For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్‌టీలో పన్ను లేని వ‌స్తువులు ఏవి?

జీఎస్టీపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. కొన్ని ఉత్ప‌త్తుల‌పైన అస‌లే ప‌న్ను లేకుండా కేంద్రం జాగ్ర‌త్త ప‌డింది. వివిధ వ‌ర్గాల నుంచి జీఎస్టీ ప‌న్ను రేట్లు మార్చాల్సిందిగా విన‌తులు వ‌స్తున్నాయి. ఈ నేప

|

జీఎస్టీపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. కొన్ని ఉత్ప‌త్తుల‌పైన అస‌లే ప‌న్ను లేకుండా కేంద్రం జాగ్ర‌త్త ప‌డింది. వివిధ వ‌ర్గాల నుంచి జీఎస్టీ ప‌న్ను రేట్లు మార్చాల్సిందిగా విన‌తులు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ లేని వస్తువుల జాబితాను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

ఈ వ‌స్తువుల‌పై జీఎస్టీ లేద‌ట‌

ఆహార పదార్థాలు, పిండి, పప్పు దినుసులు, తృణధాన్యాలు, గోధుమలు, మైదా, శెనగపిండి, పాలు, కూరగాయలు, తాజా పండ్లు, ఉడికించిన బియ్యం, సాధారణ ఉప్పు, పశువుల దాణా, సేంద్రీయ ఆహార పదార్థాలు, ముడి సిల్కు, ముడి ఉన్ని, జనపనార వస్తువులు, చేతివృత్తుల ద్వారా తయారవుతున్న వ్యవసాయ సామగ్రికి పన్ను మినహాయింపు ఉన్నట్లు నోటిఫికేష‌న్‌లో వివ‌రించారు.. బ్రాండెడ్‌ ఆహార పదార్థాల విషయంలో మాత్రం 5 శాతం విధిస్తున్నట్టు పేర్కొంది. జీఎస్టీలో మొత్తం మీద నాలుగు ర‌కాల ప‌న్ను రేట్లు ఉన్నాయి. ఆ ప‌న్ను శాతాలు 5,12,18,28 గా ఉన్నాయి. విలువైన లోహాలు (బంగారం,వెండి), ఆభ‌ర‌ణాలు 3 శాతం ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తాయి. క‌ఠిన త‌ర‌హా వ‌జ్రాలపై 0.25% జీఎస్టీ అమ‌ల‌వుతుంది. జీఎస్టీ అమ‌లు ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో ఉన్న ప‌రోక్ష ప‌న్నుల‌న్నీ తొల‌గిపోతాయి.

Read more about: gst gold taxes
English summary

జీఎస్‌టీలో పన్ను లేని వ‌స్తువులు ఏవి? | what products are exempted from gst

The government today said foodgrains, flour, milk, vegetables and fruits will get cheaper by up to 5 percent once the Goods and Services Tax is rolled out.The government has exempted cereals, pulses, atta, maida and besan from the GST, which will be implemented from 1 July.
Story first published: Friday, June 9, 2017, 14:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X