For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2017లో 5 ఉత్త‌మ ఎల్ఐసీ పాల‌సీలు

జీవిత బీమా పాల‌సీ ఉంటే మీకు, మీ కుటుంబానికి లేదా మీ పై ఆధార‌ప‌డిన వారికి ఒక ఆర్థిక భ‌రోసా ఉంటుంది. మ‌న దేశంలో బీమా పాల‌సీ తీసుకోవాలంటే మొద‌ట గుర్తొచ్చేది జీవిత బీమా సంస్థ‌(ఎల్ఐసీ). 2017లో మీరు బీమా ప

|

మీరు కుటుంబ పెద్ద అయి మీ పైన ఆధార‌ప‌డే వారుంటే క‌చ్చితంగా పాల‌సీ ఉండాల‌ని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే ఈ ఉరుకుల ప‌రుగుల జీవితంలో అనుకోకుండా ఏదైనా జ‌రిగినా, అనారోగ్యం వ‌చ్చి సంపాద‌న ఆగిపోయినా కుటుంబ స‌భ్యులు ఆర్థికంగా ఇబ్బందిప‌డ‌కూడ‌దు. అదే ఒక‌ జీవిత బీమా పాల‌సీ ఉంటే మీకు, మీ కుటుంబానికి లేదా మీపై ఆధార‌ప‌డిన వారికి ఒక ఆర్థిక భ‌రోసా ఉంటుంది. మ‌న దేశంలో బీమా పాల‌సీ తీసుకోవాలంటే మొద‌ట గుర్తొచ్చేది ఎల్ఐసీయే. 2017లో మీరు బీమా పాల‌సీ తీసుకోవాల‌నుకుంటే ఉప‌యోగ‌ప‌డే 5 ఉత్త‌మ పాల‌సీల‌ను గురించి తెలుసుకోండి

 ఎల్ఐసీ జీవ‌న్ అక్ష‌య్ VI

ఎల్ఐసీ జీవ‌న్ అక్ష‌య్ VI

సింగిల్ ప్రీమియం యాన్యుటీలా ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప్లాన్‌లో 7 ర‌కాల యాన్యుటీ ఆప్ష‌న్లు ఉంటాయి. ఒక్క‌సారి పెద్ద మొత్తంలో చెల్లించిన త‌ర్వాత పాల‌సీని కొనుగోలు చేస్తే త‌ర్వాతి నెల నుంచే పాల‌సీ వ‌ర్తింపు ప్రారంభ‌మ‌వుతుంది. యాన్యుటీ కొనుగోలు చేసిన వారికి జీవితాంతం యాన్యుటీలు చెల్లించేలా ఉన్న ఈ పాల‌సీ ఒక యూనిట్ లింక్‌డ్ పెన్ష‌న్ ప్లాన్‌. యాన్యుటీ ర‌కం, చెల్లింపుల‌కు సంబంధించి వివిధ ర‌కాల ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి.

ఎల్ఐసీ జీవ‌న్ అక్ష‌య్ VI పాల‌సీ ల‌క్ష‌ణాలు

  1. యాన్యుటీ చెల్లింపు నెల‌వారీ, త్రైమాసికానికి ఒక‌సారి, ఆరు నెల‌ల‌కు ఒక‌సారి, సంవ‌త్స‌రానికి ఒక‌సారి చెల్లించే ఏర్పాట్లు ఉన్నాయి. దీన్ని పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలోనే పాల‌సీదారు ఎంచుకోవాల్సి ఉంటుంది.
  2. యాన్యుటీ పేమెంట్ల‌ను సైతం పాల‌సీదారు ఒక‌రికే లేదా జీవిత భాగ‌స్వామితో క‌లిసి ఉండేలా సైతం తీసుకోవ‌చ్చు.
  3. మీరు ఎంచుకున్న ప్లాన్‌ను బ‌ట్టి యాన్యుటీ చెల్లింపులు చేస్తారు.
  4. ఈ పాల‌సీకి ఎటువంటి వైద్య ప‌రీక్ష‌లు అవ‌స‌రం లేదు.
  5. యాన్యుటీ కొనుగోలు విష‌యంలో గ‌రిష్ట ప‌రిమితి లేదు.
  6. ఎంత వెచ్చించి పాల‌సీని కొనుగోలు చేస్తారో, పాల‌సీదారు మ‌ర‌ణ స‌మ‌యంలో ఆ మేర‌కు చెల్లింపులు చేస్తారు.
  7. యాన్యుటీ పాల‌సీలకు సంబంధించి క‌నిష్ట‌, గ‌రిష్ట అర్హ‌తా వ‌య‌సులు 30,85 ఏళ్లుగా ఉన్నాయి.
  8. ఈ పాల‌సీ కోసం చెల్లించే ప్రీమియంల‌కు ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ, తీసుకునే పింఛ‌ను(యాన్యుటీ) సొమ్ముకు పన్ను ప‌డుతుంది.
  9. పాల‌సీ హామీగా రుణాన్ని పొందే వీల్లేదు.

ఎల్ఐసీ ఈ-ట‌ర్మ్ ప్లాన్‌

ఎల్ఐసీ ఈ-ట‌ర్మ్ ప్లాన్‌

బీమా తీసుకున్న వారికి ఏదైనా జ‌రిగితే వారి కుటుంబానికి సంపూర్ణ ఆర్థిక ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ఉద్దేశించిన పాల‌సీయే ఎల్ఐసీ ఈ-ట‌ర్మ్ ప్లాన్. ఇది ఒక ఆన్‌లైన్ ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీ. ఇది కేవ‌లం ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు తీసుకునేందుకు మాత్ర‌మే వీలుంది. పాల‌సీ కాల‌ప‌రిమితి క‌నీసం 10 ఏళ్లు ఉండాలి.

ఈ ఈ-ట‌ర్మ్ పాల‌సీ కొనుగోలు చేసేందుకు క‌నీస వ‌య‌సు 18 ఏళ్లు ఉండాలి. 60 ఏళ్ల వ‌ర‌కూ ఈ పాల‌సీని కొనుక్కోవ‌చ్చు. అయితే పాల‌సీ క‌నీస కాల‌ప‌రిమితి 10 ఏళ్లు ఉండాల‌ని గుర్తుంచుకోండి. దీనికి ప్రీమియంల‌ను ఏటా ఒక‌సారి చెల్లించాలి.

ఎల్ఐసీ ఈ-ట‌ర్మ్ ప్లాన్ ఫీచ‌ర్లు

  1. పాల‌సీ క‌వ‌రేజీ గ‌రిష్టంగా 75 ఏళ్ల వ‌ర‌కూ ఉంటుంది.
  2. ఈ పాల‌సీ క‌వరేజీ ఆయా వ్య‌క్తుల‌కు ల‌భిస్తుంది.
  3. పాల‌సీ మ‌ధ్య‌లో కొన‌సాగించ‌క ర‌ద్ద‌యిన సంద‌ర్భంలో, రెండేళ్లకు లోపు దీన్ని రెన్యువ‌ల్ చేసుకోవ‌చ్చు.
  4. పాల‌సీ వైద్య ప‌రీక్ష‌ల‌కు అయ్యే ఖర్చును పాల‌సీదారు మాత్ర‌మే భ‌రించాల్సి ఉంటుంది.
  5. కూలింగ్(ఫ్రీలుక్‌) పీరియ‌డ్ లోపు పాల‌సీని వెన‌క్కు ఇచ్చేస్తే స్టాంప్ డ్యూటీ, కొన్ని చార్జీల‌ను మిన‌హాయించి మిగిలిన ప్రీమియంల‌ను వెన‌క్కు ఇస్తారు.
  6. క‌నీస బీమా హామీ మొత్తం పొగ‌తాగ‌ని వారికి రూ.50 ల‌క్ష‌లు కాగా, పొగ తాగే వారికి రూ.25 ల‌క్ష‌లుగా ఉంది.
  7. పాల‌సీ హామీగా రుణాన్ని పొందే వీల్లేదు.
  8. పాల‌సీ క‌నీస క‌వ‌రేజీ 10 ఏళ్లు, గ‌రిష్ట క‌వ‌రేజీ 35 ఏళ్లుగా ఉంది.
  9. పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో ఏదైనా అనుకోని సంఘ‌ట‌న జ‌రిగితే బీమా హామీ మొత్తాన్ని చెల్లిస్తారు.
  10. పాల‌సీ ట‌ర్మ్ మొత్తం బీమాదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్స్ కింద ఏదీ చెల్లించ‌రు.

 ఎల్ఐసీ న్యూ చిల్డ్ర‌న్స్ మ‌నీ బ్యాక్ ప్లాన్‌

ఎల్ఐసీ న్యూ చిల్డ్ర‌న్స్ మ‌నీ బ్యాక్ ప్లాన్‌

త‌ల్లిదండ్రుల‌కు ఏమైనా అయితే పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ఉద్దేశించిన పాల‌సీ ఎల్ఐసీ న్యూ చిల్డ్ర‌న్స్ మ‌నీ బ్యాక్ పాల‌సీ. పిల్ల‌ల భ‌విష్య‌త్తును బీమా క‌వ‌రేజీ ద్వారా సురక్షితంగా ఉంచేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ప‌రిమిత ప్రీమియం చెల్లింపు ఆప్ష‌న్ ఉంటుంది. క‌నీస బీమా హామీ మొత్తం రూ.1 ల‌క్ష నుంచి మొద‌ల‌వుతుంది. పుట్టిన పిల్ల‌ల నుంచి 12 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌ల వ‌ర‌కూ ఎవ‌రికైనా ఈ పాల‌సీ తీసుకునేందుకు త‌ల్లిదండ్రుల‌కు వీలుంటుంది. పాల‌సీ మొద‌లైన మూడేళ్ల కాలం నుంచి స్వాధీనానికి వీలుంటుంది.

నెల‌వారీ ప్రీమియం చెల్లించేట‌ప్పుడు ఆల‌స్య‌మైతే 15 రోజుల గ్రేస్ పీరియ‌డ్ ఉంటుంది.

గ్రేస్ పీరియ‌డ్ లోపు ప్రీమియం చెల్లించ‌డంలో విఫ‌ల‌మైతే పాల‌సీ ర‌ద్ద‌వుతుంది.

పాల‌సీ తీసుకున్న త‌ర్వాత వెన‌క్కు ఇచ్చేందుకు 15 రోజుల ఫ్రీ లుక్ పీరియ‌డ్ ఉంటుంది.

 ఎల్ఐసీ జీవ‌న్ సంగ‌మ్‌

ఎల్ఐసీ జీవ‌న్ సంగ‌మ్‌

ఏక మొత్తంలో ప్రీమియం చెల్లించే నాన్‌-లింక్‌డ్, క‌చ్చిత‌మైన రాబ‌డుల‌కు హామీ ఇచ్చేలా రూపొందించిన ప్లాన్ ఎల్ఐసీ జీవ‌న్ సంగ‌మ్‌. ఈ ప్లాన్‌కు చెల్లించే ప్రీమియం బీమాదారు వ‌య‌సు, మెచ్యూరిటీ సొమ్ము వంటి అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. పాల‌సీ చేయించుకున్న వారు దాన్ని స్వాధీన ప‌రిచినా లేక అనుకోని ప‌రిస్థితుల్లో మ‌ర‌ణించినా, బీమా హామీ మొత్తంలో కొంత శాతాన్ని(లాయ‌ల్టీ అడిష‌న్‌) అద‌నంగా చెల్లిస్తారు.

జీవ‌న్ సంగ‌మ్‌లో ముఖ్యాంశాలు

  1. క‌నీస బీమా హామీ మొత్తం రూ.75 వేలుగా ఉండ‌గా, ఎటువంటి గ‌రిష్ట ప‌రిమితి లేదు
  2. పాల‌సీ లేదా ప‌థ‌కం కాల వ్య‌వ‌ధి 12 సంవత్స‌రాలు ఉంటుంది.
  3. పాల‌సీ మొద‌లై మూడు సంవత్స‌రాలు పూర్త‌యిన‌ప్ప‌టి నుంచి, రుణ స‌దుపాయం ఉంది.
  4. పాల‌సీ కాల‌ప‌రిమితి మొత్తం పూర్త‌యితే , మెచ్యూరిటీ సొమ్ముతో పాటు అద‌న‌పు ప్ర‌యోజ‌నాల‌ను పాల‌సీ దారుకు అంద‌జేస్తారు.
  5. పాల‌సీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా మ‌ర‌ణ ప్ర‌యోజ‌నాన్ని అందిస్తారు.
 ఎల్ఐసీ జీవ‌న్ స‌ర‌ళ్‌

ఎల్ఐసీ జీవ‌న్ స‌ర‌ళ్‌

జీవ‌న్ స‌ర‌ళ్ ఫీచ‌ర్లు

  1. నెల‌వారీ ప్రీమియంల‌ను చెల్లించే స‌దుపాయం ఉంది.
  2. బీమా హామీ మొత్తం ప్రీమియంల‌కు 250 రెట్లుగా ఉంటుంది.
  3. పాల‌సీ క‌నీస‌, గ‌రిష్ట కాల‌ప‌రిమితులు 10, 35 సంవ‌త్స‌రాలుగా ఉంటాయి.
  4. పాల‌సీ కొనుగోలు చేసేందుకు క‌నీస‌, గ‌రిష్ట వ‌యోప‌రిమితులు 12 నుంచి 60 ఏళ్లు.
  5. ప్రీమియంను చెల్లించేందుకు నెల‌వారీ, త్రైమాసిక‌, అరు నెల‌ల‌కు, సంవ‌త్స‌రానికి ఒక‌సారి చేసేలా ఏర్పాటు ఉంది.
  6. పాల‌సీ మొద‌లై 10 ఏళ్లు పూర్త‌యితేనే బోన‌స్ లాంటివి వ‌స్తాయి.
  7. పాల‌సీ మొద‌లైన త‌ర్వాత 3వ సంవ‌త్స‌రం త‌ర్వాత‌నే పాక్షిక స్వాధీనానికి వీలు క‌ల్పిస్తారు.
  8. పాల‌సీ హామీగా రుణం పొందేందుకు వీలుంది.
  9. సెక్ష‌న్ 10(10డీ) కింద చెల్లించిన ప్రీమియంకు ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు, మెచ్య‌రిటీ సొమ్ముకు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.
  10. పాల‌సీదారు చ‌నిపోతే, నామినీకి మ‌ర‌ణ ప్ర‌యోజ‌నాల‌ను చెల్లిస్తారు.

Read more about: lic insurance
English summary

2017లో 5 ఉత్త‌మ ఎల్ఐసీ పాల‌సీలు | best lic policies for 2017 in India

These5 plans largely cover all types of life insurance policies one can opt for in order to secure their tomorrow. However, one should always choose the one that fits the bill. LIC being the largest insurance offering company in the country,one shouldn't worry about the security and guarantee of your returns.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X