధికారులు, సినీ న‌టులు, వ్యాపార వేత్త‌లు వంటి ప‌లు రంగాల‌కు చెందిన వ్య‌క్తుల పేర్లు ఇందులో వెల్ల‌డ‌య్యాయి.

3. దాని త‌ర్వాత‌...

3. దాని త‌ర్వాత‌...

మార్చి 2017లో మ‌న దేశంలో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటీష‌న్ దాఖ‌లైంది. అయితే సుప్రీంకోర్టు మొద‌ట రిపోర్టును అధ్య‌యనం చేసిన త‌ర్వాత‌నే పూర్తి ద‌ర్యాప్తుకు ఆదేశించేందుకు అవ‌కాశం క‌లుగుతుంద‌ని చెప్పింది. అయితే నివేదిక కోరే స‌మ‌యంలో సీబీడీటీ, ఆర్‌బీఐ, ఫైనాన్సియ‌ల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వంటి వాటితో మ‌ల్టీ ఏజెన్సీ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ను ఏర్పాటు చేయాల‌ని చెప్పింది.

4. దేశంలో ప్ర‌ముఖుల పేర్లు

4. దేశంలో ప్ర‌ముఖుల పేర్లు

ఇండియాలో చాలా పెద్దోళ్ల పేర్లు ప‌నామా జాబితాలో ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, పారిశ్రామిక‌వేత్త గౌత‌మ్ అదానీ సోద‌రుడు వినోద్ అదానీ, దేశంలో ప్ర‌ముఖ న్యాయ‌వాది హ‌రీశ్ సాల్వే వంటి పేర్లు ఉన్నాయి. అయితే ద‌ర్యాప్తు విష‌యానికి వ‌స్తే మ‌న దేశంలో పనామా పేప‌ర్ల లీక్ వ్య‌వ‌హారానికి సంబంధించి అంత సీరియ‌స్‌గా ఏమీ క‌న‌బ‌డ‌టం లేదు.

5. ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ వెల్ల‌డించిన పేర్లు

5. ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ వెల్ల‌డించిన పేర్లు

ప‌నామా పేపర్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌లో భార‌త్ నుంచి ఉన్న‌వారిలో ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ పాత్రికేయురాలు రిత్ స‌రిన్ ఉన్నారు. దీనికి సంబంధించి ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ మార్చి, 2017లో ఒక క‌థనాన్ని వెలువ‌రించింది. దాని సారాంశం ఇది. మొసాక్ ఫొన్సెకా అనే న్యాయ‌వాద స‌ల‌హా సంస్థ ద్వారా ప‌లువురు వ్య‌క్తులు, కంపెనీలు ఆఫ్‌షోర్ కంపెనీల ద్వారా డ‌బ్బును విదేశాల్లో దాచినట్లు ఆరోప‌ణ ఉంది. పన్ను ఎగ‌వేత‌లు, అవినీతి సొమ్మును కొంత మంది దాచారు. భార‌త పౌరులు, విదేశాల్లో నెలకొల్ప‌బ‌డిన కంపెనీలు 13 చోట్ల దాచిన డ‌బ్బుకు సంబంధించి ప‌న్ను అధికారులు 165 స‌మాధానాల‌ను రాబ‌ట్టారు. మ‌ల్టీ ఏజెన్సీ గ్రూప్ స‌మావేశం సందర్భంగా మొసాక్ ఫొన్సెకా క్లైంట్లలో ఉన్న భార‌తీయుల పాన్ నంబ‌ర్ల‌ను ట్రేస్ చేశారు. దాదాపు 424 మంది వివ‌రాలు ఉన్నాయి. ఇందులో 205 పాన్ క‌లిగిన వ్య‌క్తుల, కంపెనీల‌ వివ‌రాలు ప‌నామా లీక్ వివ‌రాల‌తో ప‌రిపోలుతున్నాయి. అయితే ఇంకా 60 మంది వివ‌రాల‌ను ట్రేస్ చేయాల్సి ఉంది.

6. విచార‌ణ‌

6. విచార‌ణ‌

అయితే రితు స‌రిన్ www.thequint.com వెబ్‌సైట్తో మాట్లాడుతూ ఇలా అన్నారు. భార‌త ద‌ర్యాప్తు సంస్థ‌లు ప‌నామా పేప‌ర్ల విష‌యంలో చాలా నెమ్మ‌దిగా ఉన్నాయ‌న‌డం స‌రికాదు. ఆఫ్‌షోర్ కంపెనీల దర్యాప్తు అంత సులువైంది కాదు. ఉల్లిగ‌డ్డ‌పై ఒక్కో పొర‌ను ఎలా తీస్తామో, ద‌ర్యాప్తు సైతం అలాగే ద‌శ‌ల వారీగా సాగాలి. ఇది దీర్ఘ‌కాలం కొన‌సాగుతుంది. ప‌న్ను అధికారులు చేసే ద‌ర్యాప్తులు చాలా ర‌హ‌స్యంగా సాగుతాయి. అక్క‌డికీ అధికారులు సుప్రీంకోర్టుకు దర్యాప్తు పురోగ‌తిని తెలియ‌జేస్తూనే ఉన్నారు.

Tata Motors

Tata Motors

Shares of Tata Motors have plunged to a recent 52-week low after quarterly numbers for the quarter ending June 30, 2017, were not too impressive. However, the domestic sales of the company have given reason for optimism, as the company has seen growth in all segments from passenger vehicles to commercial vehicles. Domestic sales at the company were higher by 26 per cent, when compared to the previous month. The shares of the company have reacted way too much, leaving the stock as a good potential to generate returns.

Read more about: business corruption
English summary

పనామా లీక్ వ‌ల్లే న‌వాజ్ ష‌రీఫ్ ప‌ద‌వి పోతే... భార‌తీయుల సంగతేంటి | Pak PM sacked what about Indian panama papers list

There are 500 Indians named in the leaked Panama papers. On Friday, the Supreme Court of Pakistan ordered the disqualification of Nawaz Sharif following which he stepped down as the Prime Minister of Pakistan.
Story first published: Saturday, July 29, 2017, 11:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X