For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలుగు రాష్ట్రాల్లో మార్చి, 2018 క‌ల్లా బీఎస్ఎన్ఎల్ 4జీ

ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 4జి సేవలను వచ్చే ఏడాది మార్చికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, 1,150 వరకు 4జి సై

|

ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 4జి సేవలను వచ్చే ఏడాది మార్చికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, 1,150 వరకు 4జి సైట్స్‌ను నెలకొల్పనున్నట్లు బిఎన్‌ఎన్‌ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజన్ ఎల్ అనంతరామ్ ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ

శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే 4జీ సేవల నిర్మాణ పనులు చేపడ‌తామన్నారు. కాగా, దేశం మొత్తం మీద 4జీ కోసం పదివేల సైట్లను ఎంపిక చేశారు. అందులో తెలంగాణకు 550 సైట్లు, ఆంధ్రాకు 600 సైట్లను కేటాయించారని ఆయన చెప్పారు. మరోవైపు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 4,27,209 సిమ్‌లు యాక్టివేట్ అయినట్లు చెప్పారు. ఇకపోతే రెండు రాష్ట్రాల్లో గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో రూ. 2,500 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ 4జీ ప్లస్ కింద వైఫై సర్వీసులు తెలంగాణలో ప్రారంభించామన్నారు. మొదటి దశలో 63 లొకేషన్లలో వైఫై సేవలు ప్రారంభించారు. ఇందులో 11 రూరల్ ఎక్స్ఛేంజీలు ఉన్నాయన్నారు. వచ్చే నెలాఖరు నాటికి మరో 58 ప్ర‌దేశాల్లో ఇటువంటివి ప్రారంభిస్తామన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఐఐటిలో ర్యాంకు వచ్చిన కార్తీక్, ఎమ్సెట్‌లో ర్యాంకు సాధించిన సాయిసుమంత్‌లకు సిమ్ కార్డులను అందజేశారు.

Read more about: bsnl 4g
English summary

తెలుగు రాష్ట్రాల్లో మార్చి, 2018 క‌ల్లా బీఎస్ఎన్ఎల్ 4జీ | bsnl soon to start 4g services in ap and telangana

Public sector telecom operator BSNL will rollout 4G services in Telangana and Andhra Pradesh by March 2018, a senior official said on Friday.The tender formalities are complete and a total of 1,150 4G sites will be installed in both the states and the 4G services will be launched by March 2018, BSNL Telangana Circle Chief General Manager L Anantharam told reporters here
Story first published: Saturday, July 22, 2017, 17:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X