English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

జీఎస్టీలో ఏ వ‌ర్గం వారు ఏ ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తారు?

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

* జీఎస్టీ ప్రాథ‌మిక సందేహాలు-వివ‌ర‌ణ‌లు

జీఎస్టీ చ‌ట్టాన్ని పార్ల‌మెంట్ ఆమోదించ‌డం ద్వారా దేశంలోని ప‌రోక్ష ప‌న్నుల స్థానంలో జీఎస్టీని అమ‌లుప‌రిచేందుకు కేంద్రానికి అధికారం ల‌భించింది. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల శాస‌న‌స‌భ‌లు జీఎస్టీ చ‌ట్టానికి ఆమోదం తెలిపాయి. జీఎస్టీపై ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అభ్యంత‌రాలున్నా జీఎస్టీని జులై 1 నుంచి అమ‌లు ప‌రిచేందుకు దాదాపు చాలా రాష్ట్రాలు సిద్ద‌మ‌వుతున్నాయి. దేశంలో స్వాతంత్ర్యం త‌ర్వాత ప‌రోక్ష ప‌న్నుల విష‌యంలో వ‌స్తున్న అతిపెద్ద సంస్క‌ర‌ణ ఇది. ఈ విష‌యంలో చిన్న చిన్న అనుమానాలు ఉండ‌టం స‌హ‌జం. వ్యాపారుల ప‌రంగా చూస్తే మొద‌టిసారి జీఎస్టీ న‌మోదు త‌ర్వాత తిక‌మ‌క ఉంటుంది.దానికి సంబంధించిన కొన్ని అనుమానాల‌ను ఇక్క‌డ నివృత్తి చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాం.

జీఎస్టీ కింద పన్ను పరిధిలోకి వచ్చే అంశాలేమిటి?

దేశంలో క్ర‌య‌విక్ర‌యాలు జ‌రిగే వస్తువులు, సేవలు లేదా రెండింటి సరఫరాలు జీఎస్టీ కింద పన్ను విధింపు పరిధిలోకి వస్తాయి. రాష్ట్రాల పరిధిలో సరఫరాలపై సీజీఎస్టీ, ఎస్టీఎస్టీ/యూటీజీఎస్టీలను విధిస్తారు. అంతర్రాష్ట్ర సరఫరాలపై ఐజీఎస్టీ విధిస్తారు. జీఎస్టీ చ‌ట్టం ప్ర‌కారం వ‌స్తువు,సేవ‌ అంతిమ వినియోగం ఆధారంగా ప‌న్ను అమ‌ల‌వుతుంది.

2. జీఎస్టీ కింద అన్నిరకాల వస్తువులు, సేవలు పన్ను విధించదగినవేనా?

మానవ వినియోగానికి ఉద్దేశించిన ఆల్కహాల్ కలిసిన మద్యం మినహా అన్ని వస్తువులు, సేవల సరఫరాలు జీఎస్టీకింద పన్ను విధించదగినవే. అయితే, పెట్రోలియం ఉత్పత్తులైన.. ముడి చమురు, హైస్పీడ్ డీజిల్, మోటారు ఇంధనం (పెట్రోలు), సహజవాయువు, విమాన ఇంధనం (ATF)లపై పన్ను అమలు తేదీని ఇంకా నిర్ణయించలేదు. వీటిని ఏ తేదీనుంచి జీఎస్టీ పరిధిలో చేర్చేదీ జీఎస్టీ మండలి సిఫారసు మేరకు ప్రభుత్వం ప్రకటిస్తుంది.

3. ప్రతిఫలం లేని సరఫరాలు కూడా జీఎస్టీ కింద సరఫరాలుగా పరిగణనలోకి వస్తాయా?

అవును. అయితే, సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని పెడ్యూలు I నిర్దేశిస్తున్న కార్యకలాపాలు మాత్రమే పరిగణనలోకి వస్తాయి. ఇదే నిబంధనను ఐజీఎస్టీ, కేంద్ర పాలిత ప్రాంత జీఎస్టీలలోనూ అనువర్తింపజేశారు.

4. దాతృత్వ సంస్థ నిత్యావసర వస్తువులు ఇవ్వడమూ పన్ను విధించదగిన కార్యకలాపాల పరిధిలోకి వస్తుందా?

జీఎస్టీ కింద పన్ను విధించదగిన సరఫరాగా పరిగణించబడాలంటే అది వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే లావాదేవీ అయి ఉండాలి. దాతృత్వ కార్యకలాపాల్లో పరస్పర ప్రయోజనం ప్రసక్తి లేదు గనుక అది జీఎస్టీ కింద సరఫరాగా పరిగణనలోకి రాదు.

5. ఏదైనా లావాదేవీని వస్తు సేవల సరఫరాగా ప్రకటించే అధికారం ఎవరికుంటుంది?

జీఎస్టీ మండలి సిఫారసు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధికారం ఉంటుంది. ఆ మేరకు ఏదైనా లావాదేవీని సేవా ప్రదానం కిందకురాని వస్తు సరఫరాగానో లేక వస్తు సరఫరా కిందకు రాని సేవా ప్రదానంగానో లేక అటు వస్తు సరఫరా, ఇటు సేవా ప్రదానం రెండింటి కిందకూ రానిదిగానే కేంద్ర, రాష్ట్రాలు ప్రకటించవచ్చు.

6.సంయుక్త స‌ర‌ఫ‌రా, మిశ్ర‌మ‌ వస్తు సరఫరాలంటే ఏమిటి? ఇవి ఒకదానికొకటి భిన్నమని ఎలా చెప్పగలం?

సాధారణ వ్యాపార‌ నిర్వహణ క్రమంలో భాగంగా పన్ను విధించదగిన రెండు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులు/సేవలు లేదా రెండూ కలిపి లేదా ఒకదానితో మరొకటి జతగా చేసే సరఫరాలను ‘సంయుక్తసరఫరా'లుగా పరిగణిస్తారు. ఉదాహరణకు..... ఒక వినియోగదారు టెలివిజన్ కొంటే దానితోపాటు పూచీ పత్రం (వారంటీ), నిర్వహణ కాంట్రాక్టు కలిసి ఉన్నపుడు దాన్ని సంయుక్త సరఫరాగా పరిగణించాలి. ఇక్కడ టీవీ ప్రధాన సరఫరా కాగా, వారంటీతోపాటు నిర్వహణ సేవ అనుబంధంగా ఉంటాయి.
ఇక మిశ్రమ సరఫరా విషయానికొస్తే.. సాధారణంగా విడివిడిగా సరఫరా చేయదగిన ఒకటికన్నా ఎక్కువ సమ్మేళనంతో కూడిన వస్తువులు/సేవలను లేదా రెండింటి మిశ్రమాన్ని లేదా ఒకదానికొకటి జతగా చేసేవాటిని మిశ్రమ సరఫరాలుగా పరిగణించవచ్చు. ఉదాహరణకు.. ఓ దుకాణదారు రిఫ్రిజిరేటర్‌తోపాటు పానీయాలు నిల్వచేసే సీసాలు విక్రయించడం. ఈ రెండింటినీ వాటి ధరల ప్రకారం వేర్వేరుగా కూడా సులభంగానే అమ్మవచ్చు. మిశ్ర‌మ స‌ర‌ఫరాలో వ‌స్తువుల‌ను వేరు చేసి విక్ర‌యించే సౌల‌భ్యం ఉంటుంది.

సంయుక్త వస్తు స‌ర‌ఫ‌రా= composite supply,

మిశ్ర‌మ‌ వస్తు సరఫరా=mixed supply

7. జీఎస్టీ కింద సంయుక్త సరఫరా, మిశ్రమ సరఫరాలను ఎలా పరిగణలోకి తీసుకుంటారు?

సంయుక్త సరఫరాను ప్రధాన సరఫరాగా పరిగణిస్తారు. మిశ్రమ సరఫరాను అధికశాతం పన్ను విధించదగిన నిర్దిష్ట వస్తువులు లేదా సేవలుగా పరిగణిస్తారు.

8. ఎదురు చెల్లింపు (రివర్స్ చార్జ్) అంటే ఏమిటి?ఎదురు చెల్లింపు పద్ధతి కేవలం సేవలకే పరిమితమా?

కొన్ని ప్రత్యేకించిన వర్గంలోని వస్తువులు, సేవలను సరఫరా చేసేవారు కాకుండా వాటిని స్వీకరించేవారిపై పన్ను చెల్లింపు బాధ్యత ఉండటాన్నే ఎదురు చెల్లింపుగా పేర్కొంటారు.
ఎదురు చెల్లింపు కేవ‌లం సేవ‌ల‌కే ప‌రిమిత‌మా అంటే లేదనే చెప్పాలి. జీఎస్టీ మండలి సిఫారసు ప్రకారం ప్రభుత్వ ప్రకటనకు అనుగుణంగా వస్తువులు, సేవలు రెండింటికీ ఎదురు చెల్లింపు పద్ధతి వర్తిస్తుంది.

9. నమోదుకాని వ్యక్తుల నుంచి సరఫరాల స్వీకరణవల్ల తలెత్తే సమస్యలేమిటి?

నమోదుకాని వ్యక్తి నుంచి వస్తువులు, సేవలు పొందే స్వీకర్తపైనే ఎదురు చెల్లింపు విధానం ప్రకారం పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది.

 

10. సరఫరాదారు లేదా స్వీకర్త కాకుండా మరే ఇతర వ్యక్తిమీదనైనా జీఎస్టీ కింద పన్ను చెల్లింపు బాధ్యత ఉంటుందా?

ఉంటుంది. ఎలక్ట్రానిక్ వాణిజ్య కార్యకలాపాల నిర్వాహకులద్వారా పొందే వస్తుసేవల వర్గాలను కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తాయి. తదనుగుణంగా వాటిని అందజేసే ఆయా వాణిజ్య కార్యకలాపాల నిర్వాహకులపైనే పన్ను చెల్లింపు బాధ్యత ఉంటుంది. చట్టంలోని అన్ని నిబంధనలూ అటువంటి వారికి వర్తిస్తాయిగనుక ఆయా కేటగిరీల వస్తు సరఫరాలపై వారే చెల్లించాల్సి ఉంటుంది.

11. మిశ్రమ పథకం కింద ఎంచుకోగల పన్ను చెల్లింపు పరిమితి ఏమిటి?

మిశ్రమ పథకం కింద పన్ను చెల్లింపు పరిమితి మునుపటి ఆర్థిక సంవత్సరపు మొత్తం వార్షిక వ్యాపార పరిమాణంలో 50 లక్షల రూపాయలుగా ఉంటుంది. ఆ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల రూపాయలదాకా వార్షిక వ్యాపార పరిమాణంపై లబ్ది పొందవచ్చు.

12. మిశ్రమ పథకం కింద పన్నుల శాతం ఎలా ఉంటుంది?

భిన్న రంగాలకు భిన్నమైన పన్నుశాతాలున్నాయి. సాధారణ వస్తు సరఫరా వ్యాపారుల విషయంలో. వార్షిక వ్యాపార పరిమాణంపై 0.5 శాతంగా ఉంటుంది. ఒకవేళ తయారీదారు ఈ పథకాన్ని ఎంచుకున్నట్లయితే ఇది 1 శాతంగా ఉంటుంది. రెస్టారెంటు వ్యాపారంలో ఉండేవారు ఈ పథకాన్ని ఎంచుకుంటే పన్ను 2.5 శాతంగా ఉంటుంది. ఇది ఒక చట్టం కింద మాత్రమేకాగా, మరో చట్టం కింద కూడా అదే పన్ను శాతం వర్తించవచ్చు. మొత్తంమీద చూస్తే సాధారణ సరఫరాదారు, తయారీదారు, రెస్టారెంట్ సేవప్రదాతల విషయంలో మిశ్రమ పన్ను (సీజీఎస్టీ, ఎస్టీఎస్టీ, యూటీజీఎస్టీలలో సంయుక్తంగా) వరుసగా 1 శాతం, 2 శాతం, 5శాతంగా ఉంటుంది.

13. జీఎస్టీలో వ్యాపార ప‌రిమాణం-ప‌న్ను విధింపు

మిశ్రమ పథకం వినియోగించుకున్న వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో. ఉదాహరణకు డిసెంబరులోనే రూ.50 లక్షల వార్షిక వ్యాపార పరిమాణాన్ని దాటితే తదుపరి ఏడాది మార్చి 31తో ముగిసే సదరు ఆర్థిక సంవత్సరంలో ఆ పథకం కిందనే పన్ను చెల్లించే అనుమతి లభిస్తుందా?
లభించదు... మొత్తం వార్షిక వ్యాపార పరిమాణం సదరు ఆర్థిక సంవత్సరంలో ఏ రోజున రూ.50 లక్షల పరిమితి దాటుతుంది అదే రోజున ఈ పధకం వెసులుబాటు ముగిసిపోతుంది.

14. పలు సంస్థలు నమోదు చేసుకున్న పన్నువిధించదగిన వ్యక్తి వాటిలో కొన్నిటికి మాత్రమే మిశ్రమ పథకాన్ని ఎంచుకునే వీలుందా?

ఒకే శాశ్వత ఖాతా సంఖ్య (PAN)గల నమోదిత వ్యక్తులు ఎందరున్నా మిశ్రమ పథకాన్ని ఎంచుకోవలసిందే. వారిలో ఒకరు సాధారణ పథకాన్ని ఎంచుకున్నా ఇతరులు కూడా మిశ్రమ పధకానికి అనర్హులవుతారు.

15. ఒక తయారీదారు, ఒక సేవను అందించే వ్య‌క్తి మిశ్రమ పథకాన్ని వినియోగించుకునే వీలుందా?

ఉంది. సాధారణంగా ఒక తయారీదారు మిశ్రమ పథకాన్ని ఎంచుకోవచ్చు. అయితే, జీఎస్టీ మండలి సిఫారసుల మేరకు ప్రకటించే జాబితాలోని వస్తువుల తయారీదారుకు ఈ అవకాశం ఉండదు. ఇక రెస్టారెంట్లు మినహా మరే ఇతర సేవా రంగానికీ ఈ పథకం వర్తించదు.

16. మిశ్రమ పన్ను చెల్లింపు పథకం ఎంపికకు అనర్హులెవరు?

విస్తృతంగా చూస్తే.... నమోదిత వ్యక్తులలో ఐదు వర్గాలవారు ఈ పధకానికి అర్జులు కారు.

  1. రెస్టారెంట్ సేవలుకాని ఇతర విధాల సేవలందించే వారు
  2. సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ/యూటీజీఎస్టీ చట్టాల కింద పన్ను విధించదగని వస్తు సరఫరాదారులు
  3. అంతరాష్ట్ర వస్తు సరఫరాదారులు
  4. ఎలక్ట్రానిక్ వ్యాపార నిర్వాహకులద్వారా వస్తు సరఫరా చేసేవారు
  5. జాబితాలో ప్రకటించిన కొన్ని నిర్దిష్ట వస్తు తయారీదారులు

17. మిశ్రమ పథకం కింద నమోదు చేసుకున్న వ్యక్తి ఉత్పాదక పన్ను మినహాయింపు కోరే వీలుందా?

లేదు. మిశ్రమ పధకం కింద నమోదు చేసుకున్న వ్యక్తి ఉత్పాదక పన్ను మినహాయింపు కోరేందుకు అనర్హుడు.

18. మిశ్రమ పథకం కింద నమోదు చేసుకున్న వ్యక్తి నుంచి కొనుగోళ్లు చేసిన ఖాతాదారు తాను చెల్లించిన మిశ్రమ పన్నును ఉత్పాదక పన్ను మినహాయింపు కింద వాపసు కోరే అవకాశం ఉందా?

లేదు. మిశ్రమ పథకం కింద నమోదు చేసుకున్న వ్యక్తి నుంచి కొనుగోళ్లు చేసిన ఖాతాదారు తాను చెల్లించిన మిశ్రమ పన్నును ఉత్పాదక పన్ను మినహాయింపు కింద వాపసు కోరే అవకాశం ఉండదు. ఎందుకంటే మిశ్రమ పన్ను పధకం కిందగల సరఫరాదారులు పన్ను రసీదు జారీ చేయలేరు.

19. మిశ్రమ పన్నును వినియోగదారుల నుంచి వసూలు చేసే వీలుందా?

లేదు. మిశ్రమ పథకం కింద నమోదైన వ్యక్తి పన్ను రసీదు జారీచేసే అవకాశం లేదుగనుక సరఫరాదారు హోదాలో వినియోగదారుల నుంచి పన్ను వసూలు చేసేందుకు అనుమతి లేదు.

20. మిశ్రమ పథకం కింద నమోదు అర్హత నిర్ధారణ కోసం మొత్తం వార్షిక వ్యాపార పరిమాణాన్ని లెక్కించడం ఎలా?

మొత్తం వార్షిక వ్యాపార పరిమాణం లెక్కించే పద్దతిని చట్టంలోని సెకన్ 2(6) వివరిస్తుంది. దీని ప్రకారం "మొత్తం వార్షిక వ్యాపార పరిమాణం" అంటే ఒకే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)గల ఒక వ్యక్తి నుంచి వెలుపలికి వెళ్లే అన్ని సరఫరాలు (పన్ను విధించదగిన+మినహాయించదగిన సరఫరాలు+ఎగుమతులు+అంతర్రాష్ట్ర సరఫరాలు) పరిగణనలోకి వస్తాయి అయితే, ఇందులోనుంచి అతడు చెల్లించిన కేంద్ర (సీజీఎస్టీ), రాష్ట్ర (ఎస్టీఎస్టీ), కేంద్రపాలిత ప్రాంత (యూటీజీఎస్టీ), సమీకృత (ఐజీఎస్టీ) పన్నును, పరిహార రుసుమును తీసివేయాలి. అలాగే మొత్తం వార్షిక వ్యాపార పరిమాణాన్ని లెక్కించేటపుడు ఎదురు చెల్లింపు పద్ధతికింద పన్ను చెల్లించి కొనుగోలు చేసిన వస్తుసేవల విలువను పరిగణనలోకి తీసుకోరాదు.

 

21. నిబంధనలకు విరుద్ధంగా మిశ్రమ పథకం కింద నమోదు చేసుకున్న వ్యక్తి ఎలాంటి శిక్షా పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది?

పన్ను విదించదగిన వ్యక్తి తనకు అర్హత లేకపోయినా నిబంధనలను ఉల్లంఘించి మిశ్రమ పథకం కింద పన్ను చెల్లించినట్లయితే సెకన్ 73 నిబంధనలకింద శికార్డుడవుతాడు లేదా పూర్తి పన్నుతోపాటు జరిమానా విధించేందుకు సెక్షన్ 74ను వర్తింపజేయవచ్చు.

 

22. జీఎస్టీ విధింపు నుంచి ఏవైనా సరఫరాలను మినహాయించే అధికారాన్ని జీఎస్టీ చట్టం ప్రభుత్వానికి ఇచ్చిందా?

ఇచ్చింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జీఎస్టీ మండలి సిఫారసుల మేరకు వస్తువులు, సేవలు లేదా రెండింటి సరఫరాపై కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా లేదా పాక్షికంగా కొన్ని షరతులకు లోబడి లేదా పూర్తిస్థాయిలో జీఎస్టీ విధింపును మినహాయించవచ్చు. అంతేగాక కొన్ని ప్రత్యేక స్వభావంగల పరిస్థితులున్నపుడు ప్రత్యేక ఉత్తర్వులద్వారా ఎలాంటి వస్తుసేవలనైనా పన్ను నుంచి మినహాయించవచ్చు. అలాగే సీజీఎస్టీ కింద మంజూరు చేసే మినహాయింపు ఏదైనా ఎస్టీఎస్టీ, యూటీజీఎస్టీ చట్టాల ప్రకారం కూడా వర్తించే వెసులుబాటును కల్పించింది.

23. వస్తువులు, సేవలు లేదా రెండింటిపైనా వసూలు చేసిన మొత్తం పన్నుకు పూర్తిగా మినహాయింపు మంజూరు చేస్తే, ఏ వ్యక్తి అయినా పన్ను చెల్లించవచ్చా?

లేదు. పన్ను విధింపునుంచి మినహాయించిన వస్తువులు లేదా సేవల సరఫరాదారు అమలులో ఉన్నదానికన్నా అధికశాతం పన్ను వసూలు చేసే వీల్లేదు.

Read more about: gst, జీఎస్టీ, taxes
English summary

major doubts for business persons under gst whom to pay tax and how much

Supplies of all goods and services are taxable except alcoholic liquor for human consumption. Supply of petroleum crude, high speed diesel, motor spirit (commonly known as petrol), natural gas and aviation turbine fuel shall be taxable with effect from a future date. This date would be notified by the Government on the recommendations of the GST Council.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC