For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీడీఎస్ఎల్ ఐపీవో సోమ‌వారం ప్రారంభం

బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ) ప్రమోట్‌ చేసిన సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌(సీడీఎస్‌ఎల్‌) పబ్లిక్‌ ఇష్యూ సోమవారం(19న) మొదలుకానుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 145-149కాగా.. ఇష్యూ ఈ నెల 21న‌(బుధ‌వారం

|

బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ) ప్రమోట్‌ చేసిన సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌(సీడీఎస్‌ఎల్‌) పబ్లిక్‌ ఇష్యూ సోమవారం(19న) మొదలుకానుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 145-149కాగా.. ఇష్యూ ఈ నెల 21న‌(బుధ‌వారం) ముగియనుంది. డిపాజిటరీ సేవలందించే సీడీఎస్‌ఎల్‌ ఐపీవో ద్వారా రూ. 1500 కోట్ల విలువను స‌మీక‌రించాల‌ని ప్ర‌ణాళిక ర‌చించింది.

 సీడీఎస్ఎల్ ఐపీవో

ఐపీవో తరువాత కంపెనీలో బీఎస్‌ఈ వాటా 24 శాతానికి పరిమితంకానుంది. ప్రస్తుతం బీఎస్ఈకి 50 శాతానికిపైగా వాటా ఉంది. కాగా.. ఈ ఇష్యూ ద్వారా సీడీఎస్‌ఎల్‌ దేశంలోనే తొలి లిస్టెడ్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ కంపెనీగా నిలవనుంది. ఇప్పటికే మాతృ సంస్థ బీఎస్‌ఈ జనవరిలో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టడం ద్వారా దేశంలో లిస్టింగ్‌ పొందిన తొలి ఎక్స్ఛేంజీగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఐపీవో ద్వారా బీఎస్‌ఈ రూ. 1243 కోట్లను సమీకరించింది. త్వరలోనే బీఎస్‌ఈకి ప్రధాన ప్రత్యర్థి అయిన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) సైతం లిస్ట్‌కానుంది.

Read more about: cdsl ipo
English summary

సీడీఎస్ఎల్ ఐపీవో సోమ‌వారం ప్రారంభం | cdsl ipo to open on jun 19th

Central Depository Services India (CDSL) will launch its much-awaited initial public offering (IPO) on June 19. Promoter BSE will sell 26 per cent stake in the depository via the IPO to comply with the shareholding requirement imposed by markets regulator Securities and Exchange Board of India (Sebi)
Story first published: Saturday, June 17, 2017, 16:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X