For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీ గురించి సందేహాల‌పై ప్ర‌భుత్వ హెల్ప్ డెస్క్‌

జూన్ 30 అర్థ‌రాత్రి దాటిన‌ప్ప‌టి నుంచి జీఎస్టీ అమ‌లు ప్రారంభ‌మైంది. ప్ర‌భుత్వం పెద్ద‌గా స‌న్నాహ‌క ఏర్పాట్లు లేన‌ప్ప‌టికీ జీఎస్టీని రుద్దుతున్న‌ట్లు చాలా వ‌ర్గాలు విమ‌ర్శిస్తున్నాయి. వ్యాపారుల‌కోసం క

|

జూన్ 30 అర్థ‌రాత్రి దాటిన‌ప్ప‌టి నుంచి జీఎస్టీ అమ‌లు ప్రారంభ‌మైంది. ప్ర‌భుత్వం పెద్ద‌గా స‌న్నాహ‌క ఏర్పాట్లు లేన‌ప్ప‌టికీ జీఎస్టీని రుద్దుతున్న‌ట్లు చాలా వ‌ర్గాలు విమ‌ర్శిస్తున్నాయి. వ్యాపారుల‌కోసం కేటాయించిన ప్రావిజ‌న‌ల్ నంబ‌ర్ల‌లో త‌ప్పులు, జీఎస్టీఎన్ నెట్‌వ‌ర్క్లో స్వ‌ల్ప‌లోటు పాట్ల కార‌ణంగా ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలే చెబుతున్నాయి. అయితే రెవెన్యూ మంత్రిత్వ శాఖ కింద ప‌నిచేసే సీబీఈసీ(కేంద్ర ఎక్సైజ్‌,క‌స్ట‌మ్స్ సుంకం) ఎన్నో సాధార‌ణ సందేహాల‌కు స‌మాధానాల‌ను ఇస్తూ వ‌స్తోంది. వీటిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. జీఎస్టీ రిజిస్ట్రేష‌న్ మొద‌లుకొని, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌, పాయింట్ ఆఫ్ ట్యాక్స్ వంటి వివిధ అంశాల‌కు సంబంధించి దేశ‌వ్యాప్తంగా వ్యాపార, వినియోగ‌దారుల‌కు వ‌చ్చే సందేహాల‌ను నివృత్తి చేసేందుకు ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింద‌ని రెవెన్యూ వ‌ర్గాలు ఉంటున్నాయి.

 జీఎస్టీ హెల్ప్ లైన్ నంబ‌ర్లు

డిజిట‌ల్ మార్గాల్లో ఎన్నో వెబ్‌సైట్లు, సోష‌ల్ మీడియా పేజీల ద్వారా ప్ర‌జ‌ల‌కు వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను తీర్చేందుకు ప్ర‌య‌త్నిస్తూ, క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను ఇస్తూ వ‌స్తున్నారు. ఇంతే కాకుండా అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ ప్ర‌జ‌ల‌ను చేరుకునేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు క‌న‌బ‌డుతోంది.
జీఎస్టీ హెల్ప్‌డెస్క్‌
ఈమెయిల్: [email protected]
ఫోన్ నంబ‌ర్‌- 1800 1200 232
జీఎస్టీ నెట్వ‌ర్క్ హెల్ప్ డెస్క్‌
ఈమెయిల్: [email protected]
ఫోన్ నంబ‌ర్‌- 0120 4888999
ట్విట్ట‌ర్ పేజీలలో @askGST_GOI, @askGSTech
ఇంకా అద‌న‌పు సందేహాలుంటే నేరుగా ప‌న్ను చెల్లింపు దారులు 0120-4888999, ప‌న్ను అధికారులు 0124-4479900 నంబ‌ర్ల‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు. ఇంకా ఆర్థిక శాఖ‌, రెవెన్యూ శాఖ ఫేస్‌బుక్‌,ట్విట్ట‌ర్‌ల‌లో మీరు నేరుగా ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తే విలువైన వాటికి ఆ శాఖ స్పందించే అవ‌కాశం ఉంది. స్వాతంత్ర్యం త‌ర్వాత చేప‌డుతున్న అతిపెద్ద ప‌రోక్ష పన్ను సంస్క‌ర‌ణ కాబ‌ట్టి చిన్న చిన్న లోపాలు ఉండ‌వ‌ని చెప్ప‌లేం. అంత మాత్రాన ప్ర‌తి చిన్న దానికి ప్ర‌భుత్వం పైన విమ‌ర్శ‌లు ఎక్కుపెట్ట‌కుండా స‌మ‌స్య‌ల‌కు స‌మాధానాలు రాబ‌ట్టేందుకు ఉన్న మార్గాల గురించి ఆలోచించి జీఎస్టీ అమ‌లును ప్ర‌జ‌లు విజ‌య‌వంతం చేస్తే మంచిది. జీఎస్టీపైన మీ స‌మస్య‌ల‌ను,విశ్లేష‌ణ‌ల‌ను, ఆలోచ‌న‌ల‌ను కింద కామెంట్ల‌లో రాయండి.

English summary

జీఎస్టీ గురించి సందేహాల‌పై ప్ర‌భుత్వ హెల్ప్ డెస్క్‌ | For your queries on gst here is the help desk by Revenue dept

GST or goods and services tax finally saw the light of the day, with the new tax system launched at a function in Central Hall of Parliament on Friday midnight. GST, which embodies the principle of "one nation, one tax, one market" is aimed at unifying the country's $2 trillion economy and 1.3 billion people into a common market. Before the much-awaited GST became a reality, various departments had come out with various publications guidelines in their bid to simplify a transition into the new indirect taxation system.
Story first published: Saturday, July 1, 2017, 15:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X