For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌భుత్వ ఆదాయానికి గండి కొట్టిన టెలికాం సంస్థ‌లు

ఆరు ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు రూ.61,064.5 కోట్ల రెవెన్యూలను తక్కువ చేసి చూపించినట్టు కాగ్‌ స్పష్టం చేసింది. ఈ వ్య‌వ‌హారంపై పూర్తి నివేదికను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) శుక్రవారంపార్లమెంట

|

ప్రభుత్వానికి పలు టెలికం కంపెనీలు తమ రెవెన్యూను వేల కోట్లలో తక్కువ చేసి చూపిన విషయాన్ని కాగ్‌ వెలికితీసింది. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌ తదితర ప్రైవేట్‌ టెల్కోలు 2010-11, 2014-15 మధ్య కాలంలో ఈ చర్యకు పాల్పడ్డాయని తెలుస్తోంది. ఈ కాలంలో ఆరు ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు రూ.61,064.5 కోట్ల రెవెన్యూలను తక్కువ చేసి చూపించినట్టు కాగ్‌ స్పష్టం చేసింది. ఈ వ్య‌వ‌హారంపై పూర్తి నివేదికను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) శుక్రవారంపార్లమెంట్‌లో సమర్పించింది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఇక్కడ తెలుసుకుందాం.

రెవెన్యూలు త‌గ్గించి చూపాయ్‌

రెవెన్యూలు త‌గ్గించి చూపాయ్‌

దీంతో ప్రభుత్వానికి రూ.7,697.6 కోట్ల పన్నులు, ఇతర చెల్లింపులకు ఎగ్గొట్టాయని తన నివేదికలో తెలిపింది. కాగ్‌ తన ఆడిట్‌లో 6 టెలికాం సంస్థ‌లు మదింపులో స్థూల గ్రాస్‌ రెవెన్యూలు తగ్గించి చూపించాయని పేర్కొంది. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, ఎయిర్‌ సెల్‌ వంటి ఐదు ఆపరేటర్లకు సంబంధించిన 2010-11 నుంచి 2014-15 కాల ఆడిట్‌ రిపోర్టులో దీన్ని బయటపెట్టింది.

మోసాలు ఈ విధంగా

మోసాలు ఈ విధంగా

మౌలిక వసతుల షేరింగ్‌, విదేశీ మారకం పెరుగుదల, ఆదాయంపై వడ్డీ, పెట్టుబడుల అమ్మకాలు తదితర విభాగాల్లో ఈ మోసాలకు పాల్పడ్డాయని కాగ్ తేల్చింది. రెవెన్యూ షేరును తక్కువ చేసి చూపించడంతో ప్రభుత్వం భారీ మొత్తంలోనే చెల్లింపులను పోగట్టు కుందని కాగ్ నివేదికంలో పొందుప‌రిచింది.

ప్ర‌ధాన టెలికాం సంస్థ‌లు ఇలా...

ప్ర‌ధాన టెలికాం సంస్థ‌లు ఇలా...

2010-11 నుంచి 2014-15 కాలంలో ఎయిర్‌టెల్‌ ప్రభుత్వానికి లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రం చార్జీల కింద రూ.2,602.24 కోట్లు బాకీ పడిందని పేర్కొంది. మరో రూ.1,245.91 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని తెలిపింది. వొడాఫోన్‌ రూ.1,178.84 కోట్ల వడ్డీతో కలుపుకుని రూ.3.331.79 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆర్‌కామ్‌ రూ.1,911 కోట్లు, ఎయిర్‌సెల్‌ రూ.1,226.65 కోట్లు, ఎస్‌ఎస్‌టిఎల్‌ రూ.116.71 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంది.

టెలికాం శాఖ వైఫ‌ల్యాన్ని ఎత్తిచూపిన ఆడిట‌ర్‌

టెలికాం శాఖ వైఫ‌ల్యాన్ని ఎత్తిచూపిన ఆడిట‌ర్‌

లైసెన్సుల్లో ఉన్న విధంగా రెవెన్యూల‌కు సంబంధించి త‌ప్పుడు లెక్క‌లు చూపినా త‌గు చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో టెలికాం శాఖ వైఫల్యాన్ని ఆడిట‌ర్ ఎత్తిచూపారు. త‌క్కువ రెవెన్యూల మూలంగా వ‌చ్చిన ఆదాయానికి చెల్లించిన వాస్త‌వ వ‌డ్డీ రూ.4531.62 కోట్లు. నిజానికి ప్ర‌భుత్వానికి వారు చెల్లించాల్సిన సొమ్ము రూ.12,220 కోట్లు.

Read more about: telecom vodafone idea airtel
English summary

ప్ర‌భుత్వ ఆదాయానికి గండి కొట్టిన టెలికాం సంస్థ‌లు | six Telcos Under-reported revenues by 61000 crores

Six leading private telecom players understated their revenues by over ₹61,000 crore, depriving the exchequer of ₹7,697.62 crore, the Comptroller and Auditor General of India said in a report tabled in Parliament on Friday.
Story first published: Saturday, July 22, 2017, 10:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X