For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీ త‌ర్వాత వినోదం ఖ‌రీద‌వుతుందా? త‌గ్గుతుందా?

తెలంగాణ‌,ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగు సినిమాల‌కు వినోద ప‌న్ను 15% ఉండ‌గా, ప్ర‌స్తుతం జీఎస్టీ ద్వారా పెర‌గ‌నుంది. మొత్తంగా చూసుకుంటే దేశ‌వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో స‌గ‌టున వినోద ఖ‌ర్చు జీఎస్టీ త‌ర్వాత క

|

మ‌నిషి వినోదంపై జీఎస్టీ ఏ మేర‌కు ప్ర‌భావం చూప‌నుంది?

తెలంగాణ‌,ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగు సినిమాల‌కు వినోద ప‌న్ను 15% ఉండ‌గా, ప్ర‌స్తుతం జీఎస్టీ ద్వారా పెర‌గ‌నుంది. మొత్తంగా చూసుకుంటే దేశ‌వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో స‌గ‌టున వినోద ఖ‌ర్చు జీఎస్టీ త‌ర్వాత కాస్త పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దేనిపై ఏ విధ‌మైన ప్ర‌భావం ఉందో చూద్దాం.

 సినిమాలు

సినిమాలు

రూ. 100 లేదా అంత‌కంటే త‌క్కువ టిక్కెట్లు ఉన్న మూవీ టిక్కెట్ల‌పై జీస్టీని 18% అని నిర్ణ‌యించారు. రూ.100 కంటే ఎక్కువ ఉన్న దానిపై రేటు 28%గా ఉంటుంది. ప్ర‌స్తుతం ఉన్న వినోద ప‌న్ను స్థానంలో కేవ‌లం జీఎస్టీనే ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ మూవీ టిక్కెట్ల అంతిమ ధ‌ర‌లు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధించే వినోద ప‌న్నుపై ఆధార‌ప‌డి ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాలను ప‌రిశీలించినప్పుడు వినోద ప‌న్ను సున్నా శాతం నుంచి 110శాతం మ‌ధ్య ఉంది. జార్ఖండ్‌(110%), ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(60%) రాష్ట్రప్ర‌భుత్వాలు వినోద ప‌న్నును చాలా ఎక్కువ‌గా వ‌సూలు చేస్తున్నాయి. వారికి జీఎస్టీ ద్వారా విధించే 28% వ‌ల్ల ప్ర‌యోజ‌న‌మే. టిక్కెట్ ధ‌ర త‌గ్గుతుంది. అస్సాం, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్ ప్ర‌స్తుతం వినోద ప‌న్ను త‌క్కువ‌గా వ‌సూలు చేస్తున్న కార‌ణంగా ఈ రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్లు క‌చ్చితంగా పెరుగుతాయి. అయితే టిక్కెట్ ధ‌ర‌ల ఆధారంగా చూస్తే ఇప్పుడు ఉన్న పన్ను రేటు స‌గ‌టు 8-10% ఉండ‌గా అది 28% వ‌ర‌కూ వెళుతుంది కాబ‌ట్టి సినీ ప‌రిశ్ర‌మ‌కు జీఎస్టీ న‌ష్ట‌మే క‌లిగించ‌గ‌ల‌దు అని ఈవై ప్ర‌తినిధి ఉత్క‌ర్ష్ సంఘ్వీ విశ్లేషించారు.

 డీటీహెచ్‌, కేబుల్ సేవ‌లు

డీటీహెచ్‌, కేబుల్ సేవ‌లు

డీటీహెచ్‌(డైరెక్ట్ టు హోం), కేబుల్ సేవ‌లు కాస్త త‌గ్గేట‌ట్లే క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే కేబుల్ టీవీ, డీటీహెచ్ సేవ‌ల‌పై ప‌న్ను రేటును 18శాతంగా జీఎస్టీ మండ‌లి నిర్ణ‌యించింది. ఇదివ‌ర‌కూ ఈ సేవ‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధించే వినోద ప‌న్ను 10 నుంచి 30 శాతంతో పాటు 15% సేవా ప‌న్ను సైతం అమ‌ల‌వుతోంది.

 అమ్యూజ్‌మెంట్ పార్కులు

అమ్యూజ్‌మెంట్ పార్కులు

జీఎస్టీ ప‌న్ను అమ‌లు త‌ర్వాత అమ్యూజ్‌మెంట్ లేదా థీమ్ పార్కుల విష‌యంలో టిక్కెట్ల ధ‌ర‌లు పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. పార్కుల విష‌యంలో ప్ర‌భుత్వ వైఖ‌రి దారుణంగా ఉంది. ప్ర‌స్తుతం పార్కుల మీద సేవా ప‌న్ను 15% ఉండ‌గా జీఎస్టీ త‌ర్వాత ఈ ప‌న్ను 28 శాతానికి పెర‌గ‌నుంది.

 రెస్టారెంట్లు, ధాబాలు

రెస్టారెంట్లు, ధాబాలు

జులై 1 నుంచి ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో ఉండే రెస్టారెంట్ల విష‌యంలో వినియోగ‌దారు 18% ప‌న్ను క‌ట్టాల్సి ఉంటుంది. ఏసీ రెస్టారెంట్ల‌కు 18% ప‌న్ను కాగా, నాన్‌-ఏసీ రెస్టారెంట్ల విష‌యంలో ఇది 12%గా ఉంది. రూ. 50 లక్ష‌ల వ‌రకూ వార్షిక ట‌ర్నోవ‌ర్ ఉండే చిన్న హోట‌ళ్లు, రెస్టారెంట్లు, దాబాల విషయంలో 5% జీఎస్టీ ఉంటుంది. మొత్తం ప‌న్నుల ప‌రంగా ఈ ప‌రిశ్ర‌మ‌ను చూస్తే సేవా ప‌న్ను, వ్యాట్‌, స్వ‌చ్చ‌భార‌త్ సెస్సు, క్రిషి క‌ల్యాణ్ సెస్సు వంటివ‌న్నీ క‌లిపి 20% ప‌న్ను వ‌ర‌కూ ఉంది. కొత్త‌గా వ‌చ్చే జీఎస్టీ విషయంలో 18% ప‌న్ను ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే రెస్టారెంట్లు వ‌సూలు చేసే స‌ర్వీసు చార్జీలు దీనికి అద‌నంగా ఉంటాయి. స‌ర్వీసు చార్జీలు క‌చ్చితంగా చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్రం ఇదివ‌ర‌కే స్ప‌ష్టం చేసింది.

 క్రికెట్ అండ్ క‌న్స‌ర్ట్స్‌(క‌చేరీలు)

క్రికెట్ అండ్ క‌న్స‌ర్ట్స్‌(క‌చేరీలు)

ఐపీఎల్ లాంటి క్రీడా పోటీలు ప్ర‌స్తుతం 20% ప‌న్ను ప‌రిధిలో ఉండ‌గా జీఎస్టీ త‌ర్వాత 28శాతానికి పెర‌గ‌నుంది. అంటే ఐపీఎల్ టిక్కెట్ల రేట్లు క‌చ్చితంగా పెరుగుతాయి. స‌ర్క‌స్‌, థియేట‌ర్‌, భార‌తీయ శాస్త్రీయ నృత్య‌, జాన‌ప‌ద నృత్యాలు, నాట‌కాలు మొద‌లైన ఈవెంట్లు ఇప్పుడున్న దాని కంటే త‌క్కువ‌గా 18% ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తాయి.

English summary

జీఎస్టీ త‌ర్వాత వినోదం ఖ‌రీద‌వుతుందా? త‌గ్గుతుందా? | gst impact on movies and entertainment

Entertainment is a big part of every one's life. Most of us who work more than 10 hour in our jobs through the entire week want to go out, watch movies or visit some new places to relax on our holidays. In this article, we will discuss the impact of GST rates on the entertainment industry and whether or not it is becoming expensive under GST.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X