For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిధుల వేట‌లో ఆంధ్రా బ్యాంకు

ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు క్వాలిఫైడ్‌ ఇన్స్‌ట్యూ షనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపి) ద్వారా రూ.800-1,000 కోట్ల నిధులు సమీకరించే యేచనలో ఉంది. వచ్చే ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పేరు చె

|

ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు క్వాలిఫైడ్‌ ఇన్స్‌ట్యూ షనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపి) ద్వారా రూ.800-1,000 కోట్ల నిధులు సమీకరించే యేచనలో ఉంది. వచ్చే ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పేరు చెప్పుకోవడా నికి ఇష్టపడని ఆ బ్యాంకు ఉన్నతాధికారి ఒక్కరు పేర్కొన్నారు. దీంతో ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 60 శాతం దిగువకు పడిపోనుంది. ఆంధ్రా బ్యాంకుల్లో 2017,జూన్ 30 నాటికి ప్రభుత్వానికి 61.26 శాతం వాటా ఉంది.

ఆంధ్రా బ్యాంకు

త్వరలోనే క్యూఐపికి బ్యాంకు బోర్డు ఆమోదం తెలుపనుందని బ్యాంకు అధికారి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి త‌మ బ్యాంకుకు రూ.1,100 కోట్ల మూలధనం సమకూరిందన్నారు. ఆంధ్రా బ్యాంకుకు ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో ఉన్న భాగస్వామ్యా వాటాను తగ్గించుకునే యోచన లేదన్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో ఈ కంపెనీ విలువ పెరగనుందన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి ఆంధ్రా బ్యాంకుకు చెప్పుకోద‌గ్గ‌ డివిడెండ్‌ ఏమీ రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది కాలం వేచి చూసే ధోర‌ణిలో ఉన్నామని అన్నారు. ఈ సంస్థలో ఆంధ్రా బ్యాంకుకు 30 శాతం వాటా ఉంది. కాగా బ్యాంకు ఆఫ్‌ బరోడాకు 44 శాతం, లీగల్‌ అండ్‌ జనరల్‌కు 26 శాతం చొప్పున వాటాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో మొండి బాకీల దెబ్బతో ఆంధ్రా బ్యాంకు నికర లాభాలు 32 శాతం తగ్గి రూ.35.13 కోట్లకు పరిమితమయ్యాయి.

Read more about: andhra bank banking
English summary

నిధుల వేట‌లో ఆంధ్రా బ్యాంకు | andhra bank is in a plan to rise 1000 crores through QIP

State-owned lender Andhra Bank is planning to raise Rs. 800-1,000 crore through a qualified institutional placement (QIP) in the next five months to fund growth, a senior bank official said.
Story first published: Thursday, July 13, 2017, 10:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X