For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.2500 నుంచి రూ.7500 హోట‌ల్ బిల్లుల‌పై 18% జీఎస్టీ

చిన్న చిన్న అవాంత‌రాలు ఉంటాయ‌ని తెలిసిన‌ప్ప‌టికీ వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)ను జులై 1 నుంచి అమ‌లు చేయాల‌ని కేంద్రం కృత నిశ్చ‌యంతో ఉంది. ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందని కేంద్ర

|

చిన్న చిన్న అవాంత‌రాలు ఉంటాయ‌ని తెలిసిన‌ప్ప‌టికీ వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)ను జులై 1 నుంచి అమ‌లు చేయాల‌ని కేంద్రం కృత నిశ్చ‌యంతో ఉంది. ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆదివారం సాయంత్రం ప్రకటించారు. దీని అమలును ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. జూన్ 30వ తేదీ (శుక్రవారం) అర్ధరాత్రి న్యూ ఢిల్లీలో కొత్త ప‌రోక్ష ప‌న్ను విధాన నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తారు. పార్లమెంట్ సెంట్రల్ భవనంలో మోదీ నేతృత్వంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ మండ‌లితో స‌మావేశ‌మైన జైట్లీ కొన్ని నిర్ణ‌యాల‌ను ప్ర‌క‌టించారు. ఏసీ హోట‌ళ్ల విష‌యంలో కాస్త క‌రుణ చూపారు. ఇంత‌కుముందు రూ.5000 పైన 28% గా ఉన్న ప‌న్నును ప్ర‌స్తుతం రూ.7500కు పెంచారు. అంటే రూ.7500 పైబ‌డి ఉన్న బిల్లుల విష‌యంలో 28% ప‌న్ను, రూ.2500 నుంచి రూ.7500 మ‌ధ్య ఉన్న బిల్లుల‌కు సంబంధించి 18% ప‌న్ను ఉంటుంది.

 జులై 1 నుంచే జీఎస్టీ ఉంటుంద‌న్న జైట్లీ

న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన 17వ జీఎస్టీ మండ‌లి సమావేశం ముగిసిన అనంతరం అరుణ్ జైట్లీ విలేకర్లతో మాట్లాడారు. వ్యాపారుల నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో తొలి రెండు నెలలపాటు ప‌న్ను రిటర్నులు దాఖలు విషయంలో వ్యాపారులకు కొంతమేర వెసులుబాటు ఇస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఆగస్టు వరకు ఈ వెసులుబాట్లు అమ‌ల్లో ఉంటాయని, సెప్టెంబర్ నెల‌ నుంచి కొత్త నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. అన్ని వస్తువులు, సేవలపై పన్నులు ఖరారు చేశామని, నియమ నిబంధనలపై తుది నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. జూన్ 30న జీఎస్టీ మండ‌లి మరోసారి సమావేశమవుతందని, చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ రోజు తొలగిపోతాయని చెప్పారు.

Read more about: gst taxes
English summary

రూ.2500 నుంచి రూ.7500 హోట‌ల్ బిల్లుల‌పై 18% జీఎస్టీ | GST Set To Rollout From July 1

The Goods and Services Tax (GST) would rollout from July 1, 2017, paving the way for this landmark legislation to finally come into force. The launch of the GST will be on the midnight of June 30, 2017 at a function that is likely to see Prime Minister Narendra Modi attend.
Story first published: Monday, June 19, 2017, 11:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X