For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

25 వేల హాట్‌స్పాట్ల‌ను ఇన్‌స్టాల్ చేయ‌నున్న బీఎస్ఎన్ఎల్‌

వ‌చ్చే 12 నెల‌ల్లో ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ మార్కెట్ వాటాగా 11 శాతం ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న‌ట్లు టెలికాం మంత్రి మ‌నోజ్ సిన్హా శుక్ర‌వారం వెల్ల‌డించారు. బీఎస్ఎన్ఎల్, యూఎస్‌వోఎఫ్‌(యూనివ‌ర్స‌ల్ స‌

|

వ‌చ్చే 12 నెల‌ల్లో ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ మార్కెట్ వాటాగా 11 శాతం ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న‌ట్లు టెలికాం మంత్రి మ‌నోజ్ సిన్హా శుక్ర‌వారం వెల్ల‌డించారు. బీఎస్ఎన్ఎల్, యూఎస్‌వోఎఫ్‌(యూనివ‌ర్స‌ల్ స‌ర్వీస్ ఆబ్లిగేష‌న్ ఫండ్‌) మ‌ధ్య ఒప్పందం సంద‌ర్భంగా మాట్లాడుతూ "ఈసారి మార్కెట్ వాటాలో 0.3% వృద్దిని ఆశిస్తున్నాం. మ‌ళ్లీ సారి క‌లిసిన‌ప్పుడు వృద్ది రేటు 10% క‌న్నా త‌క్కువ ఉండ‌కూడ‌దు. అయితే నేను అది 10.5% ఉండ‌గ‌ల‌దు అనుకుంటున్నా, ఒక‌వేళ అది 11% దాటితే బీఎస్ఎన్ఎల్ కోసం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటాం" అని అన్నారు.

25వేల బీఎస్ఎన్ఎల్ హాట్ స్పాట్లు

బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా ఏడాది కాలంలో 9.05% నుంచి 9.35%కు పెరిగింది. శాతాల వారీగా చూస్తే వృద్ది 3.3% పెరిగిన‌ట్లుంది. బీఎస్ఎన్ఎల్, యూఎస్‌వోఎఫ్ మ‌ధ్య కుదిరిన ఒప్పందం ప్ర‌కారం టెక్నాల‌జీ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ పెంపుకు బాటలు ప‌డ‌తాయి. దీని ప్ర‌కారం వ‌చ్చే 4 నెల‌ల్లో 942 కోట్ల రూపాయల‌తో 25 వేల రూర‌ల్ ఎక్స్చేంజీల‌కు సంబంధించి 25 వేల హాట్‌స్పాట్‌ల ఏర్పాటు జ‌రుగుతుంద‌ని సిన్హా చెప్పారు. ఇప్ప‌టికే చాలా వాటాల మార్పు జ‌రిగింద‌ని, జూన్ 30 నాటిక‌ల్లా భారత్‌నెట్ ప్రాజెక్ట్ ఫేజ్‌-1లో భాగంగా బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల పెంపును పూర్తిచేయాల‌ని బీఎస్ఎన్ఎల్ అధికారుల‌కు సూచించారు.

Read more about: bsnl telecom
English summary

25 వేల హాట్‌స్పాట్ల‌ను ఇన్‌స్టాల్ చేయ‌నున్న బీఎస్ఎన్ఎల్‌ | BSNL To Install 25,000 Wi-Fi Hotspots Eyes 11percent Market Share

Under an agreement signed between BSNL and the Universal Service Obligation Fund, a corpus for rural telecom services, the company will install 25,000 wi-fi hotspots in rural areas with an outlay of Rs. 942 crore within four months.
Story first published: Saturday, June 10, 2017, 16:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X