For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్టోబ‌ర్ డిమాండ్‌కు ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ద‌మ‌వుతున్న రైల్వే

అక్టోబ‌ర్‌లో విప‌రీతంగా ఉండే రైల్వే ప్ర‌యాణికులను ఆక‌ట్టుకునేందుకు రైల్వే శాఖ ఇప్ప‌టి నుంచి సిద్ద‌మ‌వుతోంది. కేట‌రింగ్‌కు ట్రాలీ స‌ర్వీస్‌, మ‌ర్యాద‌గా వ్య‌హ‌రించే స్టాఫ్‌, వినోదం వంటి అంశాల‌ను రాజ‌ధాన

|

అక్టోబ‌ర్‌లో విప‌రీతంగా ఉండే రైల్వే ప్ర‌యాణికులను ఆక‌ట్టుకునేందుకు రైల్వే శాఖ ఇప్ప‌టి నుంచి సిద్ద‌మ‌వుతోంది. కేట‌రింగ్‌కు ట్రాలీ స‌ర్వీస్‌, మ‌ర్యాద‌గా వ్య‌హ‌రించే స్టాఫ్‌, వినోదం వంటి అంశాల‌ను రాజ‌ధాని, శ‌తాబ్ది రైళ్ల‌లో ఉండేలా చూసుకుంటోంది. మొత్తం 30 రైళ్లు(15 రాజ‌ధాని, 15 శ‌తాబ్ది) వాడే ప్ర‌యాణికుల‌ను ఆక‌ట్టుకునేందుకు వీలుగా రూ.25 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు పెట్ట‌బోతున్నారు. రైల్వే శాఖ చేప‌డుతున్న 3 నెల‌ల కార్య‌క్ర‌మానికి ప్రాజెక్ట్ స్వ‌ర్ణ్ అని పేరుపెట్టారు. ఈ రైళ్ల‌లో ముఖ్యంగా క్యాట‌రింగ్‌, స‌మ‌య‌పాల‌న‌, టాయిలెట్ శుభ్ర‌త వంటి అంశాల‌పై అధికారుల‌కు ఎక్కువ‌గా ఫిర్యాదులు అందుతుండ‌టంతో దాన్ని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

 రైల్వే ప్రాజెక్టు స్వ‌ర్ణ‌

మొత్తం ప్రాజెక్టు స్వ‌ర్ణ్‌లో ఉన్న రైళ్ల‌లో ముంబ‌యి, హౌరా, ప‌ట్నా, రాంచి, భువ‌నేశ్వ‌ర్‌కు వెళ్లే రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌లు; హ‌రా-పూరి, న్యూఢిల్లీ-చంఢీఘ‌డ్‌, న్యూఢిల్లీ-కాన్పూర్‌, హ‌రా-రాంచి, ఆనంద్ విహార్‌-క‌త్గోడ‌మ్ మార్గాల్లో ఉండే శ‌తాబ్ది ట్రైన్లు ఉన్నాయి. ఇప్పుడు చేప‌ట్ట‌బోయే చ‌ర్య‌ల్లో స‌మ‌య‌పాల‌న‌ను నిర్వహించ‌డం, క్యాట‌రింగ్‌, కోచ్ శుభ్ర‌త వంటి అంశాల‌పై దృష్టి సారించ‌నున్న‌ట్లు ప్రాజెక్టుతో సంబంధం ఉన్న రైల్వే అధికారి వెల్ల‌డించారు.

Read more about: train indian railways
English summary

అక్టోబ‌ర్ డిమాండ్‌కు ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ద‌మ‌వుతున్న రైల్వే | Makeover exercise for Rajdhani and shatabdi trains

Trolley service for catering, polite uniformed staff and on-board entertainment are some of the changes slated to be introduced in Rajdhani and Shatabdi trains from October this year. Aiming at enhancing the experience of passengers travelling by these premier trains, the Indian Railways has undertaken a complete makeover exercise in 30 trains – 15 Rajdhani and 15 Shatabdi – at an estimated cost of Rs 25 crore.
Story first published: Tuesday, June 27, 2017, 10:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X