For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్విస్ బ్యాంకుల్లో మ‌నోళ్ల న‌ల్ల‌ధ‌నం త‌గ్గింద‌ట‌

స్విస్ బ్యాంకుల్లో భార‌తీయులు దాచుకున్న‌దిగా భావిస్తున్న న‌ల్ల‌ధ‌నం త‌గ్గిన‌ట్లు అధ్య‌య‌నాలు వెలువవ‌డుతున్నాయి. 2016లో స్విట్జ‌ర్లాండ్ బ్యాంకుల్లో ఉన్న భార‌తీయుల బ్లాక్ మ‌నీ దాదాపు స‌గం త‌గ్గి 676 స్వ

|

స్విస్ బ్యాంకుల్లో భార‌తీయులు దాచుకున్న‌దిగా భావిస్తున్న న‌ల్ల‌ధ‌నం త‌గ్గిన‌ట్లు అధ్య‌య‌నాలు వెలువవ‌డుతున్నాయి. 2016లో స్విట్జ‌ర్లాండ్ బ్యాంకుల్లో ఉన్న భార‌తీయుల బ్లాక్ మ‌నీ దాదాపు స‌గం త‌గ్గి 676 స్విస్ ఫ్రాంక్‌(4500 కోట్లు)గా ఉంటుంద‌ని అంటున్నారు. ఒక ప‌క్క బ్లాక్ మ‌నీపై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విదేశాల్లో న‌ల్ల‌ధ‌నం దాచిన వారి జాబితా కోసం ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నిస్తున్న నేప‌థ్యంలో ఇలా జ‌ర‌గ‌డం ప్ర‌స్తావ‌న‌ర్హం. స్విస్ బ్యాంకుల్లో దాగి ఉన్న అన్ని విదేశాల ఖాతాదారుల డ‌బ్బు విలువ 2016లో 1.41 ట్రిలియ‌న్ నుంచి ఈ ఏడాది ప్ర‌స్తుతం 1.42 ట్రిలియ‌న్‌కు పెరిగి ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. అదే భార‌తీయుల విష‌యానికిస్తే 2016 చివ‌రి నాటికి భార‌తీయుల డ‌బ్బు 664.8 మిలియ‌న్లుగా ఉండొచ్చ‌ని స్విస్ నేష‌న‌ల్ బ్యాంకు స‌మాచారాన్ని బ‌ట్టి తెలుస్తోంది.

స్విస్ బ్యాంకుల్లో మ‌నోళ్ల న‌ల్ల‌ధ‌నం త‌గ్గింద‌ట‌

ఇండియా, స్విట్జ‌ర్లాండ్ దేశాల మ‌ధ్య న‌ల్ల‌ధ‌న క‌ట్ట‌డి కోసం ద్వంద్వ స‌మాచార మార్ప‌డి ఒప్పందం ప్ర‌కారం మ‌న దేశానికి ఇక‌పై అధికారికంగా స‌మాచారం వ‌స్తుంది. అయితే ఒప్పందం ప్ర‌కారం స్విస్ ఖాతాదార్ల పేర్ల‌ను గోప్యంగా ఉంచాల్సిందిగా స్విట్జ‌ర్లాండ్ ప్ర‌భుత్వం కోరుతున్న‌ది. కేవ‌లం భార‌త్ నుంచే నేరుగా ఖాతాలు తెరిచిన వివ‌రాల‌ను అయితే రాబ‌ట్టుకోగ‌లిగారు కానీ ఇత‌ర భార‌తీయులు ఎన్ఆర్‌ఐలు కొన్ని ప‌న్ను స్వ‌ర్గ‌దామాలు, హ‌వాలాకు అవ‌కాశాలు క‌ల్పించే మ‌రిన్ని దేశాల నుంచి డ‌బ్బు మ‌ళ్లించి మ‌ళ్లీ స్విట్జ‌ర్లాండ్‌లోని బ్యాంకుల్లో డ‌బ్బు ఉంచి ఉంటే ఆ వివ‌రాల‌ను స్విట్జ‌ర్లాండ్ అధికారుల నుంచి రాబ‌ట్ట‌డం క‌ష్ట‌మే.

Read more about: swiss bank black money
English summary

స్విస్ బ్యాంకుల్లో మ‌నోళ్ల న‌ల్ల‌ధ‌నం త‌గ్గింద‌ట‌ | Suspected Indian black money deposits in Swiss banks decline a lot in a year

There have been several rounds of discussions between Indian and Swiss government officials on the new framework and also for expediting the pending information requests about suspected illicit accounts of Indians in Swiss banks. The funds, described by SNB as 'liabilities' of Swiss banks or 'amounts due to' their clients, are the official figures disclosed by the Swiss authorities and do not indicate to the quantum of the much-debated alleged black money held by Indians in the safe havens of Switzerland.
Story first published: Saturday, July 1, 2017, 14:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X