For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎమ్ క్యాష్‌బ్యాక్ ఇప్పుడు బంగారం రూపంలో

మొబైల్ వాలెట్ దిగ్గ‌జం పేటీఎమ్‌ తాజాగా తమ వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను డిజిటల్ బంగారం రూపంలో ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తమ ప్లాట్‌ఫాం ద్వారా లావాదేవీలు జరిపే వారు ఇకపై తామిచ్చే క్యాష్‌బ్

|

మొబైల్ వాలెట్ దిగ్గ‌జం పేటీఎమ్‌ తాజాగా తమ వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను డిజిటల్ బంగారం రూపంలో ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తమ ప్లాట్‌ఫాం ద్వారా లావాదేవీలు జరిపే వారు ఇకపై తామిచ్చే క్యాష్‌బ్యాక్‌ను డిజిటల్ పసిడి రూపంలోనూ పొందవచ్చని సంస్థ తెలిపింది. దేశంలో పొదుపు, ఖ‌ర్చు అలవాట్ల‌కు రెండింటికీ సంబంధించి మంచి అనుభ‌వాన్ని ఇది ఇవ్వ‌గ‌ల‌ద‌ని, ఎంతో మంది మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌యిన‌ గోల్డ్‌ను ఇది వినియోగ‌దారుల‌కు చేరువ చేయ‌గ‌ల‌ద‌ని పేటీఎమ్ ప్ర‌క‌ట‌న పేర్కొంది.

 పేటీఎమ్ డిజిట‌ల్ గోల్డ్‌గా క్యాష్‌బ్యాక్‌ను మార్చుకునే వీలు

పేటీఎమ్ గోల్డ్ రిఫైన‌రీ ఎంఎంటీసీ-పీఏఎంపీతో జ‌ట్టు క‌ట్టింది. త‌ద్వారా వినియోగ‌దారులు రూ.1 నుంచి మొదలుకొని ఆన్‌లైన్ బంగారాన్ని క్ష‌ణాల్లో కొనే వెసులుబాటు వచ్చింది. పేటీఎమ్ వాడ‌కం దార్లు 24కే 999.9 స్చ‌చ్చ‌త గ‌ల బంగారాన్ని కొని దాన్ని ఎంఎంటీసీ-పీఏఎమ్‌పీ సెక్యూరిటీ వాల్ట్‌లో దాచుకోవ‌చ్చు. దీర్ఘ‌కాల పొదుపులో భాగంగా వినియోగ‌దారులు క్యాష్‌బ్యాక్‌ను పేటీఎమ్ డిజిట‌ల్ గోల్డ్ రూపంలోకి మార్చుకునేందుకు కొన్ని నెల‌ల ముందే పేటీఎమ్ రిజిస్ట‌ర్ చేసుకొని ఈ స‌దుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన‌ట్లు తెలిపింది.

Read more about: paytm gold
English summary

పేటీఎమ్ క్యాష్‌బ్యాక్ ఇప్పుడు బంగారం రూపంలో | now you can convert paytm cashback into paytm digital gold

paytm cashback can be converted to digital gold.
Story first published: Friday, July 21, 2017, 12:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X