For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను ఫైల్ చేయ‌ని 6000 ఎన్జీవోలు

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌ని వ్య‌క్తులు, సంస్థ‌ల‌పై ప్ర‌భుత్వం బాగా దృష్టిసారించిన‌ట్లు క‌న‌బ‌డుతోంది. 2010-11 నుంచి 2014-15 మ‌ధ్య ఐదు సంవ‌త్స‌రాల కాలంలో చాలా సంస్థ‌లు వార్షిక ఆదాయ‌,ఖ‌ర్చుల

|

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌ని వ్య‌క్తులు, సంస్థ‌ల‌పై ప్ర‌భుత్వం బాగా దృష్టిసారించిన‌ట్లు క‌న‌బ‌డుతోంది. 2010-11 నుంచి 2014-15 మ‌ధ్య ఐదు సంవ‌త్స‌రాల కాలంలో చాలా సంస్థ‌లు వార్షిక ఆదాయ‌,ఖ‌ర్చుల నివేదిక‌ల గురించి ప‌ట్టించుకోలేదు. ఈ కాలంలో దాదాపు 18వేల ఎన్జీవోలు నివేదిక‌లు ఇవ్వ‌క‌పోగా, ప‌న్ను రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించ‌లేద‌ని రాజ్య‌స‌భ‌లో ప్ర‌భుత్వం స‌మాధాన‌మిచ్చింది.

ఎన్‌జీవోలు

2010-11 నుంచి 2014-15 మ‌ధ్య కాలంలో ప‌న్ను రిట‌ర్నుల‌ను ఫైల్ చేయ‌ని వాటికి వాటిని అప్‌లోడ్ చేసేందుకు ఒక నెల పాటు స‌మ‌యం ఇచ్చిన‌ట్లు హోం శాఖ స‌హాయ మంత్రి కిర‌ణ్ రిజుజు రాజ్య‌స‌భలో ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం 8000 ఎన్‌జీవోలు త‌మ రిట‌ర్నుల‌ను ఇప్ప‌టిదాకా స‌మర్పించాయ‌ని రిజుజు వెల్ల‌డించారు. ఇంకా 6000 ఎన్‌జీవోల‌కు షోకాజ్ నోటీసులు పంపారు. ఎఫ్‌సీఆర్‌ఏ,2010 చ‌ట్టం ప్రకారం రిజిస్ట‌రైన ఎన్జీవోల్లో ఇన్‌వాలిడ్ బ్యాంకు ఖాతాలు ఉన్న‌వారిని సైతం వాటిని స‌రిచేసుకోవాల్సిందిగా కోరిన‌ట్లు తెలిపారు. మొత్తం 25వేల ఎన్జీవోలు ఎఫ్‌సీఆర్‌ఏ,2010 చ‌ట్టం కింద న‌మోదు కాగా దాదాపు 5వేల ఎన్జీవోల బ్యాంకు ఖాతాలు స‌రిగా లేన‌ట్లు గుర్తించారు.

Read more about: it returns taxes
English summary

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను ఫైల్ చేయ‌ని 6000 ఎన్జీవోలు | Govt issues notices to NGOs for not filing tax returns

More than 18,000 NGOs did not file their annual income and expenditure statements for the five-year period between 2010-11 and 2014-15, the Rajya Sabha was informed on Wednesday.
Story first published: Thursday, July 27, 2017, 13:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X