For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ 30వేల ఐటీ రిట‌ర్నులు ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో

దాదాపు 30 వేల గ‌త సంవ‌త్స‌ర‌పు ఐటీ రిట‌ర్నుల‌ను సీబీడీటీ ప‌రిశీలిస్తోంది. నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఐటీ రిట‌ర్నుల స‌వ‌ర‌ణ జ‌రిగి అనుమానం వ‌చ్చిన వాటిపై విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు సీబీడీటీ ఛైర్మ‌న్ సుశీల్ చంద

|

దాదాపు 30 వేల గ‌త సంవ‌త్స‌ర‌పు ఐటీ రిట‌ర్నుల‌ను సీబీడీటీ ప‌రిశీలిస్తోంది. నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఐటీ రిట‌ర్నుల స‌వ‌ర‌ణ జ‌రిగి అనుమానం వ‌చ్చిన వాటిపై విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు సీబీడీటీ ఛైర్మ‌న్ సుశీల్ చంద్ర తెలిపారు. ఢిల్లీలో 157వ ఆదాయ‌పు ప‌న్ను దినం సంద‌ర్భంగా విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఇలాంటి కేసుల్లో చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు చెప్పారు. గ‌తేడాది న‌వంబ‌రు 8వ తేదీ త‌ర్వాత ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేసి, అంత‌కు ముందు ప‌న్ను వివ‌రాల‌తో స‌రిపోల‌ని వాటిపై దృష్టిపెట్టిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఐటీ రిట‌ర్నులు

ఆప‌రేష‌న్ క్లీన్ మ‌నీ మొద‌టి ద‌శ‌లో భాగంగా కొంత మంది ప‌న్ను చెల్లింపుదారులు త‌మ‌ బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను ఐటీ శాఖ‌కు అంద‌జేయ‌కుండా ఉన్న‌ట్లు గుర్తించామ‌ని సుశీల్ చెప్పారు. "వారికి ఎక్కువ బ్యాంక్ ఖాతాలున్న‌ట్లు గుర్తించాం. అయితే వారి స‌మాధానంలో అన్ని ఖాతాల వివ‌రాల‌ను ఇవ్వ‌కుండా త‌క్కువ ఖాతాల‌ను మాత్ర‌మే ఐటీ శాఖ దృష్టికి తెచ్చారు.మేము వారికి ఈమెయిల్ ద్వారా ప్ర‌శ్న‌లు పంపి స‌మాధానాలు కోరాం. స‌మాధానాల‌ను వెబ్‌సైట్ ద్వారా ఇవ్వొచ్చ‌ని చెప్పాం." అని సుశీల్ చంద్రా వివ‌రించారు.

Read more about: it income tax taxes tax
English summary

ఆ 30వేల ఐటీ రిట‌ర్నులు ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో | IT dept probing 30k cases where IT returns are doubtful

The Income Tax department is probing over 30,000 cases of alleged tax evasion wherein the returns (ITRs) were revised by assessees post demonetisation, CBDT chief Sushil Chandra said today.
Story first published: Tuesday, July 25, 2017, 9:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X