For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెఫ్ బెజోస్ సంప‌ద‌లో బిల్ గేట్స్‌ను కూడా దాటేశాడా?

అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు 90 బిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరుతుండ‌టంతో ప్ర‌పంచంలో అత్య‌ధిక ధ‌న‌వంతుల జాబితా మారుతోంది. మైక్రోసాఫ్ట్ అధినేత నిక‌ర ఆస్తుల విలువ 90 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా, అమెజాన్ జెఫ్

|

ప్ర‌పంచంలో ధ‌న‌వంతుఢు ఎవ‌రిని ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు సాధార‌ణంగా వినిపించే పేరు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌దే. త్వ‌ర‌లో అది మారిపోతోంది. అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు 90 బిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరుతుండ‌టంతో ప్ర‌పంచంలో అత్య‌ధిక ధ‌న‌వంతుల జాబితా మారుతోంది. మైక్రోసాఫ్ట్ అధినేత నిక‌ర ఆస్తుల విలువ 90 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా, అమెజాన్ జెఫ్ బెజోస్ మొత్తం సంప‌ద 89 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. గురువారం కంపెనీల షేర్ల విలువ‌లో కుదుపు రావ‌డంతో సంప‌ద విష‌యంలో బెజోస్ బిల్‌గేట్స్‌ను దాటేశాడు. ఈ నేప‌థ్యంలో భూమి మీద 5 అత్య‌ధిక కుబేరులు ఎవ‌రో తెలుసుకుందాం.

అత్య‌ధిక ధ‌న‌వంతుడిగా జెఫ్ బెజోస్‌

అత్య‌ధిక ధ‌న‌వంతుడిగా జెఫ్ బెజోస్‌

మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడైన‌ బిల్‌గేట్స్ చాలా సంవ‌త్స‌రాల నుంచి ప్ర‌పంచంలోనే కుబేరుడిగా కొన‌సాగుతున్నారు. అయితే ప్ర‌స్తుతం ఫోర్బ్స్, బ్లూమ్‌బ‌ర్గ్ ప్ర‌కారం అత్య‌ధిక ధ‌న‌వంతుడిగా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ నిల‌వ‌నున్నారు. ఆయ‌న జీవిత కాలంలో పుస్త‌కాలు ఆన్‌లైన్‌లో అమ్మ‌డం మొద‌లుపెట్టి దాన్నే ఒక ఆదాయ వ‌న‌రుగా మ‌లిచి ఆన్‌లైన్ రిటైలింగ్ దిగ్గ‌జంలో ఎద‌గ‌డంలో ప్ర‌తి అడుగూ స్పూర్తిదాయ‌కంగా సాగింది.

షేర్ల విలువ‌లో మార్పు కార‌ణంగానే

షేర్ల విలువ‌లో మార్పు కార‌ణంగానే

బ్లూమ్ బ‌ర్గ్, ఫోర్బ్స్ ప్ర‌కారం షేర్ల విలువ‌లో హ‌ఠాత్తుగా వ‌చ్చిన మార్పుల మూలంగా 15 యూఎస్ డాల‌ర్ల విలువ‌తో బిల్‌గేట్స్ కంటే జెఫ్ బెజోస్ ముందున్నాడు. జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థ‌కు సంబంధించి 800 మిలియ‌న్ డాల‌ర్ల షేర్ల‌ను క‌లిగి ఉన్నాడు. వీటి విలువ 90 బిలియ‌న్ డాల‌ర్ల‌ను దాటేసింది. మ‌రో వైపు మేక్రోసాఫ్ట్ షేర్ల విలువ‌లో వ‌చ్చిన త‌గ్గుద‌ల మూలంగా బిల్‌గేట్స్ ఆస్తుల విలువ స్వ‌ల్పంగా తగ్గింది. ఒక‌వేళ కొన్ని రోజుల్లో షేర్ల విలువ‌లు వాస్త‌వ స్థితికి వ‌చ్చినా అమెజాన్ జెఫ్ బెజోస్ మాత్రం బిల్‌గేట్స్ కంటే ఎక్కువ సంప‌ద‌ను క‌లిగి ఉంటాడు. ఇప్పుడు మారిన జాబితా ప్ర‌కారం ప్ర‌పంచంలో 5 అత్య‌ధిక ధ‌న‌వంతుల జాబితా తెలుసుకుందాం.

జెఫ్ బెజోస్-అమెజాన్‌

జెఫ్ బెజోస్-అమెజాన్‌

అంత‌ర్జాతీయంగా ఈ-కామ‌ర్స్‌లో అమెజాన్ రారాజుగా వెలుగొందుతున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అమెజాన్ సంస్థ‌ను మొద‌ట పుస్త‌కాలు అమ్మే ఆన్‌లైన్ వేదికగా ప్రారంభించారు. 50 వేల కోట్ల డాలర్ల విలువ చేసే అమెజాన్ సంస్థలో బెజోస్‌కు దాదాపు 17 శాతం వాటా ఉంది. డాల‌రు విలువ‌లో చూస్తే జెఫ్ ప్ర‌స్తుత సంప‌ద విలువ 90.9 బిలియ‌న్లుగా ఉంది.

బిల్‌గేట్స్‌-మైక్రోసాఫ్ట్

బిల్‌గేట్స్‌-మైక్రోసాఫ్ట్

ప్ర‌పంచంలో టెక్నాల‌జీలో మొద‌ట గూగుల్, మైక్రోసాఫ్ట్ పేర్లే వినిపిస్తాయి. ప్ర‌పంచంలో ఉండే చాలా ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల‌కు వాడే సాఫ్ట్‌వేర్‌లో మైక్రోసాఫ్ట్ ప్రాముఖ్యం అందరికీ తెలిసిందే. మైక్రోసాఫ్ట్ ఆధిప‌త్యం ద్వారా విప‌రీతంగా డ‌బ్బు సంపాదించిన బిల్ గేట్స్ 1987లో ప్ర‌పంచంలో అత్య‌ధిక ధ‌న‌వంతుల జాబితాలోకి చేరాడు. వారెన్ బ‌ఫెట్‌తో క‌లిసి గివింగ్ ప్లెడ్జ్‌ను ప్రారంభించారు. దీనిలో భాగంగా బిలియ‌నీర్లంతా స‌గం సంప‌ద‌ను స‌మాజానికి తిరిగి ఇస్తారు. కేవ‌లం టెక్నాల‌జీలో స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌లే కాకుండా స్వ‌చ్చంద సేవ‌లో సైతం బిల్‌గేట్స్ పేరు తెచ్చుకున్నారు. ఫోర్బ్స్ ప్ర‌కారం బిల్ గేట్స్ నికర ఆస్తుల విలువ 90.1 బిలియ‌న డాల‌ర్లుగా ఉంది.

అమెన్సియో ఒర్టెగా - ఇండిటెక్స్ ఫ్యాష‌న్ గ్రూప్‌

అమెన్సియో ఒర్టెగా - ఇండిటెక్స్ ఫ్యాష‌న్ గ్రూప్‌

యూర‌ప్‌లోనే నంబ‌ర్ వ‌న్ బిలియ‌నీర్‌గా అమెన్సియా ఒర్టెగా ఉన్నారు.

ఇండిటెక్స్ గ్రూప్ వ్య‌వ‌స్థాప‌కుడైన అమెన్సియో ఒర్టెగా స్పెయిన్‌లో జ‌న్మించారు. ఫిబ్ర‌వ‌రి 2017 నాటికి 72.8 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌దను క‌లిగి ఉన్నారు. యూర‌ప్‌లోనే అత్య‌ధిక సంప‌న్నుడిగా ఆయ‌న ఉన్నారు. 1975లో ఓర్టెగా జ‌రా ఫ్యాష‌న్‌ను ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఇండిటెక్స్ గ్రూప్‌లో భాగంగా ఉన్న ఈ వ‌స్త్ర దుకాణాల సంస్థ 7000 షాపుల‌ను నిర్వ‌హిస్తోంది. ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ నివేదిక ప్ర‌కారం ఇత‌డు యార‌ప్‌లో అత్య‌ధిక ధ‌న‌వంతుడు అవ్వ‌డ‌మే కాకుండా, ప్ర‌పంచంలో రెండో అతి పెద్ద ధ‌న‌వంతుడుగా ఉన్నారు. ఆయ‌న మొద‌టి భార్య రోసాలియా మేరాకు విడాకులిచ్చి, 2001లో ఫ్లోరాను వివాహం చేసుకున్నారు. ఆయ‌న‌కు ముగ్గురు పిల్ల‌లు. ప్ర‌స్తుతం ఆయ‌న సంప‌ద విలువ 82.7 బిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంద‌ని అంచ‌నా.

వారెన్ బ‌ఫెట్ - బెర్క్‌షైర్ హాత్‌వే

వారెన్ బ‌ఫెట్ - బెర్క్‌షైర్ హాత్‌వే

డ‌బ్బును ఎలా పెట్టుబ‌డి పెట్టి, దాన్ని ఇంత‌లింత‌లు చేయాలో తెలిపిన వ్య‌క్తి వారెన్ బ‌ఫెట్‌. ప్ర‌స్తుతం ప్రపంచంలోనే అత్య‌ధిక సంప‌ద క‌లిగిన వారిలో నాలుగో స్థానంలో నిలిచారు. 86 ఏళ్ల వారెన్ బ‌ఫెట్ 2008 సంవ‌త్స‌రంలో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ధ‌న‌వంతుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థిక మాంద్యంలో కుబేరుడిగా ఎద‌గ‌డం విశేషం. ప్ర‌స్తుతం వారెన్ బ‌ఫెట్ ఆస్తుల విలువ 74.5 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.

 మార్క్ జుక‌ర్ బ‌ర్గ్‌- ఫేస్‌బుక్

మార్క్ జుక‌ర్ బ‌ర్గ్‌- ఫేస్‌బుక్

సోష‌ల్ మీడియాలో ఒక స‌రికొత్త మార్పును సృష్టించిన వ్య‌క్తి ఫేస్‌బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌. త‌న విజ‌య ప్ర‌స్థానంతో ఎంతో మందిని డిజిట‌ల్ బాట ప‌ట్టించిన జుక‌ర్‌బ‌ర్గ్ ప్ర‌పంచంలోనే 5వ అత్య‌ధిక ధ‌న‌వంతుడిగా ఉన్నారు. ఆయ‌న ఆస్తి విలువ 69 బిలియ‌న్ డాల‌ర్లు. బిల్‌గేట్స్‌, వారెన్ బ‌ఫెట్ ప్రారంభించిన గివింగ్ ప్లెడ్జ్‌లో ఈయ‌న సైతం భాగ‌స్వామిగా ఉన్నారు. జుక‌ర్‌బ‌ర్గ్, ఆయ‌న భార్య క‌లిసి ఫేస్‌బుక్‌కు చెందిన 90% షేర్ల‌ను స్వ‌చ్చందంగా స‌మాజానికి ఇవ్వాలిని నిర్ణ‌యించారు. వీటి విలువ 45 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంటుంది

Read more about: amazon microsoft
English summary

జెఫ్ బెజోస్ సంప‌ద‌లో బిల్ గేట్స్‌ను కూడా దాటేశాడా? | Amazon CEO surpassed Bill Gates in terms of wealth

Just over two decades ago, Jeff Bezos started selling books online from his garage. Today, the Amazon CEO surpassed Bill Gates as the richest person on Earth, for a few hours at least
Story first published: Friday, July 28, 2017, 11:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X