For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొద‌టిసారి 10 వేల మార్కును తాకిన నిఫ్టీ

బుధ‌వారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు మ‌రో స‌రికొత్త రికార్డును నెల‌కొల్పాయి. నిఫ్టీ మొద‌టిసారి 10 వేల మార్కును దాటింది. మరో సూచీ సెన్సెక్స్ సైతం రికార్డు గ‌రిష్టాల‌కు వెళ్లింది. మంచి ఫ‌లితాల‌ను ప్ర‌క‌ట

|

బుధ‌వారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు మ‌రో స‌రికొత్త రికార్డును నెల‌కొల్పాయి. నిఫ్టీ మొద‌టిసారి 10 వేల మార్కును దాటింది. మరో సూచీ సెన్సెక్స్ సైతం రికార్డు గ‌రిష్టాల‌కు వెళ్లింది. మంచి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించిన యెస్ బ్యాంక్ నిప్టీలో 5.81% ఎగ‌బాకి టాప్ గెయిన‌ర్‌గా నిలిచింది. ఈ రోజు మార్కెట్ విశేషాలు మీ కోసం...

రెండు ప్ర‌ధాన సూచీలు దూసుకెళ్లాయి

రెండు ప్ర‌ధాన సూచీలు దూసుకెళ్లాయి

బీఎస్ఈ సెన్సెక్స్ 154 పాయింట్లు లాభ‌ప‌డి 32,382.46 వ‌ద్ద ముగియ‌గా; మ‌రో సూచీ నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 10,020.65 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ ఈ రోజు 0.56% లాభ‌ప‌డింది.

రంగాల వారీగా

రంగాల వారీగా

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(1.74%), మూల‌ధ‌న వ‌స్తువులు(0.89%), హెల్త్ కేర్(0.8%), బ్యాంకింగ్‌(0.74%) లాభ‌ప‌డ్డాయి. మ‌రో వైపు టెక్నాల‌జీ(0.37%), ఐటీ రంగం(0.2%) న‌ష్ట‌పోయాయి.

సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన‌వి, న‌ష్టపోయిన‌వి

సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన‌వి, న‌ష్టపోయిన‌వి

సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో టాటా స్టీల్‌(2.22%), స‌న్ ఫార్మా(2.08%), ఐసీఐసీఐ బ్యాంక్(2.07%), ఎమ్ అండ్ ఎం(1.94%), సిప్లా(1.82%) లాభ‌ప‌డిన వాటిలో ఉండ‌గా, న‌ష్టపోయిన వాటిలో యాక్సిస్ బ్యాంక్(2.9%), ఏసియ‌న్ పెయింట్స్‌(1.43%), టీసీఎస్‌(0.62%), భార‌తీ ఎయిర్‌టెల్(0.32%), బ‌జాజ్ ఆటో(0.24%) ముందు ఉన్నాయి.

ప్ర‌ధాన మార్పులు

ప్ర‌ధాన మార్పులు

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ షేర్ 1.16%, ఐటీసీ, ఐసీఐసీఐ రెండు శాతం చొప్పున లాభ‌ప‌డ్డాయి. దీంతో దేశంలో రెండు ప్ర‌ధాన సూచీలు పైకి ఎగ‌ళాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవ‌ర్‌, స‌న్ ఫార్మా, సిప్లా, టాటా స్టీల్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా దాదాపు 2.22% వ‌ర‌కూ లాభ‌ప‌డ్డాయి. వాల్ స్ట్రీట్ సూచీలు రికార్డు గ‌రిష్టాల‌కు వెళ్ల‌డం, డాల‌రు స్థిరంగా కొన‌సాగుతుండ‌టం మ‌న మార్కెట్ల‌కు క‌లిసొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, యూర‌ప్, అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియ‌డం మ‌న‌కు లాభించింది.

English summary

మొద‌టిసారి 10 వేల మార్కును తాకిన నిఫ్టీ | Nifty closes above 10000 points for the 1st time

The benchmark BSE Sensex on Wednesday climbed 154 points to end at all time high of 32,382.46 while the NSE Nifty closed above the 10,000 mark for the first time on heavy buying in pharma, banking and oil & gas stocks amid rally in global markets.
Story first published: Wednesday, July 26, 2017, 16:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X