For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారంపై జీఎస్టీ ప్ర‌భావం

ప్రపంచంలో ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేసే దేశాల్లో భారత్‌ ఒకటి. త్వరలో దేశవ్యాప్తంగా అమలుకానున్న వస్తు, సేవలపన్ను (జీఎస్‌టీ) ప్రభావం బంగారంపై సానుకూలంగా ఉంటుందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌(డబ్ల్యూజీస

|

ప్రపంచంలో ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేసే దేశాల్లో భారత్‌ ఒకటి. త్వరలో దేశవ్యాప్తంగా అమలుకానున్న వస్తు, సేవలపన్ను (జీఎస్‌టీ) ప్రభావం బంగారంపై సానుకూలంగా ఉంటుందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌(డబ్ల్యూజీసీ) పేర్కొంది. కేవలం బంగారంపైనే కాకుండా ఆభరణాల తయారీదారులు, అమ్మకందారులు, ఇతర వ్యాపారాలపై కూడా కొత్త పన్ను ప్రభావం ఉండ‌బోతోంద‌ని తెలిపింది. జులై 1వ తేదీ నుంచి జీఎస్‌టీని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్ర‌స్తుతం బంగారంపై 2% ప‌న్ను ఉండ‌గా జీఎస్‌టీ అమల్లోకి వస్తే అది 3శాతంగా ఉంటుంది.దీంతో స్వ‌ల్పంగా బంగారం ధ‌ర‌లు పెర‌గొచ్చ‌ని భావిస్తున్నారు.

 ప‌సిడి రేట్లు జీఎస్టీ వ‌ల్ల పెరుగుతాయా?

బంగారం, వెండిపై 3% ప‌న్ను
ఇదివ‌ర‌కే ఖ‌రీదైన లోహాలు(బంగారం, వెండి) వంటి వాటిపై ప‌న్ను రేటు చాలా త‌క్కువ‌గా ఉండ‌టంతో మొద‌ట బంగారంపై నిర్ణ‌యించిన రేట్ల‌పై బంగారు,ఆభ‌ర‌ణాల‌ వ్యాపారులు అభ్యంత‌రాలు తెలిపారు. దీంతో మొద‌ట ఊహించిన 5% ప‌న్ను రేటు నుంచి బంగారం,వెండిపై ప‌న్ను రేట్ల‌ను 3 శాతానికి త‌గ్గించారు. అయిన‌ప్ప‌టికీ వ్యాపారులు బంగారంపై విధించే ప‌న్నును 1 శాతం ఉంటే బాగుంటుంద‌ని కోరుతున్నారు.

 ప‌సిడి రేట్లు జీఎస్టీ వ‌ల్ల పెరుగుతాయా?

జులై 1 నుంచి అమ‌లు చేయ‌నున్న జీఎస్టీ విష‌యంలో ప్ర‌భుత్వం కొన్ని వ‌స్తువుల‌ను జీఎస్టీ ప‌రిధి నుంచి బ‌య‌ట ఉంచింది. కొన్ని వ‌స్తువుల‌పై జీఎస్టీని సున్నా శాతంగా నిర్ణ‌యించింది. జీఎస్టీ ప‌న్ను అమ‌లు త‌ర్వాత ఏ వస్తువుపై ఎంత ప‌న్ను ఉండాల‌నే దాని గురించి జీఎస్టీ మండ‌లి ఇప్ప‌టికే తుది నిర్ణ‌యం తీసుకుంది. దాదాపు 1200 వ‌స్తువుల‌పై 4 ర‌కాల ప‌న్ను రేట్ల‌ను నిర్ణ‌యించారు.

Read more about: gst gold taxes
English summary

బంగారంపై జీఎస్టీ ప్ర‌భావం | GST rate on gold to be hiked

Earlier this month, the GST Council fixed the rate of tax on gold at 3%, keeping it close to the current tax incidence of about 2% on the precious metals across most states in the country and bringing cheer to the industry wary of a rise in tax outgo. The rate of tax imposed on gold under GST is lower than the lowest slab of 5% under the new regime to be implemented from July 1. Notably, the traders’ lobby had been demanding to keep the levy on the precious metal at close to a concessional rate of 1%
Story first published: Thursday, June 22, 2017, 15:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X