For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సావ‌రిన్ గోల్డ్ బాండ్లు 4 కేజీల వ‌ర‌కూ కొనుక్కోవ‌చ్చు

సావ‌రిన్ గోల్డ్ బాండ్ల ద్వారా పెట్టే పెట్టుబ‌డి ప‌రిమితిని ప్ర‌స్తుతం ఉన్న 500 గ్రాముల నుంచి 4 కేజీల‌కు పెంచారు. ఇది ఒక్కో ఆర్థిక సంవ‌త్సరానికి వ‌ర్తించేలా ఉంది. ఇందులో సెకండ‌రీ మార్కెట్లో ట్రేడింగ్లో

|

బంగారు బాండ్ల‌లోకి పెట్టుబ‌డుల‌ను మ‌రింతగా ఆకర్షించేందుకు కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కొనుగోలుదారులు సావ‌రిన్ గోల్డ్ బాండ్ల ద్వారా పెట్టే పెట్టుబ‌డి ప‌రిమితిని ప్ర‌స్తుతం ఉన్న 500 గ్రాముల నుంచి 4 కేజీల‌కు పెంచారు. ఇది ఒక్కో ఆర్థిక సంవ‌త్సరానికి వ‌ర్తించేలా ఉంది. ఇందులో సెకండ‌రీ మార్కెట్లో ట్రేడింగ్లో కొన్న దాన్ని సైతం క‌లిపి లెక్కిస్తార‌ని కేంద్ర క్యాబినెట్ బేటీ త‌ర్వాతి అధికారిక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. తాజా నిర్ణ‌యం ప్ర‌కారం ఒక వ్య‌క్తి కుటుంబం ఒక సంవ‌త్స‌రం కాలంలో 4 కిలోల వ‌ర‌కూ గోల్డ్ బాండ్ల‌పై పెట్టుబ‌డి పెట్టేందుకు అవ‌కాశం ల‌భిస్తుంది.

 సావ‌రిన్ గోల్డ్ బాండ్లు, సార్వ‌భౌమ బంగారు బాండ్లు

ట్ర‌స్టులు, ప్ర‌భుత్వం నుంచి ప్ర‌త్యేక అనుమ‌తి పొందిన సంస్థ‌లకు ఈ ప‌రిమితి 20 కేజీలుగా ఉంది. వ్య‌క్తుల విష‌యానికి వ‌స్తే ఇదివ‌ర‌కే తాక‌ట్టు పెట్టిన బంగారానికి ఈ పెట్టుబ‌డి ప‌రిమితి వ‌ర్తించ‌ద‌ని ప్ర‌క‌ట‌నలో ఉంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, బ్యాంకులు, పోస్ట‌ల్ కార్యాల‌యాల‌తో మాట్లాడి అడిగిన వెంట‌నే గోల్డ్ బాండ్లు అందుబాటులోకి వ‌చ్చేలా కార్యాచ‌రణ రూపొందిస్తున్న‌ట్లు ఆర్థిక శాఖ తెలిపింది. సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను కేంద్ర ప్ర‌భుత్వం న‌వంబ‌రు 5,2015 నుంచి అమ‌ల్లోకి తీసుకొచ్చింది. ఎక్కువ మంది బంగారం కొని భౌతిక రూపంలో నిల్వ ఉంచ‌కుండా డ‌బ్బు రూపంలో చ‌లామ‌ణీలో ఉండే విధంగా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు.

Read more about: gold sgb
English summary

సావ‌రిన్ గోల్డ్ బాండ్లు 4 కేజీల వ‌ర‌కూ కొనుక్కోవ‌చ్చు | Govt hikes gold bond investment limit upto 4 kg

The Cabinet on Wednesday raised the annual investment limit in Sovereign Gold Bonds (SGBs) to 4 kg per individual from 500 gm and relaxed other norms to make them more attractive to buyers.
Story first published: Saturday, July 29, 2017, 13:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X