For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.200 నోటు ఆ కొర‌త‌ను తీరుస్తుంద‌ట‌

ఈ నివేదిక‌లో రూ.200 నోటు రావ‌డం వ‌ల్ల నోట్ల మార్పిడి స‌మ‌స్య‌లు కాస్త తొల‌గుతాయ‌ని విశ్లేషించారు.2016 నవంబర్‌ 25 నాటికి బ్యాంకుల వ‌ద్ద ఉన్న న‌గ‌దు 23.19 శాతం ఈ ఏడాది జూన్‌ 23 నాటికి అది 5.4శాతానికి

|

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత క‌రెన్సీలో మార్పులు వచ్చాయి. రూ.500 నోటు క‌రెన్సీ మార‌కంలో కొన‌సాగిన‌ప్ప‌టికీ, రూ.1000 నోటు మాయ‌మైంది. రూ.2000 నోటును ప్ర‌వేశ‌పెట్టారు. అయితే రూ.100, రూ.500 త‌ర్వాత రూ.2000 నోటు ఉండ‌టం ప్ర‌జ‌ల‌కు కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో నోట్ల మార్పిడికి స‌మ‌స్య‌గా ఉండ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం, ఆర్‌బీఐ రూ.200 నోటు గురించి ఆలోచించాయి. ప్ర‌స్తుతం చ‌లామణీలో ఉన్న మొత్తం క‌రెన్సీ నోట్ల ర‌ద్దుకు ముందు ఉన్న దాంట్లో 84 శాతానికి చేరిందని నివేదిక తెలిపింది. బ్యాంకుల వ‌ద్ద ఉన్న న‌గ‌దు(చ‌లామ‌ణిలో ఉన్న న‌గ‌దు) న‌వంబ‌రు త‌ర్వాత కాస్త త‌గ్గిన‌ట్టు ఎస్‌బీఐ ఎకోవ్రాప్ నివేదిక తెలిపింది.

 రూ.200 నోటు రాక‌పై ఎస్‌బీఐ నివేదిక‌

ఈ నివేదిక‌లో రూ.200 నోటు రావ‌డం వ‌ల్ల నోట్ల మార్పిడి స‌మ‌స్య‌లు కాస్త తొల‌గుతాయ‌ని విశ్లేషించారు.
2016 నవంబర్‌ 25 నాటికి బ్యాంకుల వ‌ద్ద ఉన్న న‌గ‌దు 23.19 శాతం ఈ ఏడాది జూన్‌ 23 నాటికి అది 5.4శాతానికి తగ్గిపోయింది. ప్రస్తుతం 5.4శాతం నగదులో సుమారు 3.8శాతం మాత్రమే బ్యాంకుల వద్ద ఉంది. ఇంకా 1.6శాతం అదనపు నగదు అంటే రూ.25వేల కోట్లు నగదు ఏటీఎంలలో ఉంది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు రూ.200 నోటు ఉపయోగపడుతుందని ఎస్‌బీఐ నివేదికలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే బ్యాంకుల వద్ద నగదు విషయంలో భారీ అంతరం ఏర్పడింది. పెద్దనోట్ల రద్దు, నగదు ఉపసంహరణలు తదితర పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి. నోట్లరద్దుకు ముందున్న పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అని పేర్కొంది.

Read more about: 200 note currency rbi banking
English summary

రూ.200 నోటు ఆ కొర‌త‌ను తీరుస్తుంద‌ట‌ | Introduction 200 note in the currency will fill that gap

Introduction of Rs. 200 note will fill in the "missing middle" even as the new currency in circulation (CIC) has already reached 84 per cent of the pre demonetisation level, says a report. Cash with banks, a CIC component, has however witnessed a decline over November 2016 level, said the State Bank of India Ecowrap report.
Story first published: Monday, July 24, 2017, 10:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X