For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వస్తు, సేవ‌ల ప‌న్నులో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏమిటి?

ప్ర‌భుత్వానికి జీఎస్టీ రూపంలో వ‌స్తువు అమ్మ‌కం మీద‌ పన్ను క‌ట్టేప్పుడు ఇది వ‌ర‌కూ చెల్లించిన ప‌న్నుల‌ను తీసివేసి మిగిలిన ప‌న్ను మాత్ర‌మే స‌రిపోతుంది. దీని అమలు వాస్త‌వంగా ఎలా జ‌ర‌గుతుందో, దానిపై అనుమా

|

కంపెనీలు అమ్మే వ‌స్తువుల‌పై కేంద్ర ప‌న్ను, రాష్ట్ర ప‌న్ను, స‌మీకృత పన్ను(ఐజీఎస్టీ) లేదా కేంద్ర పాలిత ప్రాంత‌(యూటీజీఎస్టీ) ప‌న్ను. ఎదురు చెల్లింపు ప్రాతిప‌దిక‌న చెల్లించిన ప‌న్ను. దిగుమ‌తుల‌పై విధించే స‌మీకృత వ‌స్తు,సేవ‌ల ప‌న్ను కూడా ఇందులో అంత‌ర్భాగ‌మే. అయితే మిశ్ర‌మ విధింపు కింద చెల్లించిన ప‌న్ను ఇందులో భాగ‌మై ఉండ‌దు. ఇన్‌పుట్ ట్యాక్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఒక కంప్యూట‌ర్‌ను త‌యారీ చేయాలంటే విడిభాగాలు వివిధ సంస్థ‌ల నుంచి ముడిస‌రుకు రూపంలో సేక‌రిస్తారు. అప్పుడు వివిధ స్థాయిల్లో ప‌న్ను చెల్లిస్తారు. మ‌ళ్లీ ప్ర‌భుత్వానికి జీఎస్టీ రూపంలో వ‌స్తువు అమ్మ‌కం మీద‌ పన్ను క‌ట్టేప్పుడు ఇది వ‌ర‌కూ చెల్లించిన ప‌న్నుల‌ను తీసివేసి మిగిలిన ప‌న్ను మాత్ర‌మే స‌రిపోతుంది. దీని అమలు వాస్త‌వంగా ఎలా జ‌ర‌గుతుందో, దానిపై అనుమానాల‌ను తెలుసుకుందాం.

ఏవి ఉత్పాద‌క ప‌న్నులో భాగం?

ఏవి ఉత్పాద‌క ప‌న్నులో భాగం?

ఎదురు చెల్లింపు ప్రాతిప‌దిక‌న చెల్లించిన జీఎస్టీని ఉత్పాద‌క పన్నుగా ప‌రిగ‌ణిస్తారు. ఉత్పాద‌క వ‌స్తువులు, సేవ‌లు, మూల‌ధ‌న వ‌స్తువుల‌పై చెల్లించిన ప‌న్ను(సీజీఎస్టీ, ఐజీఎస్టీ, ఎస్‌జీఎస్‌టీ) ఉత్పాద‌క ప‌న్నులో భాగం అవుతాయి.మూల‌ధ‌న వ‌స్తువుల‌పై చెల్లించిన ప‌న్నును ఒకే సారి వాడుకునేందుకు సైతం చ‌ట్టం అనుమ‌తిస్తుంది.

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప‌రిగ‌ణ‌న‌

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప‌రిగ‌ణ‌న‌

ఒక న‌మోదిత వ్య‌క్తి త‌న వ్యాపార విస్త‌ర‌ణ లేదా అందులో భాగంగా ఉద్దేశించిన వ‌స్తువులు లేదా రెండింటి స‌ర‌ఫ‌రాపై విధించిన ఉత్పాద‌క ప‌న్ను జ‌మ(ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్) పొంద‌డానికి అర్హ‌త క‌లిగి ఉంటాడు. కానీ ఇది కొన్ని ష‌ర‌తులు, ప‌రిమితుల‌కు లోబ‌డే ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి.

 ఇన్‌పుట్ ట్యాక్స్ పొందాలంటే ఏమేం పాటించి ఉండాలి?

ఇన్‌పుట్ ట్యాక్స్ పొందాలంటే ఏమేం పాటించి ఉండాలి?

ఇన్‌పుట్ ట్యాక్స్ పొందడం కోసం ఈ కింది 4 ష‌ర‌తుల‌ను పాటించాల్సి ఉంటుంది:

(ఎ) ప‌న్ను ర‌సీదు లేదా త‌గ్గింపు ప‌త్రం(డెబిట్ నోట్) లేదా అటువంటి నిర్దేశిత ప‌న్ను చెల్లింపు ప‌త్రం క‌లిగి ఉండాలి. అంటే ప్ర‌తి ద‌శ‌లో రసీదు ఉండాలి.

(బీ) వ‌స్తువులు లేదా సేవ‌లు లేదా రెండింటిలో ఏదైనా స్వీక‌రించి ఉండాలి.

(సీ) ప్ర‌భుత్వానికి చేసిన స‌ర‌ఫ‌రాల‌కు సంబంధించి విధించిన ప‌న్నును స‌ర‌ఫ‌రాదారు వాస్త‌వంగా చెల్లించి ఉండాలి.

(డీ) సెక్ష‌న్ 39 కింద అత‌డు రిట‌ర్న్ స‌మ‌ర్పించి ఉండాలి.

మొత్తం వ‌స్తు స‌ర‌ఫ‌రా పూర్త‌యిన త‌ర్వాత మాత్ర‌మే న‌మోదిత వ్య‌క్తి ఐటీసీ పొందేందుకు అర్హుడు.

ఒక వ్య‌క్తి త‌న‌కు అందిన స‌ర‌ఫ‌రాల‌కు ప్ర‌తిఫ‌లంతో పాటు ప‌న్ను చెల్లించ‌క‌పోయినా ఐటీసీ పొంద‌గ‌ల‌డా?

ఒక వ్య‌క్తి త‌న‌కు అందిన స‌ర‌ఫ‌రాల‌కు ప్ర‌తిఫ‌లంతో పాటు ప‌న్ను చెల్లించ‌క‌పోయినా ఐటీసీ పొంద‌గ‌ల‌డా?

ప‌న్ను చెల్లించ‌క‌పోయినా కొన్ని సార్లు ప్ర‌తిఫ‌లం పొంద‌గ‌ల‌డు. అయితే, ఇందుకోసం తాను స్వీక‌రించిన వ‌స్తువుల‌కు బిల్లు జారీ అయిన తేదీ నుంచి 180 రోజుల్లోగా ప్ర‌తిఫ‌లంతో పాటు ప‌న్నును అత‌డు చెల్లించాల్సి ఉంటుంది. ఎదురు చెల్లింపు ప్రాతిప‌దిక‌న ప‌న్ను చెల్లించేట్ల‌యితే ఈ ష‌ర‌తు వ‌ర్తించ‌దు.

6 నెల‌ల్లోపు(180 రోజుల్లోగా) ప‌న్ను చెల్లించ‌క‌పోతే....

6 నెల‌ల్లోపు(180 రోజుల్లోగా) ప‌న్ను చెల్లించ‌క‌పోతే....

న‌మోదిత వ్య‌క్తి పొందిన ఐటీసీ మొత్తం అత‌డి పన్ను చెల్లింపు బాధ్య‌త‌కు జ‌మ కావ‌డ‌మే కాకుండా దానిపై వ‌డ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఆ త‌ర్వాత‌నైనా ప్ర‌తిఫ‌లంతో పాటు ప‌న్ను చెల్లిస్తే, అత‌డు ఐటీసీని తిరిగి పొందే వీలుంది.

ప‌న్ను విధించ‌ద‌గిన వ్య‌క్తికి కాకుండా వ‌స్తువుల‌ను మ‌రొక‌రికి పంపితే ఎలా?

ప‌న్ను విధించ‌ద‌గిన వ్య‌క్తికి కాకుండా వ‌స్తువుల‌ను మ‌రొక‌రికి పంపితే ఎలా?

ప‌న్ను విధించ‌ద‌గిన న‌మోదిత వ్య‌క్తి సూచ‌న మేర‌కు స‌ద‌రు వ‌స్తువుల‌ను మూడో ప‌క్షం స్వీక‌రించిన‌ప్ప‌టికీ వాటిని అత‌డే స్వీక‌రించిన‌ట్లు ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీస‌కుంటుంది. అందువ‌ల్ల వ‌స్తువుల‌ను మూడో వ్య‌క్తికి చేర్చాల్సిందిగా ఆదేశించిన వ్య‌క్తే ఐటీసీని వినియోగించుకోగ‌ల‌డు.

ఐటీసీ పొంద‌డానికి గ‌ల గ‌డువు... అందుకు కార‌ణాలు ఏమిటి?

ఐటీసీ పొంద‌డానికి గ‌ల గ‌డువు... అందుకు కార‌ణాలు ఏమిటి?

త‌దుప‌రి ఆర్థిక సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 20 లేదా వార్షిక రిట‌ర్ను స‌మ‌ర్ప‌ణ తేదీల్లో ఏది ముందైతే అదే ఐటీసీ పొంద‌డానికి తుది గ‌డువు అవుతుంది. ఈ నిబంధ‌న‌లోని అంత‌రార్థం ఏమిటంటే... సెక్ష‌న్ 39 ప్ర‌కారం న‌మోదిత వ్య‌క్తి త‌దుప‌రి ఆర్థిక సంవ‌త్స‌రం సెప్టెంబ‌రు ఆఖ‌రులోగా త‌న వార్షిక రిట‌ర్న్ స‌మ‌ర్పించాలి. కాబ‌ట్టి ఆ త‌ర్వాత అందులో మార్పులు చేసే అవ‌కాశం ల‌భించ‌దు. ఒక‌వేళ సెప్టెంబ‌రుకు ముందే రిట‌ర్న్ స‌మ‌ర్పించినా ఆ ప్ర‌క్రియ పూర్త‌య్యాక అందులో మార్పుచేర్పుల‌ను చ‌ట్టం అనుమ‌తించ‌దు. కాబ‌ట్టి న‌మోదిత వ్య‌క్తి ఈ నిబంధ‌న పాటించ‌ని సంద‌ర్భంలో ఐటీసీని వినియోగించుకోలేడు.

మూల‌ధ‌న వ‌స్తువుల విష‌యంలో త‌రుగుద‌లకు సంబంధించి ఇలా...

మూల‌ధ‌న వ‌స్తువుల విష‌యంలో త‌రుగుద‌లకు సంబంధించి ఇలా...

ప‌న్ను విధించ‌ద‌గిన న‌మోదిత వ్య‌క్తి ఆదాయపు ప‌న్ను చ‌ట్టం-1961 కింద త‌రుగుద‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ముందే మూల‌ధ‌న వ‌స్తువుల విలువ‌పై ఐటీ చ‌ట్టం,1961 కింద స‌ద‌రు ప‌న్ను మిన‌హాయింపు పొందిన‌ట్ల‌యితే, ఐటీసీ పొంద‌డానికి అనుమ‌తించరు.

ప‌న్ను జ‌మ‌- ముడి ప‌దార్థాల విష‌యంలో ఇలా...

ప‌న్ను జ‌మ‌- ముడి ప‌దార్థాల విష‌యంలో ఇలా...

ప‌న్ను విధించ‌ద‌గిన వ‌స్తువులు లేదా సేవ‌ల స‌ర‌ఫ‌రా కోసం ఉప‌యోగించే ముడి ప‌దార్థంపై చెల్లించిన ప‌న్ను జ‌మ‌ను పొంద‌డానికి జీఎస్టీ చ‌ట్టం అనుమ‌తిస్తుంది. చ‌ట్టంలో పొందుప‌ర‌చిన ఒక చిన్న జాబితాలోని కొన్ని వ‌స్తువులు మిన‌హా మిగిలిన అన్నింటిపైనా ప‌న్ను జ‌మ పొంద‌వ‌చ్చు. ఈ జాబితాలో ప్ర‌ధానంగా వ్య‌క్తిగ‌త వినియోగ వ‌స్తువులు, స్థిరాస్తి(యంత్రాలు,యంత్ర‌ప‌రిక‌రాలు మిన‌హా) నిర్మాణంలో వినియోగించిన ఉత్పాద‌కాలు, టెలికాం ట‌వ‌ర్లు, కంపెనీల‌ ప్రాంగ‌ణాల బ‌య‌ట నిర్మించిన పైపులైన్లు, వంటి వాటితో పాటు ప‌న్ను ఎగ‌వేత బ‌య‌ట‌ప‌డ‌టం వ‌ల్ల చెల్లించిన ప‌న్నులు ఉన్నాయి.

వ్యాపారానికి ఉద్దేశించిన భ‌వ‌న నిర్మాణంలో వాడే వ‌స్తుసేవ‌లకు సంబంధించి ఒక వ్య‌క్తి ఐటీసీ పొంద‌గ‌ల‌డా?

వ్యాపారానికి ఉద్దేశించిన భ‌వ‌న నిర్మాణంలో వాడే వ‌స్తుసేవ‌లకు సంబంధించి ఒక వ్య‌క్తి ఐటీసీ పొంద‌గ‌ల‌డా?

పొంద‌లేడు. స్థిరాస్తి నిర్మాణంలో వినియోగించే(యంత్రాలు,యంత్ర‌ప‌రిక‌రాలు మిన‌హా) వ‌స్తువులు లేదా సేవ‌ల‌పై ఐటీసీ అనుమ‌తించ‌రు. యంత్రాలు, యంత్ర ప‌రిక‌రాల‌లోనూ కేవ‌లం సాధ‌న సంప‌త్తి, ఉప‌క‌ర‌ణాలు, పునాది లేదా క‌ట్ట‌డానికి అమ‌ర్చిన యంత్రాలు వంటివి మాత్ర‌మే లెక్క‌లోకి వ‌స్తాయి. భూమి, భ‌వ‌నం త‌దిత‌ర స్థిర నిర్మాణాలు ప‌రిగ‌ణ‌న‌లోకి రావు.

కొత్త‌గా న‌మోదైన వ్య‌క్తికి ఐటీసీ అర్హ‌త మాటేమిటి?

కొత్త‌గా న‌మోదైన వ్య‌క్తికి ఐటీసీ అర్హ‌త మాటేమిటి?

న‌మోదు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వ్య‌క్తి న‌మోదు మంజూరు తేదీకి ముందు రోజున త‌న వ‌ద్ద ఉండే ఉత్పాద‌కాల నిల్వ‌, మ‌ధ్యంత‌ర లేదా పూర్తైన స్థితిలో గ‌ల ఉత్పాద‌కాల వ‌స్తు నిల్వ‌ల‌పై ఐటీసీని పొంద‌వ‌చ్చు. ఒక వ్య‌క్తి నమోదు బాధ్య‌త క‌లిగి ఉండి స‌ద‌రు బాధ్య‌త ఏర్పడిన నాటి నుంచి 30 రోజుల్లోగా న‌మోదుకు ద‌ర‌ఖాస్తు చేసిన సంద‌ర్బంలో... ప‌న్ను చెల్లింపు బాధ్య‌త ఏర్ప‌డే తేదీకి ముందు రోజున త‌న వ‌ద్ద గ‌ల ఉత్పాద‌కాల నిల్వ‌, మ‌ధ్యంత‌ర లేదా పూర్తైన స్థితిలో గ‌ల ఉత్పాద‌క వ‌స్తు నిల్వ‌ల‌పై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొంద‌వ‌చ్చు.

Read more about: gst taxes input tax credit
English summary

వస్తు, సేవ‌ల ప‌న్నులో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏమిటి? | what is input tax credit in goods and services tax

When you buy a product/service from a registered dealer you pay taxes on purchase, while making sales, tax is collected and periodically the same is adjusted with the tax you already paid at time of purchase and balance liability of tax (tax on sales (minus) tax on purchase) is to be paid to the government. T
Story first published: Thursday, July 27, 2017, 15:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X