For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో దెబ్బ‌తో ఎయిర్‌టెల్‌పై తీవ్ర ప్రభావం

టెలికం రంగంలో రిలయన్స్‌ జియో సృష్టించిన తీవ్ర పోటీతో భారతీ ఎయిర్‌టెల్‌ లాభాలకు మరోమారు గండిపడింది. 2017 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఎయిర్‌టెల్‌ నికర లాభాలు 75 శాతం పతనమై రూ.367 కోట్లకు ప

|

టెలికం రంగంలో రిలయన్స్‌ జియో సృష్టించిన తీవ్ర పోటీతో భారతీ ఎయిర్‌టెల్‌ లాభాలకు మరోమారు గండిపడింది. 2017 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఎయిర్‌టెల్‌ నికర లాభాలు 75 శాతం పతనమై రూ.367 కోట్లకు పరిమితమయ్యాయి.

జియో వ‌ల్ల ఎయిర్‌టెల్‌ లాభాల‌పై ప్ర‌భావం

గతేడాది ఇదే క్యూ1లో ఏకంగా రూ.1,462 కోట్ల లాభాలు సాధించింది. క్రితం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.373 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 14 శాతం పతనమై రూ.25,546 కోట్ల నుంచి రూ.21,958 కోట్లకు క్షీణించింది. మొబైల్‌ డేటా రెవెన్యూ 16.8 శాతం పతనమై రూ.3,765 కోట్లుగా నమోదయ్యింది. దేశీయ రెవెన్యూలో 10 శాతం తగ్గి రూ.17,244 కోట్లుగా చోటు చేసుకుంది. కొత్త ఆపరేటర్‌ వల్ల క్రితం త్రైమాసికంలోనూ మొబైల్‌ మార్కెట్‌లో ఒత్తిళ్లు చోటు చేసుకున్నాయని భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియా సిఇఒ గోపాల్‌ విట్టల్‌ పేర్కొన్నారు. మంగళవారం బిఎస్‌ఇలో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ 1.76 శాతం పెరిగి రూ.427.60 వద్ద ముగిసింది.

Read more about: airtel jio
English summary

జియో దెబ్బ‌తో ఎయిర్‌టెల్‌పై తీవ్ర ప్రభావం | Airtel profit dropped because of Reliance jio

The country's largest telecom company Bharti Airtel on Tuesday posted 74.89 per cent plunge in consolidated net profit to Rs 367 crore for the June quarter of the current fiscal, hit hard by the disruptive pricing of newcomer Reliance Jio.
Story first published: Wednesday, July 26, 2017, 10:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X