For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప‌లు ఆన్‌లైన్ లావాదేవీల చార్జీల‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ

బుధ‌వారం ఐఎంపీఎస్ చార్జీల‌ను త‌గ్గించిన దేశీయ దిగ్గ‌జ బ్యాంక్ శుక్ర‌వారం మ‌రిన్ని చార్జీల‌ను త‌గ్గించింది. నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్ లావాదేవీల‌కు సంబంధించిన చార్జీల‌ను జులై 15 నుంచి 75శాతం త‌గ్గిస్తున్న‌ట్

|

బుధ‌వారం ఐఎంపీఎస్ చార్జీల‌ను త‌గ్గించిన దేశీయ దిగ్గ‌జ బ్యాంక్ శుక్ర‌వారం మ‌రిన్ని చార్జీల‌ను త‌గ్గించింది. నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్ లావాదేవీల‌కు సంబంధించిన చార్జీల‌ను జులై 15 నుంచి 75శాతం త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎవ‌రైనా నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్ ఉప‌యోగించి న‌గ‌దు బ‌దిలీ చేస్తే అయ్యే చార్జీలు తగ్గించిన‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న‌లో ఎస్‌బీఐ పేర్కొంది. ప్ర‌భుత్వం చెబుతున్న డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ సాకార‌మ‌య్యే దిశ‌లో తాము క‌దులుతున్న‌ట్లు స్టేట్ బ్యాంక్ వెల్ల‌డించింది.

నెట్ బ్యాంకింగ్‌, లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పొదుపు ఖాతాదారులు న‌గ‌దు బ‌దిలీ చేసుకోవాలంటే ఎక్కువ‌గా నెఫ్ట్‌, ఐఎంపీఎస్ స‌దుపాయాల‌ను వాడ‌తారు. అదే రూ.2 ల‌క్ష‌ల పైబ‌డి న‌గ‌దు బ‌దిలీ చేసే పొదుపు, క‌రెంట్ ఖాతా క‌లిగిన వినియోగ‌దారులు ఆర్‌టీజీఎస్ స‌దుపాయాన్ని వినియోగిస్తారు.

Read more about: sbi imps neft rtgs
English summary

ప‌లు ఆన్‌లైన్ లావాదేవీల చార్జీల‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ | sbi reduces neft and rtgs charges by 75 percent

In a move to promote digital transactions. The revised charges will be applicable on NEFT and RTGS transactions done through internet banking or mobile banking offered by the bank, SBI said in a statement. NEFT and RTGS are electronic payment systems, which allow fund transfer between two accounts of different banks in the country.
Story first published: Thursday, July 13, 2017, 15:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X