For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీ అమ‌లు జులై 1 నుంచే

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) జులై 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. సజావుగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని తెలిపింది. జీఎస్‌టీ అమలును వాయిదా వేస్తారన్న వదంత

|

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) జులై 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. సజావుగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని తెలిపింది. జీఎస్‌టీ అమలును వాయిదా వేస్తారన్న వదంతులను తోసిపుచ్చింది.

 జీఎస్టీ గురించి 10 ఆస‌క్తిక‌ర విష‌యాలు జీఎస్టీ గురించి 10 ఆస‌క్తిక‌ర విష‌యాలు

 జీఎస్టీ అమ‌లు ఆల‌స్యం కాదు

కొత్త పన్ను విధానం అమలును వాయిదా వేయాలని పరిశ్రమలో కొన్ని వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరో నెల పాటు వాయిదా వేయాలని పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్ర కూడా ప్రతిపాదించారు. జులై 1 నుంచి జీఎస్‌టీని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఎక్సైజ్‌, కస్టమ్స్‌ కేంద్ర బోర్డు.. రాష్ట్రప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ చివరి వ్యాపారికి కూడా చేరువయ్యేలా వ్యాపారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ముమ్మరం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎస్‌టీ అమలు వాయిదా పడుతోందన్న వదంతులు తప్పు అని, వాటిని నమ్మవద్దని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా ఒక ట్వీట్‌లో తెలిపారు.

Read more about: gst
English summary

జీఎస్టీ అమ‌లు జులై 1 నుంచే | Goods and Services Tax from July 1

The government is set to roll out GST or Goods and Services Tax from July 1. Amid concerns regarding new paperwork once GST kicks in, the Central Board of Excise and Customs has come out with a few clarifications on facts highlighting GST provisions relating to invoice for trade.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X