For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ-కామ‌ర్స్ కంపెనీల‌కు జీఎస్‌టీ అమ‌లులో స్వ‌ల్ప ఊర‌ట‌

ఒక ప‌క్క శుక్ర‌వారం అర్ధ‌రాత్రి నుంచి జీఎస్టీ అమ‌లు కానున్న నేప‌థ్యంలో ఆన్లైన్‌లో వ‌స్తువుల‌ను అమ్మే సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం తీపిక‌బురు అందించింది. దీంతో ఈ-కామర్స్‌ కంపెనీలకు జీఎస్‌టీ అమలు విషయంలో వెసలు

|

ఒక ప‌క్క శుక్ర‌వారం అర్ధ‌రాత్రి నుంచి జీఎస్టీ అమ‌లు కానున్న నేప‌థ్యంలో ఆన్లైన్‌లో వ‌స్తువుల‌ను అమ్మే సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం తీపిక‌బురు అందించింది. దీంతో ఈ-కామర్స్‌ కంపెనీలకు జీఎస్‌టీ అమలు విషయంలో వెసలుబాటు లభించింది.

 ఈ-కామ‌ర్స్ విష‌యంలో టీసీఎస్‌, టీడీఎస్ అమ‌లు వాయిదా

జీఎస్‌టీ కింద సరఫరాదార్లకు చెల్లింపులు చేసే విషయంలో 1 శాతం మూలం వద్ద పన్ను వసూలు(టీసీఎస్‌) చేయాల్సిన అవసరం లేదని ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌ప‌రిచింది. అదే విధంగా పరోక్ష పన్నుల కొత్త విధాన అమలుకు నాలుగు రోజుల సమయం మాత్ర‌మే ఉండటంతో టీడీఎస్‌(మూలం వద్ద పన్ను మినహాయింపు), టీసీఎస్‌ల నిబంధనల అమలును ప్ర‌స్తుతానికి వాయిదా వేసింది. కేంద్ర జీఎస్‌టీ(సీజీఎస్‌టీ) చట్టం కింద సంస్థలు పొందే వస్తువులు లేదా సేవలకు సరఫరాదార్లకు చెల్లించే మొత్తం రూ.2.5 లక్షలు అధిగమిస్తే 1 శాతం మేర టీసీఎస్‌ను వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి దీన్ని పక్కనపెట్టారు. పరిశ్రమ నుంచి వచ్చిన స్పందన ఆధారంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.20 లక్షల లోపు టర్నోవరు ఉన్న చిన్న వ్యాపారులు ఇ-కామర్స్‌ పోర్ట్‌ల్‌ ద్వారా వస్తువుల, సేవల విక్రయానికి జీఎస్‌టీ కింద నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. జీఎస్టీ వ‌స్తే వ్యాపారులు ఎవ‌రూ కూడా ప‌న్ను త‌ప్పించుకునే వీల్లేకుండా ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తోంది.

Read more about: gst ecommerce
English summary

ఈ-కామ‌ర్స్ కంపెనీల‌కు జీఎస్‌టీ అమ‌లులో స్వ‌ల్ప ఊర‌ట‌ | gst for ecommerce a sigh of relief regarding tax at source

The requirement of collecting up to 1% of tax from online shoppers by e-commerce companies and a 1% deduction of tax when central, state or local self-governments make payments to suppliers, specified in central and state GST laws, will be “brought into force from a date which will be communicated later”, said an official statement
Story first published: Tuesday, June 27, 2017, 15:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X