For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుణ వ‌సూళ్ల‌ను వేగిరం చేయండి: ఆర్బీఐ

త‌మ‌కున్న అధికార ప‌రిధిలోనే జూన్ 13వ తేదీలోగా వ‌సూలు కాని బ‌కాయిల రిక‌వ‌రీల‌ను వేగ‌వంతం చేయాల్సిందిగా ఆర్బీఐ బ్యాంకుల‌ను ఆదేశించింది. ఎస్సార్ స్టీల్ లిమిటెడ్ సంబంధించి ఆర్‌బీఐ తీసుకున్న చ‌ర్య‌ల‌ను గుజ

|

త‌మ‌కున్న అధికార ప‌రిధిలోనే జూన్ 13వ తేదీలోగా వ‌సూలు కాని బ‌కాయిల రిక‌వ‌రీల‌ను వేగ‌వంతం చేయాల్సిందిగా ఆర్బీఐ బ్యాంకుల‌ను ఆదేశించింది. ఎస్సార్ స్టీల్ లిమిటెడ్ సంబంధించి ఆర్‌బీఐ తీసుకున్న చ‌ర్య‌ల‌ను గుజ‌రాత్ హైకోర్టులో ఆ కంపెనీ స‌వాల్ చేయ‌గా జ‌రుగుతున్న వాద‌న‌ల సంద‌ర్బంగా ఆర్‌బీఐ లాయ‌ర్ డేరియ‌స్ కంబాటా ఈ విష‌యాన్ని చెప్పారు.

 మొండి బ‌కాయిల వ‌సూళ్లు వేగ‌వంతం చేయాల‌న్న రిజ‌ర్వ్ బ్యాంక్

ఒక ప‌క్క కేంద్ర బ్యాంకు చ‌ర్య‌ల‌కు ఆదేశించిన స‌మ‌యంలోనే తాము అప్పు తీసుకున్న రుణ దాత‌ల వ‌ద్ద రుణ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని కంపెనీ వాదిస్తోంది. ఇన్ సాల్వెన్సీ బ్యాంక‌ర‌ప్ట్సీ కోడ్(ఐబీసీ)-దివాలా చ‌ట్టం ప్ర‌కారం ఎస్సార్ స్టీల్ మొద‌లుకొని డ‌జ‌న్ కంపెనీల జాబితాను సిద్దం చేయాల్సిందిగా రిజ‌ర్వ్ బ్యాంక్ బ్యాంకుల‌ను కోరింది. ఈ కంపెనీల జాబితాను నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్ ముందుకు తీసుకెళ్లారు.
ఇండియ‌న్ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థే ప్ర‌మాదంలో ప‌డే విధంగా ఈ రుణం తీసుకున్న పెద్ద కంపెనీల‌న్నీ క‌లిసి 10 ట్రిలియ‌న్ రూపాయ‌ల అప్పుల‌ను క‌ట్ట‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నారు. కేసు విచారిస్తున్న‌ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎస్‌.జీ.షా మాట్లాడుతూ పిటీష‌న‌ర్‌, లేదా ప్ర‌తివాదులు ఇంత‌వ‌ర‌కూ ఆర్‌బీఐ ఆదేశానుసారం అవ‌స‌ర‌మైన ప‌త్రాలు స‌మ‌ర్పించ‌లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Read more about: rbi banking essar steel
English summary

రుణ వ‌సూళ్ల‌ను వేగిరం చేయండి: ఆర్బీఐ | reserve bank ordered to speed up bad loan recovery

The Reserve Bank of India (RBI) on Thursday said its 13 June directive to banks to speed up their bad-loan recovery was well within its powers, and that its classification of sticky assets could not be challenged.RBI lawyer Darius Khambata said this in the Gujarat high court during a hearing on Essar Steel Ltd’s petition challenging the directive.
Story first published: Friday, July 14, 2017, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X