For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విమాన ప్ర‌యాణ టిక్కెట్ల‌కు ఆధార్ త‌ప్ప‌నిస‌రి కాదు

ప్ర‌భుత్వం విమాన ప్ర‌యాణంలో ఆధార్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌న్న త‌న ఆలోచ‌న‌ను వెన‌క్కు తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. విమాన ప్ర‌యాణ టిక్కెట్ల‌ను బుక్ చేసుకునేందుకు ఆధార్ సంఖ్య‌ను త‌ప్ప‌నిస‌రి చేసేది లేద‌ని కొ

|

ప్ర‌భుత్వం విమాన ప్ర‌యాణంలో ఆధార్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌న్న త‌న ఆలోచ‌న‌ను వెన‌క్కు తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. విమాన ప్ర‌యాణ టిక్కెట్ల‌ను బుక్ చేసుకునేందుకు ఆధార్ సంఖ్య‌ను త‌ప్ప‌నిస‌రి చేసేది లేద‌ని కొంత మంది ఎంపీల‌కు(పార్ల‌మెంట్ స‌భ్యుల‌కు) చెప్పింది. పి చిదంబ‌రం ఆధ్వ‌ర్యంలో ఏర్పాటైన భ‌ద్ర‌తా వ్య‌వ‌హ‌రాల పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ కమిటీ ప్ర‌భుత్వం నుంచి కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను రాబ‌ట్టింది. దీనికి సంబంధించి ప్ర‌భుత్వంలోని సీనియ‌ర్ అధికారులు స‌మావేశానికి వ‌చ్చారు. వీరికి కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వ‌హించారు. ఆధార్ స‌మాచారం మొత్తం చాలా భ‌ద్రంగా ఉంద‌ని, అది సంఘ‌వ్య‌తిరేక శ‌క్తుల చేతుల్లో కానీ, దుర్వినియోగం అవ‌కాశ‌మే లేద‌ని అధికారులు ఎంపీల‌కు వివ‌రించారు. ఆధార్ ఏయే సంద‌ర్భాల్లో త‌ప్ప‌నిస‌రి

 విమాన టిక్కెట్ల‌కు ఆధార్ త‌ప్ప‌నిస‌రి కాదు

ఆధార్ విష‌య‌మే కాకుండా ప‌లు ఇత‌ర విష‌యాల‌పై పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ కమిటీ చ‌ర్చించింది. కొన్ని భ‌ద్ర‌తా విష‌యాల‌పై ఎంపీలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం స‌మాధానం ఇచ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. బ్యాంకులు, మొబైల్‌, సంక్షేమ ప‌థ‌కాలు మొద‌లైన వాటికి ప్ర‌భుత్వం ఎందుకు ఆధార్‌ను లింక్ చేస్తోంద‌ని ఎంపీలు ప్ర‌శ్నించారు. ఈ నిర్ణ‌యాన్ని రాజ‌కీయంగా తీసుకున్నందున దానికి తాము స‌మాదానం చెప్పే స్థితిలో లేమ‌ని అధికారులు స‌మాధానం ఇచ్చారు. ప్రైవేటు సంస్థ‌లు ఆధార్ స‌మాచారాన్ని తీసుకునే ప‌రిస్థితుల్లో పౌరుల వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త ఎలా ర‌క్షించ‌బ‌డుతుందో చెప్పాల‌ని ఎంపీలు అడ‌గ్గా, ఎవ‌రూ ఆధార్ డేటా తీసుకున్నా ఆధార్ సాఫ్ట్‌వేర్‌ను మాత్రం యూఐడీఏఐ నిర్వ‌హిస్తున్నందున ఆధార్ స‌మాచారం దుర్వినియోగం అయ్యే అవ‌కాశ‌మే లేద‌ని ఎంపీల‌కు వివ‌రించారు.

Read more about: flight aadhar
English summary

విమాన ప్ర‌యాణ టిక్కెట్ల‌కు ఆధార్ త‌ప్ప‌నిస‌రి కాదు | aadhaar is not mandatory for Air travel

No plans to make Aadhaar mandatory for air tickets, Govt. tells MPs
Story first published: Friday, July 28, 2017, 17:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X