For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీతో బీమా ప్రీమియం రేట్లు పెరుగుతాయ్‌

వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానంలో ప్రతిపాదిత శ్లాబ్‌తో బీమా ప్రీమియంలు స్వల్పంగా పెరగొచ్చని, అయితే మొత్తం మీద ఇన్సూరెన్స్‌ రంగంపై మాత్రం ప్రభావం పెద్దగా ఉండబోదని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్

|

వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానంలో ప్రతిపాదిత శ్లాబ్‌తో బీమా ప్రీమియంలు స్వల్పంగా పెరగొచ్చని, అయితే మొత్తం మీద ఇన్సూరెన్స్‌ రంగంపై మాత్రం ప్రభావం పెద్దగా ఉండబోదని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ చైర్మన్ టీఎస్‌ విజయన్ చెప్పారు. గతంలో లానే ప్రస్తుతం కూడా పన్ను రేట్ల పెంపు ప్రభావాలను బీమా రంగం త‌ట్టుకోగ‌ల‌ద‌ని ఆయన భ‌రోసా వ్య‌క్తం చేశారు.

 బీమా రంగంపై జీఎస్టీ ప్ర‌భావం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య మండళ్ల సమాఖ్య ఫ్యాప్సీ .. బీమా రంగంలో వ‌స్తున్న కొత్త పోకడలపై నిర్వహించిన సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా విజయన్ ఈ విషయాలను వెల్ల‌డించారు. బీమా పాలసీల ప్రీమియంలపై ప్రస్తుతం 15 శాతంగా ఉన్న ప‌న్ను రేటు జీఎస్‌టీ విధానంలో 18 శాతానికి పెరగనున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూడా తోడ్పాటు అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇన్సూరెన్స్ రంగ వృద్ధికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, వివిధ రీఇన్సూరెన్స్ కంపెనీలు కూడా భారత్‌లో శాఖలు ప్రారంభిస్తున్నాయని విజయన్ తెలిపారు.

Read more about: gst taxes insurance
English summary

జీఎస్టీతో బీమా ప్రీమియం రేట్లు పెరుగుతాయ్‌ | gst impact on insurance in India

With a hike in post-GST rates to 18% from the current 15%, both the insurance sector and banking sector are poised to get more expensive after July 1. Impact of gst on insurance and banking will increase the premiums especially for families that pay for health, life and a car insurance.For policyholders, the general insurance premium will rise as tax has increased from 15 to 18%.
Story first published: Saturday, June 17, 2017, 1:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X