For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒడిశాకు 74 పారిశ్రామిక ప్రాజెక్టులు

రూ.2 ల‌క్ష‌ల కోట్ల విలువైన 74 ప్రాజెక్టులు ప్ర‌స్తుతం త‌మ రాష్ట్రంలో విస్త‌రించేందుకు సిద్దంగా ఉన్నాయ‌ని, త‌ద్వారా రాష్ట్ర బ్రాండ్ ఇమేజీ పెరుగుతుంద‌ని ఆ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి స

|

రూ.2 ల‌క్ష‌ల కోట్ల విలువైన 74 ప్రాజెక్టులు ప్ర‌స్తుతం త‌మ రాష్ట్రంలో విస్త‌రించేందుకు సిద్దంగా ఉన్నాయ‌ని, త‌ద్వారా రాష్ట్ర బ్రాండ్ ఇమేజీ పెరుగుతుంద‌ని ఆ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సంజీవ్ చోప్రా చెప్పారు. వైజాగ్‌లో స్థానిక వ్యాపారుల‌తో ముచ్చటించిన త‌ర్వాత గురువారం మీడియాతో మాట్లాడారు. ఒడిశా వ్యాపార అనుకూల‌మైన విధానాల‌తో పాటు, సుల‌భంగా వ్యాపారం చేసుకోవ‌డాన్ని ప్రోత్స‌హిస్తోంద‌ని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాకుండా, త‌మ రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవ‌డం సులువ‌ని, త‌మ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవ‌కాశాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాపార వేత్త‌లు ఉప‌యోగించుకోవాల‌ని కోరారు.

 ఒడిశాలో వ్యాపార అనుకూల వాతావ‌ర‌ణం

త‌మ రాష్ట్రంలో మంచి పారిశ్రామిక మౌలిక వ‌స‌తుల‌తో పాటు రెండు ముఖ్య పోర్టులు పారాదీప్‌, ధ‌మ్రా ఉన్నాయ‌ని తెలిపారు. లోహాలు, ఖ‌నిజ వ‌న‌రులు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వాటిని వెలికితీసేందుకు అవ‌కాశ‌ముందన్నారు. త‌మ రాష్ట్రంలో పారిశ్రామిక‌వేత్తలు నెల‌కొల్పాల‌ని, అందుకోసం రాయితీలు కూడా ఇస్తున్న‌ట్లు చెప్పారు. డెర‌స్‌లో సీ ఫుడ్ పార్క్ నెల‌కొల్పిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన కోస్ట‌ల్ కార్పొరేష‌న్ గురించి ప్ర‌స్తావించిన సంజీవ్ చోప్రా ఆహార ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఏపీ పారిశ్రామిక వేత్త‌ల‌కు పిలుపునిచ్చారు.

Read more about: odisha industries
English summary

ఒడిశాకు 74 పారిశ్రామిక ప్రాజెక్టులు | Odisha gets 74 industrial projects of 2Lakh crore value

The Odisha Government is currently pursuing 74 industrial projects entailing an investment of more than Rs. 2 lakh crore and it will give a big boost to the brand image of the State, according to Sanjeev Chopra, Principal Secretary, Industries.
Story first published: Thursday, July 27, 2017, 17:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X