For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక‌ప్ప‌టి త‌మ సంస్థ‌ను మ‌ళ్లీ టాటా గ్రూప్ మ‌ళ్లీ స్వాధీనం చేసుకుంటుందా?

ఈ ఎయిర్ లైన్‌ సంస్థ‌ను 1931లో టాటా గ్రూప్ ప్రారంభించింది. మొద‌ట టాటా ఎయిర్‌లైన్ పేరుతో ప్రారంభ‌మైన ఈ సంస్థ ప్ర‌భుత్వ స్వాధీనంతో త‌ర్వాత ఎయిర్ ఇండియాగా మారిపోయింది. అయితే విమాన‌యానంపై టాటాల‌కు ఉన్న అ

|

ఒక‌ప్పుడు దేశీయ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించింది టాటా వారే. కాలం మారింది. ఆ ఎయిర్‌లైన్స్‌ను స్వాధీనం చేసుకుని ప్ర‌భుత్వం ఎయిర్ ఇండియా, ఇండియ‌న్ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించింది. 64 ఏళ్లు గ‌డిచిన త‌ర్వాత చ‌రిత్ర పున‌రావృతం అయ్యేలా క‌నిపిస్తోంది. మ‌ళ్లీ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ స్వాధీనం చేసుకుంటుంద‌నే వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. దాని గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు...

 టాటా గ్రూప్ చ‌ర్చ‌లు

టాటా గ్రూప్ చ‌ర్చ‌లు

టాటా గ్రూప్ ఛైర్మ‌న్ ఎన్ చంద్ర‌శేఖ‌రన్ ప్ర‌భుత్వ ఎయిర్‌లైన్‌లో వాటా కొనుగోలు చేసేందుకు ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బిజినెస్ చానల్‌లో వార్త‌లు వ‌చ్చాయి. ఒక‌వేళ ఎయిర్ ఇండియా ప్రైవేటు ప‌రం అయితే సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్ ద్వారా అందులో 49% వాటాను ద‌క్కించుకునేందుకు సైతం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

 ఎయిర్ ఇండియా అప్పులు

ఎయిర్ ఇండియా అప్పులు

2020-21 నాటి క‌ల్లా ఎయిర్ ఇండియా రూ.19 వేల కోట్ల మేర‌కు అప్పుల‌ను తీర్చాల్సి ఉంది. ఎయిర్ ఇండియాను ఏళ్ల త‌ర‌బ‌డి నిర్ల‌క్ష్యం చేసిన కార‌ణంగా పీక‌ల్లోతు అప్పులు అయ్యాయి. దాని గురించి టాటా చైర్మ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశార‌ని, అయితే దానికి సంబంధించి స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం చూసుకుంటుంద‌ని; ఎలాగైన ఒప్పందం కుద‌రాల్సిందేన‌న్న‌ట్లు రెండు వైపులా సిద్ద‌మ‌వుతున్న‌ట్లు నివేదిస్తున్నారు.

 నీతి ఆయోగ్ సైతం

నీతి ఆయోగ్ సైతం

డీఎన్ఏ మ‌నీ రిపోర్ట్ చేసిన దాని ప్ర‌కారం చంద్ర‌శేఖ‌ర‌న్ నేతృత్వంలోని టాటా గ్రూప్ స‌భ్యులు పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ కార్యాల‌యాన్ని సైతం సందర్శించారు. ఒక ప‌క్క ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మ‌కంగా ప్ర‌భుత్వ నిధుల ఉప‌సంహ‌ర‌ణ‌కు నీతి ఆయోగ్ సూచ‌న‌లు ఇస్తున్న క్ర‌మంలోనే ఇది జ‌రిగింది. దీని కార‌ణంగా ఇత‌ర సామాజిక రంగాల‌పై ఖ‌ర్చులు పెట్టేందుకు వీలు క‌లుగుతుంద‌నేది నీతి ఆయోగ్ ఆలోచ‌న‌గా ఉంది. అయితే విమాన‌యాన మంత్రిత్వ శాఖ‌, టాటా గ్రూప్ మ‌ధ్య ఏం చ‌ర్చ‌లు జ‌రిగాయ‌నే దానిపై స్ప‌ష్ట‌త లేదు.

 అంత‌ర్జాతీయ రూట్ల వ‌ర‌కేనా!

అంత‌ర్జాతీయ రూట్ల వ‌ర‌కేనా!

ఇది వ‌ర‌కే ఒక‌సారి ఎయిర్ ఇండియాకు సంబంధించి అంత‌ర్జాతీయ రూట్ల‌లో విమానాల నిర్వ‌హ‌ణ‌కు టాటా గ్రూప్ ఆస‌క్తి క‌న‌బ‌రిచింది. ఇది దేశీయ విమాన సంస్థ‌కు ఉన్న పైల‌ట్లు, ఇంజినీరింగ్ సిబ్బంది, బ్రాండ్ పేరును ప‌క్క‌న పెట్టి చేయాల‌న్న‌ది టాటా గ్రూప్ యోచ‌న‌గా ఉన్న‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. టాటా గ్రూప్‌కు ఇప్ప‌టికే విస్తారా, ఎయిర్ ఏసియా ఇండియాలో వాటాలు ఉన్న సంగ‌తి తెలిసిందే.

 ఎయిర్ ఇండియా న‌ష్టాల సంగ‌తేంటి?

ఎయిర్ ఇండియా న‌ష్టాల సంగ‌తేంటి?

కేంద్ర పౌర విమాన‌యాన శాఖా మంత్రి రాజ్య‌స‌భకు ఇచ్చిన లిఖిత పూర్వ‌క స‌మాధానం ఈ విధంగా ఉంది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎయిర్ ఇండియా రూ.300 కోట్ల నిర్వ‌హ‌ణ లాభాన్ని న‌మోదు చేయ‌గ‌ల‌దు. నిక‌ర న‌ష్టాల ప‌రంగా చూసినా త‌గ్గుతున్నాయి. నిర్వ‌హ‌ణ‌, ఆర్థిక సామ‌ర్థ్యం పెంచ‌డం వ‌ల్లే ఎయిర్ ఇండియా గాడిన ప‌డుతోంది. గ‌తేడాది ఎయిర్ ఇండియా రూ.105 కోట్ల నిర్వ‌హ‌ణ లాభాన్ని న‌మోదు చేసింది. ఎయిర్ ఇండియా మొత్తం అప్పుల సంఖ్య రూ.50 వేల కోట్ల పై మాటే. ఎయిర్ ఇండియాను తిరిగి ప్ర‌గ‌తి బాట ప‌ట్టించేందుకు రూ.30 వేల కోట్ల ఈక్విటీ నిధుల‌ను తీసుకురావ‌డం ద్వారా 2021 క‌ల్లా కొన్ని మైలు రాళ్ల‌ను చేరుకోవ‌చ్చు.

 ఎయిర్ లైన్ గురించి

ఎయిర్ లైన్ గురించి

ఈ ఎయిర్ లైన్‌ సంస్థ‌ను 1931లో టాటా గ్రూప్ ప్రారంభించింది. మొద‌ట టాటా ఎయిర్‌లైన్ పేరుతో ప్రారంభ‌మైన ఈ సంస్థ ప్ర‌భుత్వ స్వాధీనంతో త‌ర్వాత ఎయిర్ ఇండియాగా మారిపోయింది. అయితే విమాన‌యానంపై టాటాల‌కు ఉన్న అమిత‌మైన ప్రేమ ఎప్ప‌టికీ చావ‌లేదు. 1990ల్లో ఈ రంగంలో ప్రైవేటుకు తెర‌తీశారు. ర‌త‌న్ టాటా, సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్‌తో క‌లిసి దేశీయ విమాన‌యాన సంస్థ‌ను ప్రారంభించాల‌నుకున్నారు. అయితే అప్ప‌ట్లో ఉన్న నిబంధ‌న‌లు విదేశీ విమాన సంస్థ‌ల‌ను దేశీయ విమాన కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్ట‌కుండా నియంత్రించాయి.

Read more about: air india business tata
English summary

ఒక‌ప్ప‌టి త‌మ సంస్థ‌ను మ‌ళ్లీ టాటా గ్రూప్ మ‌ళ్లీ స్వాధీనం చేసుకుంటుందా? | Now Tatas want to pilot Air India after 64 yearss, group in talks with govt

Almost 64 years after Air India was taken over by the Central government from Tata Sons, and nationalised, the life may come full circle for the Mumbai-based conglomerate.The group's Chairman N Chandrasekaran is reported to be in talks with the Central government to buy controlling stakes in the airline,
Story first published: Thursday, June 22, 2017, 12:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X