For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్ని బీమా పాల‌సీలు 28% జీఎస్టీలోకి కాదు

ఇప్ప‌టికే జీఎస్టీపైన ప‌లు విశ్లేష‌ణ‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. అందులో ఒక‌టి బీమా రంగంపై కొంచెం ఎక్కువ ప‌న్ను భారం ప‌డే విధంగా జీఎస్టీ ఉంటుందనేది కూడా ఒక‌టి. అయితే అంద‌రూ అనుకున్న‌ట్లుగా అన్ని పాల‌సీలు 18%

|

ఇప్ప‌టికే జీఎస్టీపైన ప‌లు విశ్లేష‌ణ‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. అందులో ఒక‌టి బీమా రంగంపై కొంచెం ఎక్కువ ప‌న్ను భారం ప‌డే విధంగా జీఎస్టీ ఉంటుందనేది కూడా ఒక‌టి. అయితే అంద‌రూ అనుకున్న‌ట్లుగా అన్ని పాల‌సీలు 18% జీఎస్టీ ప‌రిధిలోకి రావు. ఆర్థిక సేవ‌లు అన్నీ 18% జీఎస్టీ ప‌రిధిలోకి వ‌స్తున్నాయ‌న్న వాద‌న కార‌ణంగా బీమా ప్రీమియంల‌కు అద‌నంగా డ‌బ్బు చెల్లించాల్సి వస్తుంద‌నేది చాలా మంది చెపుతున్న మాట‌. ఎందుకంటే సేవా ప‌న్ను రేటు 15% నుంచి 18%కి పెరుగుతోంది కాబ‌ట్టి.

 బీమా పాల‌సీ ప్రీమియంపై జీఎస్టీ ప్ర‌భావం

ప్రీమియం కాల‌ప‌రిమితి, బీమా పాల‌సీ ర‌కాన్ని బ‌ట్టి ఈ రంగంలో ప‌న్ను విధానం అమ‌ల‌వుతుంది. అది జీవిత బీమా అయినా, సాధార‌ణ బీమా పాల‌సీ అయినా పై రెండు విష‌యాలు ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. ప్ర‌భుత్వం మ‌ద్దతు క‌లిగిన బీమా పాల‌సీలు, త‌క్కువ ప్రీమియం ఉండే చిన్న స్థాయి పాల‌సీలు వంటి విష‌యంలో జీఎస్టీ ఎంత వ‌ర్తిస్తుంద‌నేది స్ప‌ష్ట‌త ఇంత‌వ‌ర‌కూ ఏర్ప‌డ‌లేద‌నేది ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు అనుకుంటున్న మాట‌.
ట‌ర్మ్ పాల‌సీలు, యులిప్‌ల విష‌యంలో కొత్త పాల‌సీ కొనుగోలు చేయాలంటే 18% ప‌న్ను వ‌ర్తించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మోటార్ వాహ‌న బీమా పాల‌సీల విషయంలో సైతం అంతే. ఇంత‌కుముందు ఆయా పాల‌సీల విష‌యంలో అమ‌ల‌వుతున్న ప‌న్ను రేటు 15%. ఒకేసారి ప్రీమియం చెల్లించే పాల‌సీలు లేదా ఎండోమెంట్ పాల‌సీ విష‌యంలో ఇంత‌కుముందు ప‌న్ను రేటు 3.76% ఉండ‌గా ఇక‌పై 4.5% ఉండ‌వ‌చ్చు. పాల‌సీ రెన్యువ‌ల్ చేసుకునేందుకు సైతం జీఎస్టీ త‌ర్వాత 1.89% కాకుండా 2.25% ప‌న్ను రేటు అమ‌ల‌వుతుంది. సింగిల్ ప్రీమియం యాన్యుటీ ప్లాన్ల విష‌యంలో ప‌న్ను రేటు 1.5% నుంచి 1.8% కి పెరుగుతుంది.

Read more about: gst insurance policy motor insurance
English summary

అన్ని బీమా పాల‌సీలు 28% జీఎస్టీలోకి కాదు | Not All Insurance Policies Fall Under 18 percent gst

As is well believed not all insurance policies are brought under the 18% tax bracket under GST. Though the tenet has been put in place for all financial services, it is wrong to assume that from now-on you will have to shell out 3% extra for each of the insurance policy with rates revised upwards from 15%.
Story first published: Saturday, July 1, 2017, 14:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X