For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొద‌టిసారి 10,000 మార్కును తాకిన నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు మ‌దుప‌ర్ల‌కు సంతోషాన్ని తెచ్చిపెడుతున్నాయి. దేశీయ సూచీ నిఫ్టీ మొద‌టిసారి త‌న చ‌రిత్రలో 10వేల మార్కును తాకింది. చాలా రోజుల నుంచి నిఫ్టీ సూచీ 9000-10000 మ‌ధ్య ఊగిస‌లాడుతున్న సంగ‌తి తెల

|

స్టాక్ మార్కెట్లు మ‌దుప‌ర్ల‌కు సంతోషాన్ని తెచ్చిపెడుతున్నాయి. దేశీయ సూచీ నిఫ్టీ మొద‌టిసారి త‌న చ‌రిత్రలో 10వేల మార్కును తాకింది. చాలా రోజుల నుంచి నిఫ్టీ సూచీ 9000-10000 మ‌ధ్య ఊగిస‌లాడుతున్న సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా నెల రోజుల క్రితం నిఫ్టీ 9511 వ‌ద్ద ఉంది. కేవ‌లం నెల రోజుల వ్య‌వ‌ధిలోనే 500 పాయింట్లు ఎగ‌బాకింది.

 రికార్డు స్థాయి వ‌ర‌కూ వెళ్లిన నిఫ్టీ

మంగ‌ళ‌వారం ప్రారంభ ట్రేడింగ్‌లోనే 10,000 పాయింట్ల మార్కు వ‌ర‌కూ వెళ్లింది. అమ్మ‌కాల ఒత్తిడి కార‌ణంగా అయితే ఆ స్థాయి వ‌ద్ద ఎక్కువ సేపు నిల‌దొక్కుకోలేక‌పోయింది. అయితే 9.52 గంటల స‌మ‌యానికి నిఫ్టీ కేవ‌లం 4 పాయింట్ల లాభంతో 9970 వ‌ద్ద కొన‌సాగుతోంది. అయితే నిన్న‌, ఈ రోజు నిఫ్టీ ర్యాలీకి కారణం ముఖ్యంగా రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. త్రైమాసిక ఫ‌లితాల్లో ఆశాజ‌న‌కంగా వివిధ అంచ‌నాల‌ను వెలువ‌రించ‌డంతో ఇన్వెస్ట‌ర్ల‌కు రిల‌య‌న్స్‌పై ఆస‌క్తి పెరిగింది. ఈ రోజు ట్రేడింగ్‌లో లాభ‌ప‌డిన వాటిలో హెచ్‌డీఎఫ్‌సీ ఉంది. త్రైమాసికంలో మంచి ఫ‌లితాల‌ను వెలువ‌రించ‌డ‌మే ఇందుకు కార‌ణం. మార్కెట్లు సానుకూలంగా క‌ద‌ల‌డానికి నిఫ్టీ రికార్డు గ‌రిష్టానికి వెళ్లేందుకు ఐటీ రంగ షేర్లు సైతం దోహ‌ద‌ప‌డ్డాయి.

Read more about: sensex
English summary

మొద‌టిసారి 10,000 మార్కును తాకిన నిఫ్టీ | Nifty touched 10000 mark in tuesday trading

Nifty just a few months to move quickly from 9,000 points to 10,000 points. In fact, exactly a month ago, the Nifty was trading at 9,511 points and his now covered almost 500 points in just one month.
Story first published: Tuesday, July 25, 2017, 9:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X