For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.64 వేల కోట్ల‌ను దాటిన జ‌న్‌ధ‌న్ డిపాజిట్లు

ప్ర‌భుత్వ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో డిపాజిట్ల సంఖ్య రికార్డు స్థాయి రూ.64, 564 కోట్ల‌కు చేరాయి. ఇందులో పెద్ద నోట్ల మార్పిడి(ర‌ద్దు) త‌ర్వాతి ఏడు నెల్ల‌లో జ‌రిగిన డిపాజిట్ల సంఖ్య రూ.

|

ప్ర‌భుత్వ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో డిపాజిట్ల సంఖ్య రికార్డు స్థాయి రూ.64, 564 కోట్ల‌కు చేరాయి. ఇందులో పెద్ద నోట్ల మార్పిడి(ర‌ద్దు) త‌ర్వాతి ఏడు నెల్ల‌లో జ‌రిగిన డిపాజిట్ల సంఖ్య రూ.300 కోట్లుగా ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌తి ఒక్క‌రికీ బ్యాంకు ఖాతా ఉండాల‌నే ఉద్దేశంతో మోడీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌థ‌కం ప్ర‌ధాన మంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న‌(పీఎంజేడీవై). బ్యాంకింగ్ విష‌యంలో అంద‌రికీ అవ‌గాహ‌న తెచ్చేందుకు, ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్దిని నేరుగా ల‌బ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేసేందుకు ఈ ప‌థ‌కాన్ని విస్తృతంగా ఉప‌యోగించాల‌నేది కేంద్ర ప్ర‌భుత్వ ల‌క్ష్యంగా ఉంది.

 జ‌న్‌ధ‌న్ ఖాతాల్లోని డిపాజిట్లు రికార్డు స్థాయికి

ఆర్థిక శాఖ‌కు పీటీఐ ప్ర‌తినిధి స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద చేసిన ద‌ర‌ఖాస్తుకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన మంత్రి జ‌న్ ధ‌న్ ఖాతాల గురించిన స‌మాచారం ఇచ్చింది. జూన్ 14 వ‌ర‌కూ 28.9 కోట్ల జ‌న్‌ధ‌న్ యోజ‌న ఖాతాల్లో ఉన్న సొమ్ము వివ‌రాల‌ను ఇచ్చారు. ఇందులో 23.27 కోట్ల ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల ఖాతాలు, 4.7 కోట్ల గ్రామీణ బ్యాంకుల ఖాతాలు, 92.7 లక్ష‌ల ప్ర‌యివేటు బ్యాంకుల ఖాతాలు ఉన్నాయి. ఈ అన్ని ఖాతాల్లోనూ ఇప్ప‌టిదాకా ఉన్న సొమ్ము విలువ రూ.64,564 కోట్లుగా ఉంది. జ‌న్‌ధ‌న్ ఖాతాల‌కు సంబంధించి ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 50,800 కోట్లు, గ్రామీణ బ్యాంకుల్లో రూ. 11,683.42 కోట్లు, ప్రైవేటు బ్యాంకుల్లో రూ. 2080.62 కోట్లు డిపాజిట్లుగా ఉన్నాయి. గ‌తేడాది నవంబ‌రు 16 నుంచి మొద‌లుకొని ఈ ఏడాది జూన్ 14 మ‌ధ్య పీఎంజేడీవై ఖాతాల్లో జ‌మైన సొమ్ము రూ.311.93 కోట్లుగా తేలింది.

Read more about: pmjdy jan dhan yojana
English summary

రూ.64 వేల కోట్ల‌ను దాటిన జ‌న్‌ధ‌న్ డిపాజిట్లు | Jan dhan accounts 7 months 300 crore deposits

Deposits in Jan Dhan accounts have touched a new high of Rs 64,564 crore, of which over Rs 300 crore came in the first seven months of demonetisation, according to government data.
Story first published: Monday, July 17, 2017, 12:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X